12న కాకి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అశోక్‌కుమార్, కిరణ్, మేఘశ్రీ ప్రధాన తారాగణంగా అర్పితా క్రియేషన్స్ పతాకంపై మనోన్.ఎం. దర్శకత్వంలో పత్తికొండ కిరణ్ రూపొందించిన హారర్ సస్పెన్స్ చిత్రం కాకి ఈనెల 12న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- కాకి అనే ఓ వైవిధ్యమైన పేరుతో రూపొందిన ఈ చిత్రంలో కథ పేరుకు తగ్గట్టుగా వుంటుందని, హారర్ కథకు థ్రిల్లర్ ఎలిమెంట్స్ జోడించి రూపొందించిన ఈ చిత్రం వైజాగ్, హైదరాబాద్, పాండిచ్చేరిలలో 40 రోజులపాటు షూటింగ్ చేశామని తెలిపారు. ఎ సర్ట్ఫికెట్ పొందిన ఈ చిత్రం మొదటి భాగమంతా కామెడీగా, రెండో భాగం అంతా హారర్ థ్రిల్లర్‌గా సస్పెన్స్ ఎంటర్‌టైనర్‌గా సాగుతుందని, అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈనెల 12న ప్రేక్షకుల ముందుకు వస్తున్నామని తెలిపారు. జయసుధ, నాజర్, యోగిబాబు, రమేష్ పండిత్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా:శరవణన్ నటరాజన్, సంగీతం:అమ్రిత్, మాటలు:వినోద్ శివ, పాటలు:్భస్కరభట్ల, ఎడిటింగ్:శశికుమార్, కథ:రోనాల్డ్‌రాజ్ ఎస్.విలియమ్స్, నిర్మాత:పత్తికొండ కిరణ్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:మనోన్.ఎం.