కడప

లక్ష్యానికి దూరంగా ఈ - పంచాయతీలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,సెప్టెంబర్ 6: గత కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో అట్టహాసంగా గ్రామపంచాయతీల్లో ఈ-పంచాయతీ ఆన్‌లైన్ ద్వారా సేవలు అందించేందుకు ప్రవేశపెట్టిన బృహత్తరమైన కార్యక్రమం అబాసుపాలైందని చెప్పవచ్చు. గ్రామపంచాయతీల కార్యకలాపాలు ఆన్‌లైన్‌కే పరిమితమయ్యాయి. ఆ సేవలు ప్రజలకు కన్పించడం లేదు. ప్రభుత్వం గ్రామస్థాయిలోనే వివరాలు సేకరించుకుని ప్రజలకు కావాల్సిన సర్ట్ఫికెట్ల జారీ కోసం ఎంతో ఘనంగా ఆశయం ఉన్నా నిర్వహణ నేటికీ అధ్వాన్నంగానే మారింది. నాలుగు సంవత్సరాలుగా ఈ-పంచాయతీ ఆన్‌లైన్ సేవలు ముందుకుసాగకుండా ఆ టెక్నాలజీ ఏర్పాట్లలో నిధులు పక్కదారిపట్టాయి. జిల్లాలో 790 గ్రామపంచాయతీల్లో 781 మైనర్ గ్రామపంచాయతీలు, 9మేజర్ గ్రామపంచాయతీలు ఉన్నాయి. జిల్లా మొత్తం 371 క్లస్టర్లుగా విభజించారు. ఈ- పంచాయతీ ఆన్‌లైన్ కార్యక్రమంద్వారా 11 అంశాలపై ముఖ్యంగా ప్రభుత్వానికి సంబంధించిన 10అంశాలను ఆన్‌లైన్‌లో పొందుపరిచారు. అయితే జిల్లాలో కేవలం ఇంటి పన్ను, జనన, మరణ రికార్డులు మాత్రమే ఈ-పంచాయతీలో ఆన్‌లైన్‌లో సేవలు అందిస్తున్నారు. ఈ -పంచాయతీపై అవగాహన కల్పించేందుకు నాలుగేళ్ల తర్వాత ఈ జిల్లాలో గ్రామకార్యదర్శులకు, సర్పంచ్‌లకు ఈ -పంచాయతీ ఆన్‌లైన్‌పై శిక్షణ ఇవ్వడానికి ఒక ఎంపిడివోను , ఒక ఇఓపిఆర్‌డిని , ముగ్గురు గ్రామ పంచాయతీ కార్యదర్శులను నియామకం చేశారు. వారంతా శిక్షణ తీసుకుని వచ్చారు. తాత్కాలికంగా ఆపరేటర్లను నియామకం చేశారు. వారంతా మండల కేంద్రానికే పరిమితమయ్యారు. ప్రధానమంత్రి అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకోవాలని డిజిటల్ ఇండియా అంటే జిల్లా, రాష్ట్ర సచివాలయాలకు గ్రామపంచాయతీల వరకు ఈ-పంచాయతీ ఆన్‌లైన్‌లో అభివృద్ధి కావాలని ముఖ్యమంత్రి ఆశయం. ఈ-పంచాయతీల్లో కేంద్ర- రాష్ట్రప్రభుత్వాలకు విడుదల చేసే నిధులు, ఖర్చులు, అభివృద్ధిలో లోటుపాట్లు ఇల్లు, జనాభా, కొళాయిల కనెక్షన్లు,పన్నులు , భూములు, వీధిదీపాలు, వసూళ్లబకాయిలు, పెన్షన్లు, నిత్యవసర సరుకులు, జనన, మరణాలు, వాతావరణం, పంటలసాగు, మార్కెట్ ధరలు, గ్రామీణ ఉపాధిహామీ పథకం పనులు, పంటల సాగుపై ఈ-పంచాయతీల ద్వారా గల్లీ నుంచి ఢిల్లీ వరకు తెలిసేందుకు ఆన్‌లైన్ రూపొందించారు. అయితే ఇది ఆన్‌లైన్ కాదని ఇన్‌లైన్ అని జిల్లా అధికార యంత్రాంగం నిరూపిస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వ లక్ష్యాలు నెరవేర్చేందుకు జిల్లా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

రోడ్డు ప్రమాదంలో ముగ్గురి దుర్మరణం

చిన్నమండెం, సెప్టెంబర్ 6: మండలంలోని పడమటికోన గ్రామంలో మంగళవారం ట్రాక్టర్-ద్విచక్రవాహనం ఢీకొని ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. మంగళవారం పడమటికోన హరిజనవాడ నుండి భానుప్రకాష్(18) తన ఇద్దరు స్నేహితులు వెంకటేష్(16), అశోక్(16)లు కలిసి రాయచోటికి వస్తుండగా నడిగడ్డపల్లె క్రాస్ రోడ్డు సమీపంలో గల మలుపులో చిన్నమండెం నుండి పడమటికోనకు వెళ్తున్న ఏపీ04 డబ్ల్యు 7520 నెంబర్ గల ట్రాక్టర్ ఎదురెదురుగా ఢీకొనడంతో భానుప్రకాష్, వెంకటేసులు అక్కడికక్కడే మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన అశోక్ తిరుపతి స్విమ్స్ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు. భానుప్రకాష్ పడమటికోన హరిజనవాడకు చెందిన సుధాకర్ కుమారుడు. ఇతను రాయచోటిలో డిగ్రీ చదువుతున్నాడు. రాయచోటి మండలం కాటిమాయకుంట హరిజనవాడకు చెందిన నాగయ్య కుమారుడు వెంకటేసు, ఇదే గ్రామానికి చెందిన ఓబయ్య కుమారుడు అశోక్ వీరిరువు ఖాజీపేటలో ఒకరు, కలికిరిలో ఒకరు బీఎస్సీ అగ్రికల్చరల్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఎస్‌ఐ సత్యనారాయణ కేసు నమోదు చేసి మృతదేహాలను రాయచోటి ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం కొరకు తరలించినట్లు ఆయన తెలిపారు.