కడప

స్టీల్‌ప్లాంట్ ఏర్పాటుకు కేంద్ర మంత్రుల హామీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,(కల్చరల్)జూలై 2: రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరచిన సెయిల్ ఆధ్వర్యంలో రూ.20వేల కోట్లరూపాయలతో కడప జిల్లాలో స్టీల్‌ప్లాంట్ ఏర్పాటుచేసేందుకు కేంద్ర ఉక్కుపరిశ్రమలశాఖ మంత్రి నరేంద్ర, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడులు హామీ ఇచ్చారని, ఇందుకోసం త్వరలో జిల్లాలో సెయిల్ టాస్క్ఫోర్స్ బృందం పర్యటిస్తుందని భారతీయ జనతాపార్టీ రాష్ట్ర నాయకులు కందుల రాజమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం స్థానిక బిజెపి కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు చైనా పర్యటనకు వెళ్లి చైనా ప్రభుత్వ సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలో రూ.3వేల కోట్లతో స్టీల్‌ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకోవడాన్ని తాము స్వాగతిస్తున్నామని కానీ ఈ స్టీల్‌ప్లాంట్ ద్వారా వందల సంఖ్యలో కూడా నిరుద్యోగ సమస్య తీరదన్నారు. దాదాపు20వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. విభజన చట్టంలో ఉన్న ఉక్క్ఫ్యుక్టరీ నిర్మాణం కోసం పార్టీలకు అతీతంగా పోరాడాల్సిన అవసరం ఉందని ఆయ న పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు పి.శ్రీనాధరెడ్డి, బిజెఎంఎం రాష్ట్ర నాయకులు చలమారెడ్డి, బిజెపి నాయకులు చలపతి, సాంబశివారెడ్డి, బిజెవైఎం నగర అధ్యక్షుడు ఓబులేసు పాల్గొన్నారు.

గండి దేవస్థానం అభివృద్ధికి కృషి

చక్రాయపేట, జూలై 2: జిల్లాలో ప్రసిద్ధిచెందిన శ్రీ గండి వీరాంజనేయస్వామి సహాయ కమిషనర్‌గా పట్టెం గురుప్రసాద్ సోమవారం పదవీబాధ్యతలు చేపట్టారు. తొలుతగా దేవస్థాన సిబ్బంది పట్టెం గురుప్రసాద్‌కు పుష్పగుచ్చం అందజేశారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ గతంలో దేవస్థానానికి ఇన్‌ఛార్జిగా పనిచేస్తుండేవారని, ప్రస్తుతం రెగ్యులర్ సహాయ కమిషనర్‌గా నివేదికలు అందాయని, పదవీ బాధ్యతలు చేపడుతున్నట్లు వారు పేర్కొన్నారు. అదే విధంగా ప్రస్తుతం దాతల సహకారంతో రూ.65 లక్షలు పలు రకాల పనులతో పాటు అంజన్న గర్భగుడి, మంటపానికి దాదాపు రూ.10 కోట్లతో ప్రతిపాదనలు దేవాదాయ శాఖకు పంపనున్నట్లు వారు పేర్కొన్నారు. గతంలో ఇన్‌ఛార్జిగా ఉన్నపుడు వారానికి ఒకసారి లేదా రెండుసార్లు వచ్చేపోయే వారమని, సంబంధిత అధికారులు రెగ్యులర్ చేయడంతో గండి దేవస్థానంలోనే ఉండి దేవస్థానాన్ని మరింత అభివృద్ధి చేస్తానని వారు పేర్కొన్నారు. ఏది ఏమైనప్పటికీ గండి దేవస్థానం భక్తులకు ఇబ్బందులు లేకుండా చేస్తానని వచ్చే శ్రావణ శనివార మాసోత్సవాలకు కూడా ప్రత్యేకంగా వీఐపీ క్యూ, ఉచిత దర్శనంతో పాటు రూ.50 టికెట్ తదితర కార్యక్రమాలు చేపట్టడంతో పాటు ఇప్పటికే శ్రావణ మాసోత్సవాల్లో పలువురు దాతలు అన్నదాన కార్యక్రమాలు, విరాళాలు ఇచ్చేందుకు భారీ ఎత్తున భక్తులు ముందుకు వస్తున్నారని, దాతల సహకారంతో గండి దేవస్థానాన్ని మరింత అభివృద్ధి చేస్తానని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గండి దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.