రాష్ట్రీయం

రాష్ట్రంలో 70 మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి

హైదరాబాద్, మార్చి 12: తెలంగాణ రాష్ట్రంలో మైనార్టీల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోదని ఉప ముఖ్య మంత్రి కడియం శ్రీహరి స్పష్టం చేశారు. తెలంగాణ శాసన మండలిలో శనివారం ఎమ్మెల్సీలు డి.రాజేశ్వర్‌రావు, డాక్టర్ మాదిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కడియం శ్రీహరి సమాధానమిచ్చారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా మొట్టమొదటి సారి మైనార్టీ విద్యార్థుల సౌకర్యం కోసం 70 రెసిడెన్షియల్ పాఠశాలలను వచ్చే విద్యాసంవత్సరం నుండి ప్రారంభిస్తున్నామని విద్యాశాఖ మంత్రి వెల్లడించారు. 2016-17 విద్యాసంవత్సరం నుండి అందుబాటులోకి వస్తాయని, మైనార్టీల సంక్షేమంలో భాగంగా దాదాపు రూ.2039కోట్లతో అంచనాలతో 70 రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేయడం జరుగుతుందని, ప్రస్తుత బడ్జెట్‌లో మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణం కోసం రూ.350 కోట్లు కేటాయించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. పాఠశాలల్లో వౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు పాఠశాలల్లో 2279 మంది టీచింగ్, నాన్ టీచింగ్ స్ట్ఫాను ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు. రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల అధ్యయన కేంద్రాలకు భవనాలను ప్రభుత్వం నిర్మిస్తుందని, వాటి కోసం అదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్, మెదక్ ప్రాంతాలను గుర్తించామని మంత్రి జోగురామన్న మండలిలో తెలిపారు. రాష్ట్రంలో నూతన పరిశ్రమలు, ప్రయివేటు విశ్వవిద్యాలయాల స్థాపన, జిహెచ్‌ఎంసి పరిధిలో పారిశుద్ధ్యం, చెత్త తొలగింపు, నూతన జౌళి విధానం తదితర అంశాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు జూపల్లి కృష్ణరావు, కెటిఆర్, శ్రీహరిలు వివరణలిచ్చారు.