జాతీయ వార్తలు

కన్హయ్య కుమార్ వంటిపై గాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19: జవహర్‌లాల్ నెహ్రూ విశ్వ విద్యాలయం విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య కుమార్‌పై బుధవారం పాటియాల హౌస్ కోర్టు కాంప్లెక్స్ వద్ద దాడి జరిగినప్పుడు ఆయన వంటిపై గాయాలయినట్లు ఆయన వైద్య పరీక్ష నివేదిక స్పష్టంగా పేర్కొన్నప్పటికీ ఢిల్లీ పోలీసు కమిషనర్ బిఎస్ బస్సీ మాత్రం ఆ ఆరోపణలను తోసిపుచ్చారు. కన్హయ్య కుమార్ ఎడమ కాలి బొటన వేలు వాచిపోవడంతో పాటు ఆయన ఎడమ కాలు, ముక్కుపై అనేక చోట్ల చర్మం గీరుకుపోయిన గాయాలున్నట్లు వైద్య పరీక్ష నివేదికలో పేర్కొన్నట్లు పోలీసు వర్గాలు శుక్రవారం తెలిపాయి. అయితే ఢిల్లీ పోలీసు కమిషనర్ బిఎస్ బస్సీ మాత్రం కన్హయ్యప దాడి జరిగిందన్న వార్తలు నిజం కాదని పోలీసు అధికారులు తనకు చెప్పారన్నారు. అయితే వ్యవహారం సుప్రీంకోర్టు ముందు ఉన్నందున దీనిపై వ్యాఖ్యానించడం సరికాదని కూడా ఆయన అన్నారు.
ఇదిలా ఉండగా, సాహితీ గోష్ఠి నిర్వహిస్తామని చెప్పి నిర్వాహకులు ఈ నెల 9న జెఎన్‌యులో అఫ్జల్ గురుకు మద్దతుగా కార్యక్రమాన్ని నిర్వహించారని జెఎన్‌యు టీచర్స్ అసోసియేషన్ సభ్యుడు మకరంద్ పరంజపే ఆరోపించారు. కవతా గోష్ఠి నిర్వహిస్తామని, ఆరేడుగురికన్నా ఎక్కువ మంది ఉండరని కార్యక్రమాన్ని నిర్వహించే వారు చెప్పారని, అయితే చివరికి అది అఫ్జల్ గురు సంస్మరణ కార్యక్రమంగా మారిపోయిందని పరంజపే అన్నారు.