కడప

జిల్లాలో మహిళా అధికారులకే పెద్దపీట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,మార్చి 19: జిల్లాకు మహిళా అధికారులనే నియమించేందుకు రాష్ట్రప్రభుత్వం మొగ్గుచూపుతోంది. ముఖ్యంగా ప్రతిపక్షం బలంగా ఉన్న, సమస్యాత్మకమైన కడప జిల్లాలో జిల్లా అధికారులుగా నియామకం చేస్తే సమస్యలు ఎదురౌతాయని మహిళా అధికారులను నియమించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా జిల్లా పంచాయతీ అధికారిణిగా గుంటూరు డిపివో శ్రీదేవిని నియమించారు. ప్రస్తుతం జాయింట్ కలెక్టర్‌గా శే్వత టియోటియ పనిచేస్తుండగా, రిమ్స్ డైరక్టర్‌గా కలెక్టర్ సతీమణి ఈశ్వరి, జిల్లా రెవెన్యు అధికారిణిగా సులోచన, జిల్లా పరిషత్ సిఇఓగా రజియాబేగం, సాంఘిక సంక్షేమశాఖ డిడిగా సరస్వతి, ఎస్సీ కార్పొరేషన్ ఇడిగా ప్రతిభాభారతి, స్టెప్ సిఇవోగా, బిసి కార్పొరేషన్ ఇన్‌చార్జ్ ఇడిగా మమత పనిచేస్తున్నారు. ఐసిడిఎస్ ప్రాజెక్టు డైరెక్టర్‌గా రాఘవరావు పనిచేస్తుండగా, అంగన్వాడీ కేంద్రాల్లో ఈపాస్ యంత్రాలు సక్రమంగా నిర్వహించడం లేదని రాష్ట్రప్రభుత్వం ఆయనపై త్వరలో వేటువేయాలని భావిస్తోంది. ఆ స్థానంలో కూడా మహిళా అధికారినే నియామకానికి రంగం సిద్దమైనట్లు తెలుస్తోంది. మొత్తమీద జిల్లాలో మహిళా అధికారులదే పైచేయిగా ఉంది.