ఆంధ్రప్రదేశ్‌

కేటరింగ్ కాంట్రాక్ట్ పేరిట ఘరానా మోసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప: ఓ ప్రముఖ నిర్మాణ సంస్థలో కేటరింగ్ కాంట్రాక్ట్ ఇప్పిస్తామని హోటల్ యజమానిని వంచించిన కేసులో అంత్రర్రాష్ట ముఠాకు చెందిన నలుగురిని కడప పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఈ కేసులో కీలక నిందితుడు సందీప్‌సింగ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అరెస్టు చేసిన నలుగురి నుంచి 15 లక్షల నగదు, కారును స్వాధీనం చేసుకున్నారు. స్థానిక హోటల్ యజమాని నరసింహారెడ్డికి ఫోన్ ద్వారా పరిచయమైన సందీప్‌సింగ్ ప్రముఖ నిర్మాణ సంస్థలో కోటి రూపాయల కేటరింగ్ కాంట్రాక్ట్ ఇప్పిస్తానని, అందుకు 25 లక్షల రూపాయలను తనకు ముట్టజెప్పాలని షరతు విధించాడు. ఇందుకు అంగీకరించిన నరసింహారెడ్డి 15 లక్షల రూపాయలను సందీప్‌సింగ్ ఖాతాలో ఆన్‌లైన్ ద్వారా జమచేశాడు. మిగతా పదిలక్షల రూపాయలను తీసుకునేందుకు నలుగురు మనుషులను కడపకు పంపతున్నట్లు సందీప్ తెలిపాడు. అయితే, అప్పటికే అనుమానం వచ్చిన నరసింహారెడ్డి ఈ విషయాన్ని పోలీసులకు తెలిపాడు. సందీప్ పంపిన నలుగురు మనుషులు కడపకు రాగానే పోలీసులు అదుపులోకి తీసుకుని, వారి నుంచి 15 లక్షల నగదు, కారును స్వాధీనం చేసుకున్నారు.