కడప

జనాభా పెరుగుదల నియంత్రించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,జూలై 11: జనాభా పెరుగుదలవల్ల అనేక నష్టాలున్నాయని, జనాభా పెరుగుదలను నియంత్రించాల్సిన బాధ్యత అందరిపై ఉందని, అలాగే సమాజంలో భ్రూణహత్యలను నివారించేందుకు ప్రతి ఒక్కరూ నడుంబిగించాలని కలెక్టర్ కెవి సత్యనారాయణ పిలుపునిచ్చారు. సోమవారం ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో కార్పొరేషన్ కార్యాలయం నుంచి నేక్‌నామ్ కళాక్షేత్రం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కళాక్షేత్రంలో ఏర్పాటుచేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ భ్రూణహత్యలు నివారించాలని ఇందులో ప్రభుత్వ డాక్టర్లకు ప్రత్యేక అధికారాలు ఉన్నాయన్నారు. స్కానింగ్ సెంటర్లలో ఎక్కడైనా ఆడబిడ్డ లేక మగబిడ్డ అనే విషయాలు తెలియచెప్పే విషయాన్ని పసిగట్టి సెంటర్లను సీజ్ చేసే అధికారం డాక్టర్లకు ఉందన్నారు. దేవుడి తర్వాత ఆ స్థానం డాక్టర్‌కే దక్కుతుందని అయితే కొందరు నైపుణ్యం లేని వైద్యులు రోగులపట్ల సరైన ప్రేమాభిమానాలు చూపడంలేదన్నారు. ప్రపంచంలో యువత ఎక్కువగా ఉండే దేశం భారతదేశమని ఇందులో 18 నుంచి 45 సంవత్సరాల మద్య వయస్సు వారంతా యువతీ యువకులే అన్నారు. వీరంతా దేశాభివృద్ధికోసం పాటుపడాలన్నారు. భారతదేశ జనాభా 130కోట్లకు పైబడి వుందని, అందులో నవ్యాంద్రప్రదేశ్ జనాభా 5కోట్లకు పైబడి వుందని జనాభా పెరుగుదలను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ పాటుపడాలన్నారు. అధిక జనాభా వల్ల దేశంలో వౌళిక వసతులకల్పన, ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడం కష్టవౌతుందన్నారు. జిల్లావైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సత్యనారాయణరాజు మాట్లాడుతూ చిన్నకుటుంబం చింతలు లేని కుటుంబమని దీన్ని ప్రతి ఒక్కరు పాటించాలన్నారు. ఒకరు లేదా ఇద్దరు పిల్లల సంతానంతో దంపతులు ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఇద్దరు పిల్లల మధ్య మూడుసంవత్సరాల ఎడం ఉన్నప్పుడే తల్లి ఆరోగ్యవంతంగా ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరు కుటుంబ నియంత్రణ పాటించి జనాభా పెరుగుదలను అరికట్టేందుకు కృషి చేయాలన్నారు. మారుమూల గ్రామాల్లో పనిచేస్తున్న సిబ్బంది తాత్కాలిక కుటుంబ నియంత్రణ పద్దతులు ఆచరించేలా గ్రామీణ ప్రజల్లో చైతన్యం తేవాలన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డిఎంహెచ్‌ఓలు అరుణసులోచన, డాక్టర్ జమాల్‌బాషా, హంస జిల్లా అధ్యక్షుడు కె.రామసుబ్బారెడ్డి, జిల్లాలోని వైద్య ఆరోగ్య సిబ్బంది, ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.