రాజమండ్రి

నిర్లక్ష్యం (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అప్పుడే ఆఫీసు నుంచి ఇంటికి వచ్చిన సోమనాథం తన భార్య ఇచ్చిన కాఫీ తాగుతూ సోఫాలో కూర్చున్నాడు. సోమనాథం ఒక ప్రైవేటు స్కూలులో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాడు. ఎంతో ఆనందంగా తన రోజులను గడుపుతున్న సోమనాథం ఆనాడు ఎందుకో విచారంగా కనిపించాడు. భర్త మొహంలో ఉన్న విచారమును కనిపెట్టిన సీత మీరు కూడా నేను ఆలోచిస్తున్నదే ఆలోచిస్తున్నారా అని అడిగింది. అవును అన్నట్టుగా తల ఊపాడు సోమనాథం. మన అబ్బాయి ధోరణి నాకు అంతుచిక్కడం లేదండి. వాడిని కొంచెం తిట్టో, కొట్టో సరైన దారికి తీసుకురండి అని విచారంగా చెప్పింది సీత. తనకు కూడా ఏదోటి చేయాలని ఉన్నా ఏమి చేయాలో తెలియని సోమనాథం వౌనం వహించాడు.
అజయ్. సోమనాథం, సీత యొక్క ఒక్కగానొక్క కొడుకు. ఒకడే కొడుకు కావడంతో అత్యంత గారాభంగా పెంచారు. చిన్నప్పటి నుంచి భయం, భక్తి నేర్పినా అవి అజయ్‌పై ఏ ప్రభావాన్ని చూపలేదు. ఇంటర్మీడియట్ తరువాత ఏమి చేస్తావని సోమనాథం అడిగితే కేవలం తన స్నేహితులు ఇంజనీరింగ్ చదువుతున్నారనే ఏకైక కారణంతో తాను కూడా అదే చదువుతానని పట్టుబట్టాడు.
కేవలం పట్టుబట్టాడే కాని దానికి జరిగిన ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేకపోయాడు. కేవలం తాను సాధన చేయకపోవడమే సోమనాథం చదవమని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు. చివరికి పరీక్షలో ఫెయిల్ అయ్యాడు. కన్వీనర్ కోటాలో సీటు కొనమని కొనకపోతే చస్తానని బెదిరించాడు. ఇక చేసేది ఏమిలేక సోమనాథం ఐదు లక్షలు అప్పుచేసి సంపాదించాడు.
యూనివర్శిటీ వైజాగ్‌లో ఉండటం వలన అజయ్‌ని హాస్టల్‌లో పెట్టారు. కాలేజీలో అజయ్ క్లాసులు మాని స్నేహితులతో జులాయిగా తిరగడం ప్రారంభించాడు. ప్రిన్సిపాల్ టిసి ఇస్తానని హెచ్చరించినా వినలేదు. అమ్మాయిల వెంట తిరుగుతూ, చదువుని వదిలేసి, తాగుడికి బానిస అయ్యాడు. ఇంజనీరింగ్‌లో ఫెయిల్ అయి వారం క్రితం ఇంటిబాట పట్టాడు.
తన కొడుకు భవిష్యత్తు ఇలా అయిందని తెలిసిన సోమనాథం దంపతులు వాళ్లలో వాళ్లే కుమిలిపోయారు. ఆర్థిక స్థోమత అంతంతమాత్రంగా ఉన్నా తన కొడుకు జీవితం బాగుంటుందనే ఏకైక కారణంతో సోమనాథం కొడుకు కోరిన విధంగా చేశాడు. కానీ ఇలా జరగడంతో సోమనాథం ఎంతో బాధపడ్డాడు. తన జీవితంలో వచ్చిన అనేక ఇబ్బందులను ఎదుర్కొన్న సోమనాథం తన కొడుకు జీవితాన్ని ఎలాగైనా సరిదిద్దాలని పరిష్కారం ఆలోచించాడు.
ఒక రోజు మధ్యాహ్నం భోజనం అయిన తరువాత సోమనాథం అజయ్‌తో మాట్లాడటం ప్రారంభించాడు. ముందుగా నీ వయసు ఎంత అని అడిగాడు. అదేమిటి తెలియనట్లుగా అడుగుతున్నారు అని అన్నట్లుగా చూసి అజయ్ 22 అని అన్నాడు. నీ మూడో ఏట ఉన్నట్లే ఈ రోజు కూడా ఉన్నావా అని ప్రశ్నించాడు సోమనాథం. ఏమిటిది అన్నట్లుగా చూసి ఎవరైనా అలాగే ఉంటారా? పెరుగుతారు అని అన్నాడు అజయ్. పెరగడం అంటే ఏమిటి? అని అడిగాడు సోమనాథం. పెరగడమంటే... అని ఆగిపోయాడు అజయ్. పెరగడం అంటే నీ కాళ్లు, చేతులు, ఒళ్లు పెరగడం కాదు. నీ బుద్ధి పెరగడం, తెలివితేటలు పెరగటం, ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలియడం, లక్ష్యం పెట్టుకోవడం, లక్ష్యసాధన చేసి లక్ష్యాన్ని సాధించడం ఇది... పెరగటం అంటే. నీ 22 ఏళ్ల జీవితంలో నీ లక్ష్యం ఏమిటి? నీవు నీ జీవితం నుండి ఏమి నేర్చుకున్నావు? ఇప్పుడు నీ చేతిలో జీవితానికి ఉపయోగపడేది ఏముంది. లక్ష్యం అంటే పక్కవాళ్లు చేసేది చేయడమా? కాదు. నీకంటూ ఒక లక్ష్యం ఉండాలి. లక్ష్యంలేని మనిషి అసలు మనిషేకాడు. ఇప్పుడు చెప్పు నీవు నిజమైన మనిషివా? అని అడిగాడు సోమనాథం.
తన తండ్రి మాటలు ఒక్కొక్కటి బాణాలుగా గుచ్చుకున్న అజయ్‌కి కనువిప్పు కలిగింది. ఇన్నాళ్లు తను ఎంత నిర్లక్ష్యంగా గడిపాడో తెలుసుకున్నాడు. తన తండ్రి కాళ్లని పట్టుకుని క్షమించమని కోరాడు.
తన కొడుకులో వచ్చిన మార్పుకు సంతోషించిన సోమనాథం తన కొడుకుని ఓదార్చుతూ నీ జీవితం ఇంకా అయిపోలేదు. తప్పులు చేయడం మానవ సహజం. దెబ్బలను తింటున్నా లక్ష్యాన్ని చేరుకోవడం మనిషి లక్షణం. ఇప్పటికైనా మేలుకో, లక్ష్యాన్ని నిర్ణయించుకుని సాధన చేసి లక్ష్యాన్ని చేరుకో. ఉన్నత శిఖరాలను అధిరోహించు అని కొడుకుకి ధైర్యం చెప్పాడు. తన తప్పు తెలుసుకున్న అజయ్ తన తండ్రి మాటలు పాటిస్తూ గొప్ప ఇంజనీర్ అయి తన తల్లిదండ్రులను సంతోషపరిచాడు.
- డి శ్రావణి
కాకినాడ, సెల్: 7731849060
***

చమత్కారాల పద్య ప్రసాదం! (కథ)

‘వద్దనరాదు భోజనము, వద్దనరాదు ఫలంబు, పుష్పముల్
వద్దనరాదు, మోహమున వద్దకు వచ్చిన కాంత కౌగిలిన్
వద్దనరాదు స్నేహితుని పల్కులు నీదు హితంబు గోరినన్
వద్దనరాదు భామవి సపర్యలు చల్లని సంధ్యవేళలన్!
చూశారా.. ఈ పద్యం ఎంత తేలికగా ఉందో! తేలికగా రచన చేయటం అంత తేలికగాదండీ! ఇలా రాసిన ఆయన ‘ఈ కవనమె నా జీవనము, ఈ కవనమె నాకు వ్యసన’మని ప్రకటించుకున్నారు. అంతేకాదు- ‘కవితపై గౌరవముంచిన వారంతా నాకు మాన్యులనీ, వారితో నేను చుట్టరికాన్ని కలుపుకుంటానని అంటూ తనకున్న ‘కవిమిత్ర’ బిరుదును సార్థకం చేసుకున్నారు.
ఇంతకీ ఈయన తెలుగు పండితునిగా ఉద్యోగించినవారు కాదు. కానీ ఇంద్రగంటి హనుమచ్ఛాస్ర్తీ గారు గురువర్యులై ఉత్తేజాన్నిచ్చారు. సర్వశ్రీ జొన్నవిత్తుల, బేతవోలు, శ్రీకాంతశర్మ వంటి మిత్రులు ప్రోత్సహించారు. కానీ వృత్తి మాత్రం స్టేట్ బ్యాంకులో ఉద్యోగం. రిటైరయ్యారు. పేరు వాడ్రేవు వెంకట సత్యప్రసాద్ గారు.
1962లో రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో చదువుతున్నపుడు ‘్ధనం’ గురించి పద్య కవితల పోటీ పెట్టినపుడు..
‘్ధనమా! బహుముఖముల సా
ధనమా! కోర్కెలకు మూలధనమా
నా ఇంధనమా! జీవితపున్ బో
ధనమా! నీ మహిమలెన్నతరమా! నాకున్!’
ఇత్యాదిగా పద్యాలు రాసి బహుమతి కొట్టేశారు. పోతన భాగవతంలోని ‘లేమా! దనుజుల గెలువలేమా!’.. అనే పద్య స్ఫూర్తితో రాశారు పైరీతిగా గొప్ప పద్యాన్ని.
‘కుక్కపిల్లా, సబ్బుబిళ్లా, అగ్గిపుల్లా కాదేదీ కవిత కనర్హం’ అన్న శ్రీశ్రీ స్ఫూర్తితోనూ పద్యాలు రాసిన వాడ్రేవు వారు మచ్చుకి అగ్గిపుల్ల మీద ఆటవెలదిని ఎలా వెలిగించారో చూడండి.
‘అగ్గిపుల్లయైన, అగరుబతె్తైనను
ఎండుపుల్లనంటి యుండునట్లు
భర్త వెనుక భార్య ప్రతిభ కన్పడుచుండు
వెలగబోడు ఆమె వెనుకలేక!’
‘్భర్య వెనుక భర్త ప్రతిభ కన్పడుచుండు
వెలగబోదు అతడు వెనుకలేక!’ అని మార్చి చదువుకోడానికి వీలుగా సందేశాత్మకంగా గొప్ప చమత్కారం చేశారు సత్యప్రసాద్ గారు.
‘ఇంటావిడ లేనప్పుడు
వంటావిడ వంటగూర్చి వహ్వా! యందున్
ఇంటావిడ యున్నప్పుడు
వంటావిడ వంటగూర్చి పలుకగ తరమే!’
అని ఓసారి ఆయన పలికిన కందంలో స్వచ్ఛ చమత్‌‘కార’ కాంతి కనబడటం లేదూ!- సంసారపక్షంగా. ‘పెళ్లిచూపులు - తదనంతరం’ శీర్షికలో స్ర్తి పురుష తత్వాలను సరదాగా ఎలా చమత్కరించారో చూడండి- అవే పదాలతో రెండు పద్యాలను రాసి మగవారి వైపు:-
‘పెళ్లిచూపులందు పిల్లిగ కనిపించు
పుస్తె కట్టగానె పులిగ మారు
ఆడవారి తత్త్వ మరయంగ వశవౌనె
ఎంత చదువుకున్న ఎవరితరము?’
ఆడవారి వైపు:- ‘పెళ్లిచూపులందు పిల్లిగ కనిపించు...’ అనే పై పద్యానే్న తిప్పారు చమత్కారంగా. సంసార పక్షమైన ఈయన చమత్కార సరదా పద్యాల్లో అమాయకత్వం కూడా కనిపిస్తూ ఉంటుంది. అందుకు వీరి శ్రీమతి ఉమాకామేశ్వరి గారి గుణగణాలను తెలిపిన ఆటవెలది పద్యం నిదర్శనం.
‘మిడిసిపాటు లేదు గడుసుతనము లేదు
అదరగొట్టబోదు ఆదరించు
కల్లలాడబోదు కపటమెరుంగదు
కటువుమాట లేదు కవిత వినదు!’
‘కవిత విన’దని ఉన్నదున్నట్టుగా చెప్పటంలోనే ఉంది అమాయకత్వ రూపమైన చమత్కారం. సాధారణమైన ఇల్లాలి గురించి రాసిన ఈయన ఆటవెలదిని గూడా ఎవరు కాదనలేరు.
‘ఆదివారమొకటి ఆ మరురోజున
బందు జరుగు గుండె బాదుకొందు
శలవచ్చెనేని సంసార నౌకకు
చిల్లుపడును ఖర్చు బిల్లు పెరిగి!’.. ఇలా అతి సామాన్య విషయాలను అందరి స్పందనలకు ప్రతినిధిగా అలవోక పద్యాలను రాయటంలోనే ఉంది చమత్కారం.
‘హైద్రబాదునందు ఆటో ప్రయాణమ్ము
గూబ గుయ్యిమనును జేబు చిల్లు
మేటి ధీరుడతడు మీటరు ఛార్జిపై
ఎక్కువీయకుండ ఎక్కెనేని’.. ఇత్యాదిగా నిత్యమూ అనుభవించే హై‘్ధర‘బాధ’లను తేలికగా తెలియజెప్పారు సత్యప్రసాద్ గారు. ఇవన్నీ వీరి ‘పద్యప్రసాదం’ అనే ఖండకావ్య సంపుటిలో కనిపిస్తాయి. అప్పుడప్పుడూ వీరు రేడియో, టీవీలలో పూరించిన సమస్యాపూరణలలో సైకిలు, రిక్షా, ఆటో, కారు పదాలకు అర్థాలను మారుస్తూ భారతార్థంలో మత్త్భేంలో ఎలా నడిపించారో చూడండి- చమత్కారంగా!
‘అనుమా! సై!కిలుమున్ వదల్చెదను
శౌర్యాగ్నుల్ విజృంభించగన్
ఇనుడే సాక్షిగ పల్కెదన్ వినుము వైరి క్షాళనే ధ్యేయమై
దునుమన్ కౌరవసేన నంతట పటాటోపంబులున్ జెల్లు! కా
దను నారుూ కురువృద్ధులున్న సభ! తత్కారుణమే పారగన్!’
ఈ ఖండకావ్య సంపుటిలో కేవలం పద్య కవితలేకాక, ఆకాశవాణి- విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమైన లలిత గేయాలున్నాయి. ‘కాలానికి వౌన సాక్షలు, చరిత్రకి నిద్రిస్తున్న అక్షులు, బుద్ధిని బంధించే విరూపాక్షులు’.. ఇత్యాదిగా ‘పుస్తకం’పై అంత్యనుప్రాసలతో నిర్వచనాత్మకంగా చెప్పిన వచన కవితలూ ఉన్నాయి.
‘్భక్తిప్రసూనాలు’ అనే పేరుతో ప్రత్యేకంగా దేవతాపరంగా ఒక పుస్తకానే్న వెలువరించారు వీరు తర్వాత. గేయ, వచన కవితలున్నప్పటికినీ పద్యానికి పెద్దపీట వేసిన సత్యప్రసాద్ గారి ‘పద్యప్రసాదం’ చమత్కార రుచిరమైన పద్యప్రసాదమే! అంటే.., అందాల పద్యభవనమే!!

- డా. రామడుగు వేంకటేశ్వరశర్మ,
చరవాణి : 9866944287