మేలో వస్తున్న కబాలి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ప్రముఖ నటుడు రజనీకాంత్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో భారీగా రూపొందుతున్న చిత్రం ‘కబాలి’. కలైపూలి ధాను నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటీవలే మలేషియా షెడ్యూల్ పూర్తిచేసుకుని, పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా చిత్ర వివరాలను గురించి నిర్మాత తెలియజేస్తూ, ఇటీవలే మలేషియా జరిపిన భారీ షెడ్యూల్‌తో షూటింగ్ పూర్తయిందని, పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలుపెట్టామని, ఏప్రిల్ మొదటివారంలో టీజర్‌ను, రెండో వారంలో పాటలను విడుదల చేసి, మేలో చిత్రాన్ని విడుదల చేస్తామన్నారు. రజనీకాంత్‌తో సినిమా తీయాలనే కోరిక ఈ సినిమాతో నెరవేరిందని, ఇందులో ఆయన మాఫియా డాన్‌గా కనిపిస్తారని, అప్పట్లో ఆయన చేసిన ‘బాషా’ సినిమాలో కనిపించిన స్టయిల్‌లోనే ఉంటాడని చెప్పారు. ఇందులో చైనా సూపర్‌స్టార్ విల్‌స్టన్‌చౌ విలన్‌గా నటించడం విశేషమని, రాధికాఆప్టే, ధన్సిక ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చే విధంగా రూపొందుతోందన్నారు. ఈ చిత్రానికి కెమెరా: మురళి, సంగీతం: సంతోష్‌నారాయణ్, మాటలు: సాహితి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: దేవి శ్రీదేవి, సతీష్, నిర్మాత: కలైపులి ఎస్‌ధాను, దర్శకత్వం: పా రంజిత్.