కడప

అడ్డగోలుగా జాతీయ రహదారి విస్తరణ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, మే 13: జిల్లా నుంచి కర్నాటక రాష్ట్రం హుబ్లీ నుంచి నెల్లూరు జిల్లా కృష్ణపట్నం, మైదుకూరు, బద్వేలు 67వ జాతీయ రహదారి విస్తరణపనులు రూ.153కోట్లతో చేపట్టారు. ఈ పనులలో అడ్డగోలుగా నాసిరకంతో నిర్మిస్తున్నారు. రోడ్డు అవసరమున్న ప్రాంతాల్లో సిమెంట్ కాంక్రీటు గోడలు, చిన్నపాటి మోరీలు, డ్రైనేజిల నిర్మాణంలో అడుగడుగునా అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. గడువులోపల పనులు పూర్తిచేయాలని ఒకపక్క రోడ్లభవనాలు, జాతీయ రహదారుల అధికారులు అంటూ చెబుతూ సదరు కాంట్రాక్టర్లు పటుత్వంలేని రోడ్లు వెడల్పుచేస్తూ గ్రావెల్ (కంకర) ప్రభుత్వం నిర్ణయించిన సైజులకంటే ఇష్టారాజ్యంగా రాళ్లను ఏర్పాటుచేసి యథేచ్చగా నిర్మాణాలు చేపట్టారు. చదునుచేసిన అనంతరం గ్రావెల్స్‌వేసి సిమెంట్ వేసిన రోడ్లన్నీ ఎగుడు దిగుడుగానే ఉన్నాయి. ఎత్త్ఫులాల్లో ప్రయాణం చేయాలనుకుంటే ఈ రోడ్లలో ప్రయాణించాల్సివుంటుంది. సంబంధిత జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్నా గ్రామీణులే నాసిరకం రోడ్లను చూసి ఛీదరించుకుంటున్నారు. కడప - నెల్లూరు జిల్లాల మధ్య మూడు ప్యాకేజిలుగా విభజించి, ఒక ప్యాకేజికి టెండర్లు పిలిపించగా కాంట్రాక్టర్లు పోటాపోటీగా 20శాతం లెస్ వేశారు. తొలి ప్యాకేజి రూ. 184 కోట్లకు గాను రూ.153కోట్లకు పనులు దక్కించుకున్నారు. తొలి ప్యాకేజి కింద మైదుకూరు నుంచి బద్వేలు వరకు రెండవ ప్యాకేజి కింద బద్వేలు నుంచి నెల్లూరు జిల్లా ఆత్మకూరు వరకు, మూడవ ప్యాకేజి ఆత్మకూరు నుంచి నెల్లూరు వరకు టెండర్లు ఖరారు చేశారు. రెండు ప్యాకేజిల కింద ఒకే కాంట్రాక్టర్ దక్కించుకోగా, చివరి ప్యాకేజి ఆత్మకూరు నుంచి నెల్లూరు వరకు ఇతర కాంట్రాక్టర్ దక్కించుకున్నారు. అలాగే మైదుకూరు-బద్వేలు అనంతరం ప్రకాశం జిల్లాలోని డోర్నకల్లు సి-జంక్షన్ మధ్య 589వ కి.మీ.నుంచి 648 కి.మీ.వరకు పనులు దక్కించుకున్నారు. ఆ పనులు నిర్మించడంలో గ్రామాల సమీపంలో ఉన్న రోడ్డుకు ఇరువైపుల డ్రైనేజిలు, కల్వర్టుల నిర్మాణాలు చేపట్టాల్సివుండగా అతి తక్కువ గేజి కలిగిన ఇనుప కడ్డీలు ఏర్పాటుచేసి గుట్టుచప్పుడు కాకుండా రాత్రికి రాత్రే కల్వర్టు, ఎత్తుగా ఉన్న రోడ్లకు భద్రతగా రక్షణ గోడలు నిర్మిస్తున్నారు. రోడ్లపైన నీరు ఉన్నా నీరు లేకపోయినా సంబంధిత కాంట్రాక్టర్ ఇబ్బడిముబ్బడిగా తగినంత సిమెంట్, ఇసుక, గ్రావెల్ వేయకుండానే తూ.తూ మంత్రంగా వాటిని నిర్మిస్తున్నారు. వాస్తవంగా పనులు జరుగుతున్న సమయంలో సంబంధితశాఖ ప్రభుత్వ అధికారులు, సిబ్బంది తప్పనిసరిగా పర్యవేక్షించాల్సివుంది. అయితే పర్యవేక్షణ పూర్తిగా లోపించింది. కాంట్రాక్టర్లు, లెస్‌తో పనులు తీసుకున్నామని అధికారులు ఏవైనా అడ్డుబెబితే పనులు నిలిపివేస్తున్నామని అధికారులకే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. జిల్లాలో బద్వేలు, నందిపల్లె, జివి సత్రం, ప్రస్తుతం ఎవరువెళ్లి పరిశీలిస్తున్న డ్రైనేజి కాలువల నిర్మాణం, రక్షణగోడల నాసిరకం, కాంక్రీట్ గోడలు పెచ్చులు పడిపోవడం, కడ్డీలు భయటపడటం కన్పిస్తున్నాయి. ఇక డ్రైనేజి నిర్మాణాలలోతు గానీ, ప్రభుత్వం నిర్ణయించిన లోతుకు పొంతనే లేదు. ఆ పనులపై అడిగే దిక్కుమొక్కు లేదు. రోడ్ల భవనాలశాఖ , పంచాయతీరాజ్‌శాఖ చేపట్టే పనులైనా నాణ్యత ప్రమాణాలతో ఉంటాయేమోకానీ, ఈ జాతీయ రహదారి పనులు ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేపట్టారు. విజిలెన్స్ అధికారులు, నాణ్యతా ప్రమాణాలపై పెద్దగా పట్టించుకున్న పాపాన పోలేదు. ఇప్పటికైనా అధికారులు కన్నుతెరిచి నాణ్యతా ప్రమాణాలు మెరుగుపరిచి రోడ్లను పదికాలాలపాటు నాణ్యతతో ఉండేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఈ ఏడాది వర్షాలు పడితేనే..

రాజంపేట, మే 13: గత యేడాది మొత్తం వర్షాభావ పరిస్థితులతో కరవును ఎదుర్కొన్న రాజంపేట డివిజన్ ఆయకట్టు రైతాంగంతోపాటు బోరుబావుల కింది వాణిజ్య రైతాంగంకు ఈ ఏడాది వర్షాలుపడితే తప్ప వారి బతుకులు బాగుపడవు. లేకుంటే వ్యవసాయానికి స్వస్తిపలికి ఇతర వృత్తులపై ఆధారపడక తప్పనిసరి పరిస్థితులు కనిపిస్తున్నాయి. వర్షాభావ పరిస్థితులతో డివిజన్‌లోని ఆయకట్టు మొత్తం బీడుగామారి కంపచెట్లు, పిచ్చిమొక్కలకు నిలయంగామారింది. పండ్లతోటలకు ప్రసిద్ధిచెందిన డివిజన్‌లో ప్రస్తుతం రైతాంగానికి ప్రకృతి సమస్యే అధికంగా ఉంది. ఇక్కడ పూర్తిగా వర్షాధారంపైనే అత్యధికశాతం రైతులు ఆధారపడి ఉన్నారు. ఇక్కడి భూగర్భజలవనరులను రైతుల దరికిచేర్చే పథకాలను ఇక్కడి పాలకులు దశాబ్దాలుగా పట్టించుకోకపోవడంతో ఈ దుస్థితిని రైతులు ఎదుర్కొంటూ వస్తున్నారు. ప్రతిఏడు పెనుగాలులు, గిట్టుబాటుధరలు లేకపోవడం, సరైన మార్కెటింగ్ వసతులు కరవవ్వడం, పండ్ల నాణ్యత తగ్గడం, తెగుళ్లు ఇత్యాది కారణాలతో పండ్ల తోటల రైతాంగం నష్టపోతూ వస్తుంటే వర్షాలు లేక చెరువులు, కుంటలు, మడుగులు ఎండిపోయి ఆయకట్టు రైతులు నష్టపోతున్నారు. సరైన వర్షాలు లేని కారణంగా పండ్లతోటల రైతాంగం ఆందోళనతో ఉన్నారు. ప్రస్తుతం కరంటు సమస్యను పక్కనపెడితే ప్రకృతి సమస్య తీవ్రంగా రైతుల్లో తీవ్ర ఆందోళనకు కారణమవుతుంది. ఏ మాత్రం మబ్బులు పట్టినా ఆశగా ఆకాశం వైపు ఎదురుచూడడం ఆ తరువాత వర్షాలులేక దిగాలు పడడం పరిపాటిగా మారింది. వర్షాలులేకపోగా అడపా దడపావీచే గాలులు రైతుల గుండెలు గుబేలుమనేలా చేస్తున్నాయి. అరటి, ప్రొద్దుతిరుగుడు, బొప్పాయి పంటలకు ఏ మాత్రం గాలులు వీచినా భారీగా నష్టాలు వస్తాయి. ఈ పండ్లతోటలు ఈ డివిజన్‌లో విస్తారంగా ప్రస్తుతం రైతులు బావులు, బోర్లకింద పండిస్తున్నారు. ఈ నేపధ్యంలో ప్రకృతి అటు వర్షాల రూపంలో ఇతరత్రా పెనుగాలులు లేకుండా కరుణిస్తే తప్ప ఇక్కడి పండ్లతోటల రైతాంగం ప్రయోజనాలు మెరుగవ్వవు. గతంలో అనేక సందర్భాల్లో వీచిన పెనుగాలుల కారణంగా రాజంపేట, పుల్లంపేట, ఓబులవారిపల్లి, ఒంటిమిట్ట, రైల్వేకోడూరు, నందలూరు, చిట్వేలి, పెనగలూరు తదితర మండలాల్లో పండ్ల తోటల రైతాంగాన్ని తీవ్రంగా నష్టాల పాలు చేసింది. తాజాగా కూడా వీచిన పెనుగాలులతో రాజంపేట డివిజన్ వ్యాపితంగా అరటితోటలకు భారీగా నష్టాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం వేల ఎకరాల్లో ఈ పంటలు సాగవుతున్న నేపధ్యంలో రైతులపట్ల ఏ మాత్రం ప్రకృతి వికటించినా రైతుల బతుకు ఎడారిగా మారిపోయే ప్రమాదం ఉంది. అలాగే ప్రకృతి కరుణించి సరైన వర్షాలు పడకుంటే ఈ ఏడాది ఆయకట్టు రైతులు బతుకులు ఘోరంగా మారతాయనడంలో సందేహం లేదు. అందుకనే స్థానికంగా ఆయకట్టు రైతాంగాన్ని ఆదుకోవాలని, పండ్ల తోటలకు బీమా సౌకర్యాన్ని సరళతరం చేయాలన్న విజ్ఞప్తులు ప్రభుత్వంపై ఎక్కువవుతున్నాయి. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని పండ్ల తోటల పెంపకానికి ముందుకొచ్చేందుకు ప్రకృతి వైపరీత్యాల ఏర్పడితే నష్టపోకుండా ఉండేందుకు బీమా సౌకర్యాన్ని సరళతరం చేసేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సి ఉంది. వర్షాధారంపై ఇక్కడి రైతులు ఆధారపడకుండా ఇక్కడి భూగర్భజలవనరులను వెలికితీసే పథకాలకు శ్రీకారం చుట్టాల్సి ఉంది. ఎందుకంటే గతంలో కూడా అనేకమార్లు ప్రకృతి వైపరీత్యాల కారణంగా డివిజన్‌లో రైతాంగం నష్టపోతే బాధిత రైతాంగాన్ని ఆదుకున్నది తక్కువమార్లే అని చెప్పవచ్చు. గత దశాబ్ద కాలం నుండి తీసుకుంటే ప్రకృతి కరుణించకపోవడం, సరైన వర్షాలు లేకపోవడం, పెనుగాలుల కారణంగా డివిజన్‌లో అటు ఆయకట్టు రైతులు, ఇటు పండ్లతోటల రైతాంగం నష్టాలు చవిచూడడం జరిగింది. ఏది ఏమైనా డివిజన్‌లో ఆయకట్టు రైతాంగంతో పాటు పండ్ల తోటల రైతాంగాన్ని ప్రకృతి నష్టాల నుండి రక్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంది.

మొక్కుబడిగా ‘బడిపిలుస్తోంది’
ఆంధ్రభూమి బ్యూరో
కడప, మే 13: కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ప్రభుత్వపాఠశాలలు బలోపేతంచేసి బడిఈడు పిల్లలను ప్రతి ఒక్కరినీ ఉన్నత ప్రయోజకులుగా చేసేందుకు ప్రభుత్వపాఠశాలలను బలోపేతం దిశగా చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా బడిపిలుస్తోంది అనే కార్యక్రమం ద్వారా ప్రభుత్వపాఠశాలల్లో బడిఈడు పిల్లలను, బడిమానేసిన పిల్లలను చేర్పించేందుకు ఎంతో అట్టహాసంగా కార్యక్రమాన్ని ప్రారంభించింది. గత యేడాది బడిపిలుస్తోంది కార్యక్రమంలో బడిఈడు పిల్లలు దాదాపు 45వేల మంది ఉండగా , దాదాపు 24వేల మందిని ప్రభుత్వపాఠశాలల్లో చేర్పించారు. అయితే కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులు రద్దవుతాయని, పాఠశాలలు మూసివేస్తారని, రేషనలైజేషన్‌లో తమ పాఠశాలలు గల్లంతవుతాయన్న ఉద్దేశ్యంతో 50శాతం మంది ఉపాధ్యాయులు, అంకితభావంతో 50శాతం మంది ఉద్యోగులు ప్రభుత్వపాఠశాలలపై విస్తృతంగా ప్రచారంచేసిన నేపధ్యంలో అధిక సంఖ్యలో పిల్లలను చేర్పించారు. ఈ యేడాది బడిపిలుస్తోంది కార్యక్రమంలో 50శాతం మంది మండల విద్యాశాఖ అధికారులు, 60 శాతం మంది ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేస్తూ విస్తృతంగా తల్లిదండ్రుల్లో చైతన్యం తెచ్చారు. జిల్లాలో గత యేడాది ఒకటవ తరగతిలో 23,838 మంది విద్యార్థులు, 6వ తరగతిలో 21,479 మంది విద్యార్థులు, 8వ తరగతిలో 21,885మంది విద్యార్థులు, 9వ తరగతిలో 20,878 మంది విద్యార్థులు ప్రవేశం పొందారు. అయితే ప్రైవేట్ పాఠశాలల్లో ఈ విద్యార్థులతో పోల్చుకుంటే 60 నుంచి 70శాతం విద్యార్థులు ప్రవేశం పొందగలిగారు. ప్రభుత్వం వసతిగృహాలను, గురుకులపాఠశాలలను ఏర్పాటుచేయడంతోపాటు విద్యార్థులకు మద్యాహ్న భోజనం, ఉచిత పుస్తకాలు, ఉచిత దుస్తులు కల్పించి కొన్ని పాఠశాలల్లో ఆంగ్లబోధన కూడా ప్రవేశపెట్టింది. ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలకంటే ఎక్కువ విద్యార్థులు కలిగి అనుభవం కలిగిన ఉపాధ్యాయులు ప్రభుత్వపాఠశాలల్లో ఉన్నారు. అన్నివసతులు ఉన్నా ప్రైవేట్ పాఠశాలలపై మోజు తగ్గడంలేదు. అలాగే త్వరలో మరికొన్ని రాయితీలతో ప్రభుత్వ పాఠశాలలు నడిపేందుకు కూడా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల విడుదలైన ఫలితాల్లో 10వ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులే అధిక ఉత్తీర్ణత సాధించారు. కేవలం కొంతమంది ప్రభుత్వపాఠశాలల్లో ఉపాధ్యాయులు, హెడ్మాస్టర్ల, ఎంఇఓల పర్యవేక్షణ కొరవడినందునే ప్రభుత్వపాఠశాలల్లో ప్రభుత్వ లక్ష్యం నెరవేరడంలేదని పలు సంస్థల సర్వేలో వెల్లడైంది. ప్రభుత్వ ఉపాధ్యాయుల పిల్లలు, వారి సంబంధీకులు ప్రవేట్ పాఠశాలలకు పంపుతున్నందున ప్రభుత్వపాఠశాలలపై తల్లిదండ్రులకు నమ్మకాలు సన్నగిల్లుతున్నాయి. ఈపరిస్థితుల్లో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతంచేసి బడిఈడు, పేద పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు చేర్పించేందుకు విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

బాబు సిఎం అయ్యాక
పంటల సాగు పడిపోయింది
రాజంపేట, మే 13: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మూడేండ్ల పాలనలో రాష్ట్రంలో రైతులు దీనావస్థలో ఉన్నారని, పంటల సాగు విస్తీర్ణం బాగా పడిపోయిందని రాయలసీమ రాష్ట్ర సమితి అధ్యక్షులు కుంచెం వెంకటసుబ్బారెడ్డి విమర్శించారు. శనివారం ఆయన మాట్లాడుతూ మూడేండ్ల పాలనలో రైతాంగం అభివృద్ధికి సిఎం పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో పంటలసాగు విస్తీర్ణం 43.86 లక్షల హెక్టార్లు కాగా బాబు సిఎం అయిన తొలి ఏడాది 2014-15లో 40.98 లక్షల హెక్టార్లకు పడిపోయిందన్నారు. 2016-17లో ఆ విస్తీర్ణం 37 లక్షలకు పడిపోయిందన్నారు. గతంలో రబీ సీజన్‌లో 27 లక్షల హెక్టార్లు సాగులో ఉండగా నేడు 19.47 లక్షల హెక్టార్లకు వచ్చిందన్నారు. బాబు సిఎం కాక మునుపు రైతులు గౌరవంగా బ్యాంకులకెళ్లి రుణాలు తెచ్చుకునే పరిస్థితులు ఉండేవని, కాని నేడు రుణాల లక్ష్యాలలో కూడా కోతలు పడ్డాయన్నారు. 2014-15లో 50.019 కోట్ల లక్ష్యం కాగా, బ్యాంకులు రూ. 39.918 కోట్లు మాత్రమే ఇవ్వగలిగాయన్నారు. 2015-16లో రూ. 83వేల కోట్లు లక్ష్యంగా కాగా రూ. 58 వేల కోట్లు మాత్రమే రైతులకు ఇచ్చాయన్నారు. ఏ సిఎం అయినా రైతులకు రుణాలు ఇప్పించి ఆదుకోవాలని చూస్తారే గాని అందుకు బాబు మినహాయింపుగా మిగిలారని ఆయన అన్నారు. గతంలో 1.4 లక్షల మంది రైతులకు ఖాతాలు ఉండగా నేడు 40 లక్షల మంది రైతుల రుణాలు ఓవర్ డ్యూ కారణంగా నిరర్థక ఆస్తుల ఖాతాలుగా మిగిలాయన్నారు. రైతులు చేతులు ఎత్తేయడం అనేది బాబు హయాంలోనే జరుగుతుందని రికార్డులు బద్ధలు కొట్టారని ఆయన విమర్శించారు.
ఎన్నికల సందర్భంగా రుణామాఫీ అని, తాకట్టులో ఉన్న బంగారు ఇంటికి తెప్పిస్తామని ఊదరగొట్టి ఆపై రైతులు రుణాలపై అపరాధ వడ్డీని చెల్లించేలా చేశారన్నారు. ఈ మూడేండ్లలో రూ. 87,612 కోట్ల రుణాలపై రూ. 48 వేల కోట్ల వడ్డీలు చెల్లించాల్సిన దారుణపరిస్థితి రైతులపై పడిందన్నారు. పబ్లిసిటీ కోసం స్మార్ట్‌సిటీ అని ప్రజలను మోసంచేయడం తప్ప, ఈ సిఎంతో ఏ మాత్రం ప్రయోజనం ఉండదని ప్రజలు గ్రహించారని ఆయన తెలిపారు. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు కుంచెం పేర్కొన్నారు.

నామినేటెడ్ పోస్టులపై
తెలుగుతమ్ముళ్ల ఆశలు!
ఆంధ్రభూమి బ్యూరో
కడప, మే 13: 2019 అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశంపార్టీ బలోపేతం దిశగా త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీకి అధిష్టానం శ్రీకారంచుట్టింది. ఈమాసంలో విశాఖపట్టణంలో మహానాడు కార్యక్రమం అనంతరం నామినేటెడ్ పోస్టుల భర్తీకి పార్టీ అధిష్టానం ఇప్పటికే ప్రకటించింది. ఈనేపధ్యంలో తెలుగుదేశంపార్టీకి చెందిన జిల్లాలోని పలువురు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపిలు, మాజీ ఎమ్మెల్సీలు 2014 ఎన్నికల్లో పోటీచేసి ఓటమి చవిచూసిన నేతలు నామినేటెడ్ పదవులపై ఆశలు పెట్టుకున్నారు. గవర్నర్ కోటా కింద త్వరలో నామినేటెడ్ చేయనున్న ఎమ్మెల్సీ పదవుల విషయంలో కూడా తెలుగుతమ్ముళ్లు ఆశలుపెట్టుకున్నారు. తెలుగుదేశంపార్టీ ఆవిర్భావం నుంచి పార్టీని నమ్ముకున్న సీనియర్ నేతలకు, పార్టీలో పరపతి నేతలు పదవులపై ఆశలుపెట్టుకున్నారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్, వైసిపి లనుంచి వలసవచ్చిన నేతలు పదవులకోసం సర్వశక్తులు వడ్డుతున్నారు. దశాబ్దకాలం నుంచి పదవులులేని తెలుగుదేశంపార్టీ సీనియర్ నేతలు తమకు గుర్తింపు కలిగిన నామినేటెడ్ పదవులు లభిస్తాయని ఆశిస్తున్నారు.
టిడిపి అధిష్టానంలో సీనియర్ నాయకుల జాబితాలో ఉన్నా రోజుకొక మలుపుతిరుగుతున్న రాజకీయ నేతలు, అధికారం కోసం పార్టీలోచేరిన నేతలను దృష్టిలోపెట్టుకుని పార్టీ అధిష్టానం పార్టీ బలోపేతం దిశగా తీసుకెళ్లేందుకే చర్యలు తీసుకుంటుంది తప్ప పార్టీకోసం పోరాడుతున్న నేతల విషయంలో వారు ఎప్పటికైనా తమ పార్టీలో ఉంటారని వలసవచ్చిన నేతలనే పక్కకుపోకుండా చూసుకోవాలని అధిష్టానం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
వైసిపి అధినేత, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సొంత జిల్లా అయిన కడపలో ఆపార్టీకి 2019 ఎన్నికల్లో ప్రాబల్యం తగ్గించేందుకు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ నేతలంతా 2019 ఎన్నికల నాటికి పార్టీలో కొనసాగుతారా లేదానన్న అనుమానం కూడా టిడిపిలో ఉంది. 2014 ఎన్నికల్లో జిల్లాలోని రెండు పార్లమెంట్ నియోజకవర్గాలు, 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్క రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గాన్ని గెలుచుకుని, మిగతా టిడిపి అభ్యర్థులను గెలిపించుకోలేకపోయారు. జిల్లాలో రాజకీయమంతా కుల సామాజికవర్గాలపైనే ఆధారపడి వుంది. జిల్లాలో జగన్ సామాజికవర్గమే ఆధిక్యతతో ఉండటంతో తెలుగుదేశం అధిష్టానానికి జిల్లా రాజకీయం అంతుపట్టక నామినేటెడ్ పదవులపంపకంలో పార్టీ బలోపేతానికి వచ్చే ఎన్నికల్లో పార్టీకి అండగా నిలిచే నేతలకోసమే అనే్వషించి నామినేటెడ్ పోస్టులలో అవకాశం కల్పించేందుకు పార్టీ అధిష్టానం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తంమీద నామినేటెడ్ పదవులపై జిల్లాలోని అధికారపార్టీ నేతలు ఆశలుపెట్టుకుని ఉన్నారు. వారి ఆశలను కాలమే నిర్ణయించాల్సివుంది.
సినీ జగత్తును అలరిస్తున్న అందాలు
జమ్మలమడుగు, మే 13: రాయలసీమలో బాంబుల గడ్డగా పేరున్న జమ్మలమడుగు ప్రాంతం సినీ సోయగాలతో అలరారుతోంది. ఫ్యాక్షన్ ప్రాంతంలోని సహజసిద్దమైన కొండకోనలు, ప్రకృతి అందాలు, చారిత్రక కట్టడాలు, పురాణ క్షేత్రాలతో కలిసివున్న ఈ ప్రాంతం వైపు సినీ పరిశ్రమ చూపుపడింది. దీంతో జమ్మలమడుగు ప్రాంతంలో సినీ చిత్రీకరణలు హుషారుగా సాగుతున్నాయి.
ఒకప్పుడు ఫ్యాక్షన్ కక్షలతో రక్తపుటేరులుపారిన జమ్మలమడుగు ప్రాంతంలో నేడు సినీ పరిశ్రమలు అడుగుపెడుతున్నాయి. దేశంలోని చారిత్రాత్మక నేపథ్యంవున్న కోటలలో గండికోట దుర్గం ఇక్కడి ప్రత్యేకత. ఈ దుర్గంలోని నిర్మాణాలు, వింతలు, విశేషాలు, దుర్గం పక్కనే వున్న పెన్నానది సోయగాలు, సహజ సిద్దమైన కొండకోనలు, సెలయేర్లు ఇక్కడి ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు. దీనికి తోడు గండికోట తూర్పు వైపు మైలవరం జలాశయం సినిమా చిత్రీకరణకు అనువుగా వుండడంతో సినీ నిర్మాతలు ఈ ప్రాంతంవైపు ఆసక్తి కనబరుస్తున్నారు. క్రియేటివ్ డైరెక్టర్ రాజవౌళి రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంతో నిర్మించిన మర్యాదరామన్న తెలుగు సినిమా గండికోటలో, పరిసర ప్రాంతాల్లో, మైలవరం జలాశయంలో చిత్రీకరణ చేయడం జరిగింది. అలాగే కన్నడ మర్యాద రామన్న చిత్రం కూడా ఈ ప్రాంతంలో చిత్రీకరించారు. కన్నడ రాణా సినిమా, తమిళనాడుకు చెందిన సాందిపట్టు చిత్రం, సూపర్ కౌబాయ్ చిత్రంలోని సాయికుమార్, లారెన్స్‌లతో జలాశయంలో, పెన్నానది పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ చేశారు. థమ్సప్ థండర్ గేమ్‌షోకు సంబంధించి యాంకర్ ఉదయబానుతోపాటు ఫైట్ మాస్టర్ రామ్‌లక్ష్మణ్‌లతో చిత్రీకరణ చేశారు. ఈటీవికి సంబంధించి తమిళ నాగమ్మ సీరియల్ చిత్రీకరణ చేశారు. అలాగే మళయాల సినిమా, ఈమధ్యకాలంలో భైరవకోన చిత్రీకరణ ఈ ప్రాంతంలోనే ప్రారంభం అయింది. ఈ ప్రాంతంలోని సినిమా చిత్రీకరణకు ఎక్కువ అనుకూలంగా ఉండడంతో పలువురు పెద్ద హీరోలతో కూడా సినిమాలు నిర్మించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. 2016 సంవత్సరంలో కూడా గండికోటతోపాటు పరిసర ప్రాంతాల్లో పలు చిన్న, పెద్ద చిత్రాల సినిమాలు చాలా జరిగాయి. దీంతో జిల్లాలో జమ్మలమడుగు ప్రాంతం సినీ పరిశ్రమకు అనువుగా మారింది. ఏది ఏమైనా ఫ్యాక్షన్ గడ్డగా పేరున్న జమ్మలమడుగు ప్రాంతం వైపు సినీ జగత్తు ఆసక్తి కనబరచడంతో అందరి చూపు ఈ ప్రాంతం వైపు మళ్లింది.

కులవృత్తులను రక్షించండి..!
రాజంపేట, మే 13:మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే కులవృత్తులను కూడా కాపాడుకోకుంటే భావితరాలకు అది ముప్పుగా కూడా పరిణమిస్తుందన్న ఆందోళన వివిధ వర్గాల నుండి వ్యక్తమవుతుంది. రోజరోజుకు మారుతున్న నేటి స్పీడ్ యుగంలో కులవృత్తులు కాలక్రమంలో కనుమరుగయ్యే పరిస్థితికి చేరుకుంటున్నాయి. అసలు కులవృత్తుల ఆధారంగానే కులాలు ఏర్పడ్డాయంటే అతిశయోక్తికాదు. కులవృత్తుల ఆధారంగానే వారి వారి కులాలు వెలుగులోకి వచ్చి ఉన్నాయి. అనేక కులాలకు కులవృత్తులు ప్రధాన వృత్తిగా నేటికి ఉంది. పూర్వం నుండి మనదేశ గ్రామీణ ప్రాంతాల్లో కులవృత్తులను నమ్ముకొని అనేక కుటుంబాలు జీవనం సాగిస్తుండేవి. ప్రస్తుత రాకెట్ యుగంలో ఆధునిక ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ యంత్రాలు కులవృత్తులకు ప్రత్యామ్నాయాలుగా మారాయి. దీంతో కులవృత్తులను నమ్ముకొని కుటుంబాలను పోషించుకునే పరిస్థితిలు లేకపోవడంతో చాలా మంది కులవృత్తులకు స్వస్తిపలికి ఇతర వృత్తులపై ఆధారపడుతున్నారు. గత రెండు దశాబ్దాల కాలం నుండి కులవృత్తులు మరీ దారుణంగా దెబ్బతింటుండడం విచారకరం. రెండు దశాబ్దాల కాలంలో కులవృత్తులను కాపాడేందుకు ప్రభుత్వం పలురకాల పథకాలను ప్రవేశపెట్టినా అర్హులైన వారు వీటిని సద్వినియోగపరచుకోలేకపోవడం, బ్యాంకులు అర్హులైన వారికంటే ష్యూరిటీలు, పలుకుబడి ఉన్నవారికే రుణ వసతి కల్పిస్తుండడం వల్ల ప్రభుత్వ లక్ష్యం నెరవేరని దురదృష్టకర పరిస్థితులు ఏర్పడుతూ వస్తున్నాయి. కులవృత్తులకు కాలదోషం పట్టడంతో ఒకొక్కవృత్తి క్రమంగా కాలగర్భంలో కలిసిపోతూ వస్తుంది. కులవృత్తులను తీసుకుంటే ప్రధానంగా కల్లుగీత, కుమ్మరి, కమ్మరి, రజక, నారుూ బ్రాహ్మణ, ఎరుకల, యానాది, వడ్రంగి, చేనేత, జంగమ, తోలుబొమ్మలాట, హరికథ, బుర్రకథ, వీధినాటకాలు తదితర కులృవత్తులను నమ్ముకొని జీవనం సాగిస్తుండేవారు. వీరివీరి కులవృత్తుల ఆధారంగా వీరి కులాలు పరిగణనలో ఉండేవి. రెండు దశాబ్దాల క్రితం అధిక సంఖ్యలో కులవృత్తులను ఆధారంగా చేసుకొని జీవనం సాగించే కుటుంబాలుండేవి. ప్రస్తుతం వీటి సంఖ్య తగ్గిపోతూ వస్తుంది. ఒకరి కుల వృత్తిని మరొకరు వృత్తిగా చేసుకొని జీవించే పరిస్థితులు కూడా నెలకొన్నాయి. రానురాను కులవృత్తి ఛాయలు తక్కువగా కనిపస్తుండగా అసలే కనిపించని రోజులు కూడా దగ్గర్లోనే ఉన్నాయన్నట్టుగా పరిస్థితులున్నాయి. ప్రస్తుతం పల్లె సీమల్లో కూడా పాత పద్దతులను సంప్రదాయాలను ప్రక్కన పెడుతున్నారు.నేడు ప్రతి గ్రామంలో టివిల రాకతో వాటిలో వచ్చే సినిమాలు సీరియల్స్ చూస్తూ ప్రజలు కాలక్షేపం చేస్తున్నారు. టివి రాకతో బుర్రకథలు, వీధినాటకాలు, ప్రదర్శించేవారికి ఆదరణ కరవై జీవనోపాధి లేకుండా పోయింది. కుమ్మరి కార్మికులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి మట్టితో కళిశాలు తయారు చేసేవారు అయితే ప్రస్తుతం స్టీల్, ప్లాస్టిక్, ఆల్యూమినియం పరికరాలు మార్కెట్‌లోకి రావడంతో మట్టిపాత్రలకు డిమాండ్ తగ్గిపోయింది. మట్టిపాత్రలు వాడటం నేడు అనాగరికంగా భావిస్తున్నారు. ఇదే విధంగా కల్లుగీత కార్మికులకు ఈత చెట్ల కరవు ఏర్పడింది. యానాదులు, ఎరుకుల కుటుంబాల పరిస్థితి తయారైంది.

వడదెబ్బతో వైకాపా నేత మృతి
చెన్నూరు, మే 13: స్థానిక ముస్లింవాడలో హిదయతుల్లా (80) వైసిపినేత వడదెబ్బకు గురై మృతిచెందాడు. వారం రోజులుగా తీవ్రంగా వీస్తున్న వడగాల్పుల కారణంగా అనారోగ్యానికిగురైన ఆయన శనివారం మృతి చెందాడు. మృతుడు గతంలో కాంగ్రెస్‌పార్టీలో ఉంటూ ప్రస్తుతం వైసిపిలో కొనసాగుతున్నారు. ఇతనికి ముగ్గురు కుమారులు, భార్య ఉన్నారు. కమలాపురం శాసనసభ్యుడు పి.రవీంద్రనాథరెడ్డి, వైసిపి నాయకులు రాజేంద్రప్రసాద్‌రెడ్డి, చీర్ల సురేష్‌యాదవ్, మైనార్టీ నాయకులు భౌతికకాయాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు.
మహిళ ఆత్మహత్య
ముద్దనూరు, మే 13: మండల కేంద్రంలోని రైల్వేకాలనీ ఆవరణంలో శనివారం గీతాలక్ష్మి(32) అనే మహిళ మతిస్థిమితం లేక ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు గీతాలక్ష్మికి ఐదేళ్లక్రిందట గుంతకల్ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడుగా విధులు నిర్వహిస్తున్న రామక్రిష్ణతో పెళ్లి జరిగిందన్నారు. పెళ్లి అయిన ఆరు మాసాలకే మతిస్థిమితం లేకపోవడంతో చికిత్సకోసం తన తండ్రి హేమంతకుమార్ వద్దనే ఉండి చికిత్స చేయించుకుంటూ ఉండేదన్నారు. అయిత శనివారం మధ్యాహ్నం 3.30గంటల సమయంలో ఇంట్లో అందరూ నిద్రిస్తున్నప్పుడు ఇంటి పెరటిలోకివచ్చి అక్కడే ఉన్న ప్లాస్టిక్ తాడుతో చెట్టుకు ఉరివేసుకుని మృతి చెందిందన్నారు. తండ్రి హేమంత్‌కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తుచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇసుక లారీలు సీజ్
కొండాపురం, మే 13: మండలంలోని తాళ్లప్రొద్దుటూరు పోలీసు స్టేషన్ పరిధిలో 5 ఇసుక లారీలు సీజ్‌చేసి కేసు నమోదుచేసినట్లు ఎస్‌ఐ క్రిష్ణయ్య యాదవ్ తెలిపారు. ఈవిషయంపై ఆయన మాట్లాడుతూ ఓర్వకల్లు ప్రాజెక్టు పేరుతో అక్కడి కాకుండా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు ముందస్తు సమాచారం రావడంతో ఏటూరు వద్ద శుక్రవారం రాత్రి 1గంటకు చిత్రావతి నదిలో ఇసుక లోడింగ్ జరుగుతున్నట్లు తెలియడంతో అక్కడకువెళ్లి లారీలను అదుపులోనికి తీసుకున్నామన్నారు. వాటిని పోలీసు స్టేషన్‌కు తరలించామన్నారు. ప్రజలుకూడా ఇసుకను తమ అవసరాల నిమిత్తం ప్రభుత్వం ఏర్పాటు చేసిన చిత్రావతి నదిలో ఏటూరు వద్ద, పెన్నానదిలో కె.సుగుమంచి పల్లె వద్ద ఇసుక రీచ్‌లలోనే తీసుకెళ్లాలన్నారు. అంతేకాకుండా ఇసుకను లోడ్‌చేసేటప్పుడు మనుషులచే మాత్రమే చేయించుకోవాలని, యంత్రాలను వాడకూడదన్నారు. యంత్రాలను వాడితే సీజ్‌చేసి కేసు నమోదు చేస్తామన్నారు. అలాగే ప్రభుత్వ నిబందనల ప్రకారం ఇసుక రీచ్‌లలో ఒక మీటరు లోతు మాత్రమే ఇసుకను తీయాలన్నారు. శనివారం సాయంత్రం తాళ్ల ప్రొద్దుటూరు పోలీసు స్టేషన్‌వద్ద స్పెషల్ డ్రైవ్ నిర్వహించామన్నారు. తనిఖీల్లో పత్రాలులేని పలు వాహనాలకు 11 కేసులు నమోదుచేసి, రూ.3600 జరిమానా విధించామన్నారు. కొండాపురంలోని ఓబన్నపేట క్రాసింగ్‌వద్ద కడప, తాడిపత్రి జాతీయ రహదారిపై సిఐ రవిబాబు వాహనాల తనిఖీలు నిర్వహించారు. పత్రాలులేని పలు వాహనాలకు కేసులు నమోదు చేశామన్నారు. ఆయన మాట్లాడుతూ వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలన్నారు. అలాగే ఆర్‌సి, లైసెన్స్ పత్రాలు ఉంచుకోవాలన్నారు. మద్యం సేవించి వాహనం నడపడం, ద్విచక్రవాహనాలపై ముగ్గురు వ్యక్తులు ప్రయాణించరాదన్నారు. ఆటోలు, ట్రాక్టర్లలో ప్రయాణీలకు సామర్థ్యానికి మించి ఎక్కించుకోరాదన్నారు. నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.
విద్యావ్యవస్థ మెరుగుకు ప్రభుత్వం చేయూత
ఖాజీపేట, మే 13:ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా విద్యను అందించేందుకు ప్రభుత్వం అన్నివసతులు కలుగచేస్తోందని టిడిపి రాష్టక్రార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి అన్నారు. మండలంలోని సి.కొత్తపేట పాఠశాలకు అదనపుగది నిర్మాణంకోసం రూ.6.2లక్షలు నిధులతో గదుల నిర్మాణం జరిగింది. శనివారం ఎంపిటిసి వెంకటకొండమ్మ, మండల టిడిపి అధ్యక్షుడు రెడ్యం చంద్రశేఖరరెడ్డిలతో కలిసి తరగతి గదులు ప్రారంభించారు. ప్రభుత్వం పేద విద్యార్థులకోసం తరగతి గదులు, విద్యార్థినీలకోసం సైకిళ్లపంపిణీ , ఉన్నత విద్యకోసం స్కాలర్‌షిప్‌లు ఏర్పాటుచేస్తోందన్నారు. అన్నికులాల పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందించేందుకు ఉచిత పుస్తకాలు, మధ్యాహ్న భోజనం, హాస్టళ్ల వసతి కల్పించి పేద విద్యార్థులను ఉన్నతస్తాయికి చేర్చాలని చూస్తోందన్నారు. ప్రతి అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని మంచి ఉత్తీర్ణత సాధించి అత్యున్నత పదులు పొందాలని ఆకాంక్షించారు. ఈకార్యక్రమంలో టిడిపి నేతలు పుల్లయ్యనాయుడు, బి.్భస్కర్‌రెడ్డి, పెంచలయ్య, బాల వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.
బిసి కార్పొరేషన్ లోన్లు మంజూరు చేయండి
చిన్నమండెం, మే 13: జిల్లాలోని వడ్డెర కులస్తులు 3లక్షల 50వేల మంది ఉన్నారని వడ్డెరుల జీవనాధారం చాలా దయనీయంగా ఉందని , వడ్డెరులకు ఉపాధి, ఉద్యోగాల్లో చాలావెనుకబడి ఉన్నామని, రాష్ట్రంలోని వడ్డెరులందరు జీవనంకోసం కొండలు పిండిచేసి జీవిస్తున్నారని ఇలా వెనుకబడిన వడ్డెరులకు బిసి కార్పొరేషన్‌లో లోన్లుమంజూరుచేసి ఆదుకోవాలని వడ్డెర సంఘం రాష్ట్ర నాయకులు విజయనగరం శ్రీనివాసులు శనివారం ఒక ప్రకటనలో కోరారు. ప్రధానంగా వడ్డెరులవల్ల ప్రతి ఒక్క కులస్తులు లబ్దిపొందుతున్నారు కానీ వడ్డెరులు మాత్రం గుడిసెల్లో, ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ చాలా దయనీయంగా జీవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో 31 బిసి కార్పొరేషన్‌లో లోన్లు ఆన్‌లైన్ అయ్యాయని అందులో మూడు సంఘాలకు మాత్రమే ప్రభుత్వం కార్పొరేషన్‌లో లోన్లుఇవ్వడం జరిగిందని మిగిలిన కార్పొరేషన్లు తక్షణమే లోన్లు మంజూరుచేయాలని ఆయన కోరారు. వడ్డెరులకు 2017-18 నాటికి వంద సంఘాలకు అనుమతి ఇచ్చి కార్పొరేషన్‌లో ఎలాంటి ఆలస్యం లేకుండా లోన్లుఇచ్చి వడ్డెరులను ఒక స్థాయికి తీసుకురావాల్సిన బాద్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కడప జిల్లాలో వడ్డెరులకు ఇడి రామచంద్రారెడ్డి సహాయ సహకారాలవల్ల అంతోఇంతో కార్పొరేషన్ గ్రూపులకు న్యాయం జరుగుతోందన్నారు.
కడప జిల్లాకు రూ.59.02కోట్లు

ఆంధ్రభూమి బ్యూరో
కడప, మే 13: కడప జిల్లాలో ప్రకృతి విపత్తులవల్ల నష్టపోయిన రైతులకు ప్రభుత్వం 2014-15, 2015-16 సంవత్సరాలకు గాను రూ.59.02 కోట్లు ఇన్‌ఫుట్ సబ్సిడీ చెల్లించిందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నష్టపోయిన రైతులకు మొత్తం రూ.180.99 కోట్లు ఇన్‌ఫుట్ సబ్సిడీ చెల్లించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందాయన్నారు. రైతులకు ఇంకా రూ.121.97కోట్లు ఇన్‌ఫుట్ సబ్సిడీ చెల్లించాల్సివుందన్నారు. అందులో 2016లో కరవువల్ల నష్టపోయిన రైతులకు చెల్లించాల్సింది రూ.77.01కోట్ల ప్రతిపాదనలు, భారీ వర్షాలవల్ల నష్టం రూ.44.58కోట్ల ప్రతిపాదనలు కేంద్రప్రభుత్వానికి పంపామని మంత్రి వెల్లడించారు. కేంద్రం ఈ నిధులు విడుదల చేయగానే ఈ సబ్సిడీ నిధులను రైతులకు అందజేస్తామన్నారు. అలాగే 2017 ఆర్థిక సంవత్సరంలో, 2015 కరవునష్టం అంచనాలను పునఃమూల్యాంకనం చేశారు. దాని ప్రకారం 20109 మంది రైతులు కరవువల్ల నష్టపోయారు. వారికి రూ.25.60కోట్లు ఇన్‌ఫుట్ సబ్సిడీ నిధులు పంపిణీ చేశామన్నారు. అందులో రూ.24.41కోట్లు ఇప్పటికే 6.15లక్షల మంది రైతుల ఖాతాల్లో జమచేయడం జరిగిందన్నారు. మిగిలిన రూ.1.19కోట్ల ఇన్‌ఫుట్ సబ్సిడీ పునఃమూల్యాంకన ప్రతిపాదనలను కేంద్రప్రభుత్వానికి రాష్ట్రం సమర్పించిందని గుర్తుచేశారు. ఈ నిధులు విడుదల చేయాలని కేంద్రాన్ని కోరినట్లు మంత్రి ఆ ప్రకటనలో తెలియజేశారు.

ఆదివారం పెట్రోలు బంకులు బంద్!
* ఉదయం 6 నుండి సాయంత్రం 6వరకు
* 15వ తేదీ నుండి అమలు
* ఆందోళనలో ప్రజలు
జమ్మలమడుగు, మే 13: వినియోగదారులకు తరచూ ధరల వడ్డనతో ఆయిల్ కంపెనీలు షాకింగ్ ఇవ్వడం జరుగుతోంది. తాజాగా ఈనెల 14వ తేదీ నుండి ఆదివారం ఆయిల్ బంకులన్నీ మూతపడనున్నాయి. దీంతో పెట్రోలు, డీజిల్ వినియోగదారులకు ఇబ్బందులు తలెత్తనున్నాయి. ఇప్పటికే జిల్లాలోని బంకుల యజమానులు ఆదివారం నాటికి అవసరమైన ఆయిల్ స్టాకులు సంబంధించి కొత్త ఆర్డర్లను కంపెనీలకు అందించడం లేదని తెలుస్తోంది. దీంతోపాటు ఈనెల 15 సోమవారం నుండి పెట్రోలు బంకులన్నీ ఉదయం 6గంటల నుండి సాయంత్రం 6గంటల వరకు మాత్రమే పనిచేసేలా ఇప్పటికే అల్టిమేటం జారీ అయినట్లు చెబుతున్నారు. ఎక్కువ మంది సిబ్బంది పనిచేసే బంకుల్లో మాత్రం సిబ్బందిలో ఒకరు ఆదివారం కూడా విధులు నిర్వహిస్తారని బంకులు యజమానులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే తాము ఎదుర్కొంటున్న కమీషన్ పెంపుదల మరికొన్ని సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాల నుండి సానుకూల స్పందనవస్తే ఈ నిర్ణయాలపై పునరాలోచించి తదుపరి కార్యాచరణ వెల్లడిస్తామని ఆయిల్ కంపెనీల ప్రతినిథులు, బంకు యజమానులు చెబుతున్నారు.
* ఆదివారం రోజుల్లో బంకులు మూత పడితే వినియోగదారుల పరిస్థితి ఏమిటన్నదే ఇప్పడు అందరి ప్రశ్న. నిత్యం వేలాది వాహనాలు రోడ్డెక్కాలంటే అవసరమైన పెట్రోలు, డీజిలు ఎంతోకీలకం. ఆదివారం రోజుల్లో కుటుంబాలతో సహా విహారయాత్రలకు, ఇతర ప్రాంతాలకు వెళ్లడం ఎక్కువగా ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా వందలాది పెట్రోలు బంకుల్లో నిత్యం లక్షలాది లీటర్ల పెట్రోలు, డీజిలు అమ్మకాలు కొనసాగుతున్నాయి. సీజన్ సమయాల్లో మరింత ఎక్కువగా ఉంటుంది. ఆదివారం కూడా ఆయిల్ వినియోగం మిగిలిన రోజుల్లాగే ఉంటుందన్నది అంచనా. ఆదివారం రోజుల్లో బంకులు సెలవులు ప్రకటించడంతో వినియోగదారులకు ఇబ్బందులు తప్పవన్నది నగ్నసత్యం.
* ఆదివారం సెలవు తీసుకోవడంతోపాటు మిగతా రోజుల్లో కూడా నిర్ణీత సమయాలు ఉదయం 6గంటల నుండి సాయంత్రం 6గంటల వరకు నిబంధనలను ఈ నెల 15 సోమవారం నుండి అమలులోకి వస్తుందని బంకులు యజమానులు చెబుతున్నారు. ప్రపచంలో ఎక్కడ అమలులో లేని విధంగా కొత్తగా వ