కథ

అసలైన వస్తాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మునిపల్లెలో ఉంటున్న వీరదాసుడు గొప్ప వస్తాదు. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ కుస్తీ పోటీలు జరిగినా వాడే పందెన్ని గెలుచుకొనేవాడు. వాడిని ఓడించడానికి సమఉజ్జీని తయారుచేయాలని ఎంతోమంది ప్రయత్నించారు కానీ ఎవరూ తయారుకాకపోవడంతో వాడిలో నానాటికి గర్వం పెరుగుతూ వచ్చింది.
ఒకరోజు వీరదాసుడు ఇంటికి సుమంతుడనే దూరపు బంధువు వచ్చాడు. భోజనాలు చేశాక అతడు మాటల్లో తమ ఊళ్లో వారం రోజుల్లో తిరునాళ్లు జరుగనున్నాయని, అందులో భాగంగా కుస్తీ పోటీలు నిర్వహించనున్నారని, ఓడిన వారు గెలిచిన వారికి లక్ష రూపాయలు ఇచ్చుకోవాలనే షరతు పెట్టారని చెప్పాడు.
సుమంతుడి మాటలు విన్న వీరదాసుడు వాళ్ల ఊళ్లో జరిగే కుస్తీ పోటీల్లో పందెం లక్ష రూపాయలు తనదేనని ఊహించుకొంటూ ‘సుమంతా! మీ ఊళ్లో నాపై పందెం కాయడానికి నాకన్నా బలవంతులైన వస్తాదులున్నారా?’ వీరదాసుడు సుమంతుడ్ని ప్రశ్నించాడు.
అందుకు సుమంతుడు సమాధానంగా ‘లేకేమీ? ఉన్నాడు. మురళీధరుడనే ఒక బక్కపీనుగు. వాడికి ఎంత కండకావరం కాకపోతే తనని ఓడించిన వాళ్లకు తనే లక్ష రూపాయలు పందెం ఇచ్చుకొంటానని వాగాడు’ అన్నాడు.
‘సుమంతా! ఆ మురళీధరుడు ఇంకా ఏమైనా షరతులు పెట్టాడా?’ మళ్లీ ప్రశ్నించాడు వీరదాసుడు.
అందుకు సుమంతుడు నవ్వుతూ ‘తనను పట్టుమని పది నిమిషాల్లో ఓడిస్తేనే గెలిచిన వారికి లక్ష రూపాయల పందెం ఇస్తానని ఆ బక్క పీనుగు మురళీధరుడు అన్నాడు. అందుకు సమ్మతమైతేనే చెప్పు వాడికి ఈ వార్త చెప్తాను’ అన్నాడు.
సుమంతుడి మాటలు విన్న వీరదాసుడు ‘వాడు విధించిన షరతుకి ఒప్పుకొన్నానులే! అయినా వాడిని ఓడించడానికి అంత సమయం అక్కర్లేదు. అసలే వాడు బక్కపీనుగంటున్నావ్. వచ్చే వారానికల్లా లక్ష రూపాయల పందెంతో సిద్ధంగా ఉండమని చెప్పు’ అన్నాడు.
మురళీధరుడు గురించి అంతా విన్నాక మొదటి పట్టుకే కుస్తీ పోటీలో వాడిని ఓడించాలని నిర్ణయించుకొని ఆ రోజు నుండి నీళ్లు తాగడం మానేసి పాలు మాత్రమే తాగుతూ ఆ వారం రోజుల్లో శరీరాన్ని బాగా పెంచుకొన్నాడు వీరదాసుడు.
తిరుణాలు జరిగే రోజు రానే వచ్చింది. సుమంతుడి ఊళ్లో కుస్తీ పోటీలు ఏర్పాటయ్యాయి. ఊళ్లో ఉన్న పెద్దమనుషులు ఆ పోటీని తిలకించడానికి వచ్చారు.
తనతో పందెం కాసిన మురళీధరుణ్ణి చూసేసరికి వీరదాసుడికి నవ్వొచ్చింది. ఇక పందెంలో లక్ష రూపాయలు తనదేనని ఊహించుకొంటూ పోటీకి దిగాడు వీరదాసుడు.
పోటీ ప్రారంభమైంది. వీరదాసుడు తొడలు, జబ్బలు చరుస్తూ ఒక్క వేటున బక్కపీనుగలా ఉన్న మురళీధరుణ్ణి కింద పడేయడానికి పట్టుకోబోయాడు కానీ అప్పటికే వాడు తను నేర్చుకొన్న మెళకువలతో తప్పించుకొన్నాడు. ఇలా నాలుగైదుమార్లు తప్పించుకొనేసరికి వీరదాసుడిలో అలసట బాగా వచ్చేసింది. అందులో వారం రోజులపాటు కేవలం పాలే తాగడం వలన అతడి కండలన్నీ కొవ్వు పట్టేశాయి. పందెం ప్రారంభమై పది నిమషాలు కాక మునుపే పడిన చోటు నుండి లేవలేక పోయాడు వీరదాసుడు.
బక్కచిక్కిన మురళీధరుడే గెలిచాడని పోటీని తిలకించడానికి వచ్చిన పెద్దమనుషులు తీర్పునిచ్చారు.
గతంలో కుస్తీ పోటీలన్నీ తన కండలు తిరిగిన శరీరంతో గెలిచాడు కానీ ఈసారి మాత్రం మురళీధరుడు తనపై ప్రయోగించిన మెళకువలతో ఓడిపోతానని ఊహించుకోలేక తన వెంట తెచ్చుకొన్న లక్ష రూపాయలను మురళీధరుడి చేతిలో పెట్టి తన గ్రామానికి వెనుదిరిగాడు వీరదాసుడు.

-బెలగాం కేశవరావు