రాష్ట్రీయం

కడప జిల్లాలో రూ.259 కోట్లు నష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెయ్యేరు నదిలో ఇద్దరు గల్లంతు * మళ్లీ మొదలైన వర్షం...జనం బెంబేలు
కడప, నవంబర్ 21: ఇటీవల కురిసిన భారీవర్షాలు, వరదల కారణంగా వైఎస్సార్ కడప జిల్లాలో 259.12కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లింది. జిల్లాలో 10,383 హెక్టార్లలో వివిధ పంటలు దెబ్బతిన్నాయి. భారీవర్షాలకు 793 ఇళ్లు నేలమట్టమై 3,777 కుటుంబాలవారు నిరాశ్రయులయ్యారు. వరద ధాటికి ఎనిమిదిమంది మృత్యువాత పడ్డారు. జిల్లాలో 102 చెరువులు, కుంటలు, వాగులు వర్షాల కారణంగా దెబ్బతిన్నాయి. ఈ మేరకు అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపించారు. ఇదిలావుండగా శనివారం చెయ్యేరు నదిని చూడటానికి వెళ్లిన ఇద్దరు యువకులు గల్లంతు కాగా, ఒక మృతదేహం లభ్యమైంది. రాజంపేట బోయపల్లె ఇస్లాంపూర్ ఎర్లగడ్డకు చెందిన షేక్ మహబూబ్‌బాష (23), నాగూర్ బాష (22) కొంతమంది యువకులతో కలిసి చెయ్యేరులో దిగి ఈతకొట్టే ప్రయత్నం చేయగా, నది ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో ఇద్దరు కొట్టుకపోయారు. వారిలో షేక్ మహబూబ్‌బాష మృతదేహం మాత్రమే లభ్యమైంది. జిల్లా వ్యాప్తంగా శనివారం మద్యాహ్నం వరకు ఎండ కాచినట్లేకాచి కారుమబ్బులు కమ్ముకుని, బద్వేలు నియోజకవర్గంలో భారీ వర్షం కురిసింది. జిల్లాలో పలుప్రాంతాల్లో ఈదురుగాలులు వీస్తూ వర్షపు జల్లులు పడ్డాయి. వీరపునాయునిపల్లె మండలంలో 250 గొర్రెలు చనిపోయాయి. దాదాపు 100 ఇళ్లు పడిపోయాయి. 39 మండలాల్లో 102 చెరువులు, కుంటలు, వాగులకు గండ్లుపడ్డాయి. పూర్తిస్థాయిలో అధికారులు సర్వేచేస్తే ప్రస్తుతం అంచనావేసిన నష్టం రెట్టింపయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. రోడ్లకోత, వాగులు తెగిపోవడం, విద్యుత్ స్థంభాల పడిపోవడం, పండ్లతోటలు, పంటల నష్టం వెరసి ప్రాథమికంగా 259.12కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు. గత ఐదురోజులుగా కురిసిన వర్షం నుంచి తేరుకోకముందే మళ్లీ జడివాన మొదలుకావడంతో జిల్లా ప్రజానీకం ఆందోళనకు ఆందోళనకు గురవుతోంది. వర్షానికి వాగులు, వంకలు, చెరువులు తెగిపోయి పంటలు తుడిచి పెట్టుకుపోయాయి. జిల్లాలో దెబ్బతిన్న రోడ్లు, వంతెనలు, విద్యుత్ సరఫరా పునరుద్దరణకు అధికారులు రెండురోజులుగా పనిచేస్తుండగా, శనివారం కురిసిన వర్షంతో పనులకు అంతరాయం ఏర్పడింది. పండ్లతోటలు, ఆకుతోటలు నేలకొరిగి వర్షపు నీటిలో మునిగిఉన్నాయి. వర్షంతో అపారనష్టం జరగంతో రైతాంగం డీలాపడింది. అయితే భూగర్భజలాలు పెరగడంతోపాటు ప్రాజెక్టులు, కాలువలు, వాగులు, కుంటలు, చెరువులకు జలకళ వచ్చింది. ఇక ఏమాత్ర వర్షాలు కురిసినా వందలాది కుంటలు, చెరువులకు ముప్పు పొంచివుంది. ఈదురు గాలులు, చలికి సాయంత్రం 6గంటలకే వృద్ధులు, పసిపిల్లలు గజగజ వణుకుతున్నారు. మళ్లీ వర్షాలు కురిస్తే ఇప్పట్లో కోలుకోలేమని ప్రజానీకం ఆందోళన చెందుతోంది.