కళాంజలి

నృత్యరత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డా.కె.రత్నశ్రీ ప్రఖ్యాత నర్తకి, గురువు, రచయిత్రి, పరిశోధకురాలు - ఇన్ని మంచి అంశాలు ఒకరిలోనే ఉండటం చాలా అరుదు. రత్నశ్రీ కూచిపూడి నృత్యంలో బి.ఏ. ఎం.ఏ. (స్వర్ణ పతక గ్రహీత), పిహెచ్.డి చేశారు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో. చదివిన చోటనే అధ్యాపక వృత్తిలో కొనసాగుతున్నారు. గత 25 సంవత్సరాలుగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో పని చేస్తూ, ప్రస్తుతం నృత్య శాఖాధిపతిగా బాధ్యత వహిస్తున్నారు. తల్లిగా, గృహిణిగా వ్యక్తిగత బాధ్యతలు నిర్వహిస్తూ మరొకవైపు గురువుగా, పరిశోధకురాలిగా, మార్గదర్శిగా కళాసేవ చేస్తున్నారు.
ప్రస్థానం
రత్నశ్రీ జానపద పితామహుడు బి.రామరాజుగారి మనుమరాలు. ఈమె తల్లిదండ్రులు ప్రొ.రమేష్‌రాజు, లీలావతిగార్లు. చిన్నప్పటి నుండే తాతగారు, తండ్రిగారి ప్రభావం రత్నశ్రీపై పడింది. ఎంతో పరిశోధన చేసి నృత్యంపై అనేక రకాల పుస్తకాలను, వ్యాసాలను అందించారు. రత్నశ్రీ జీవిత భాగస్వామి సుధాకర్ గారు కూడా కూచిపూడి నర్తకుడు, ప్రఖ్యాత గురువు, పరిశోధకుడు. వీరు కూడా పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో నృత్య శాఖలో 25 ఏళ్లుగా పని చేస్తున్నారు. భార్యాభర్తలిద్దరూ కళాసేవకే అంకితమయ్యారు.
ఎన్నో గౌరవాలు
* ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి బి.ఏ. (కూచిపూడి)లో అత్యధిక మార్కులు సాధించినందుకు గాను..
* ఎం.ఏ. కూచిపూడి (స్వర్ణ పతకం - తెలుగు విశ్వవిద్యాలయం)
* జన్మభూమి ప్రోగ్రామ్ - ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (స్వర్ణ పతకం)
* అన్నమాచార్య కల్చరల్ ప్రోగ్రాం అవార్డ్ స్కాలర్‌షిప్
* నాట్య విజ్ఞాన్ అవార్డు (కళానిలయం, చిలకలూరిపేట)
* తెలంగాణ ప్రభుత్వం మొదటి ఉగాది పురస్కారం (2015)
* వంశీ ఉగాది పురస్కారం, హైదరాబాద్ 2018.
* దూరదర్శన్ గ్రేడెడ్ ఆర్టిస్టు
* ఐసిసిఆర్ పానెల్ ఆర్టిస్టు
ఎన్నో బాధ్యతలు
డా.రత్నశ్రీ గారు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నృత్య శాఖాధిపతి గానే కాకుండా తెలుగు విశ్వవిద్యాలయంలో ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్‌గా, బిసి సెల్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సెన్సార్ బోర్డు మెంబర్‌గా కూడా ఉన్నారు. అటు ప్రదర్శనలు, ఇటు అకడమిక్‌గా కూడా సెమినార్లలో పత్ర సమర్పణ, ఎన్నో ఐఎస్‌బిఎన్, ఐఎస్‌ఎస్‌ఎన్ మరియు తెలుగు అకాడెమీ పుస్తకాలలో వ్యాసాలు ప్రచురిస్తూ రచయిత్రిగా, పరిశోధకురాలిగా ఎంతో పేరు తెచ్చుకున్నారు.
‘శ్రీ సిద్ధేంద్ర కళాపీఠం’ స్థాపించి, ఎంతోమంది విద్యార్థులకు నృత్య శిక్షణ ఇస్తున్నారు. అలాగే ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల నిర్వహిస్తున్న సర్ట్ఫికెట్, డిప్లొమా కోర్సులకు పరీక్షకురాలిగా ఆంధ్ర విశ్వవిద్యాలయం పరీక్ష పానెల్‌లో ఉంటూ కళాసేవ చేస్తున్నారు. తెలుగు విశ్వవిద్యాలయం పిహెచ్.డి. పరిశోధకులకు గైడ్‌గా, స్ఫూర్తిదాతగా వ్యవహరిస్తున్నారు.
చదువుల తల్లి
రత్నశ్రీ కూచిపూడి, భరతనాట్యం సంప్రదాయ నృత్యాలలో నిష్ణాతురాలు. కూచిపూడిలో బి.ఏ. ఎం.ఏ. (స్వర్ణ పతకం), పిహెచ్.డి. చేశారు. భరతనాట్యంలో సర్ట్ఫికెట్, డిప్లొమా కోర్సులను పూర్తి చేశారు. వీరి పిహెచ్.డి. పరిశోధనాంశం ‘కూచిపూడి యక్షగానములు - మేలట్టూరు భాగవత మేళ నాటకములు - తులనాత్మక పరిశీలన’. తెలుగు విశ్వవిద్యాలయం నుండి వచ్చిన మొట్టమొదటి పిహెచ్.డి వీరిదే. వీరు ‘కూచిపూడి సిద్ధాంత బోధిని’ అనే కూచిపూడి నృత్యంపై పుస్తకం ప్రచురించారు.

పత్ర సమర్పణ
* డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ నేషనల్ సెమినార్, ప్రభుత్వ కళాశాల, అనంతపురం (2017)
* హ్యుమేనిటీస్ అండ్ ఎక్స్‌టెన్షన్ వర్క్ - ముంబై యూనివర్సిటీ (2017)
* యుజిసి సెమినార్ ‘విద్యా సంస్థలలో లలిత కళల ఆవశ్యకత’ (2015)
* యక్షగానం మీద. ఉస్మానియా విశ్వవిద్యాలయం (2014)
* పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ అండ్ ఇండియన్ కల్చర్ - ఉస్మానియా విశ్వవిద్యాలయం (2013)
* కూచిపూడి భామాకలాపంపై పారిజాతాపహరణం ప్రభావం, పాలమూరు విశ్వవిద్యాలయం (2012)
వ్యాసరత్నాలు
* సంప్రదాయ విశ్వవిద్యాలయ శిక్షణా పద్ధతులు (కూచిపూడి నృత్యంపై) - నేషనల్ సెంటర్ జర్నల్ - కూచిపూడి కళాకేంద్రం 1999
* కూచిపూడి భాగవతులు - మేలట్టూరు భాగవతుల ప్రదర్శనా పద్ధతులు - కూచిపూడి నాట్యోత్సవం - సావనీర్ - తెలుగు విశ్వవిద్యాలయం (2006)
* నాట్యకళ - క్రమ వికాసం - పెరిగిన ప్రజాదరణ - కూచిపూడి నాట్యోత్సవం - సావనీర్, తెలుగు విశ్వవిద్యాలయం 2009
* తరతరాల కూచిపూడి - తెలుగు త్రైమాసిక పత్రిక, తెలుగు అకాడెమీ 2007
* అన్నమాచార్య - పురందరదాసుల సంగీత సాహిత్యాలపై తులనాత్మక అధ్యయనం - తెలుగు త్రైమాసిక పత్రిక, తెలుగు అకాడమీ 2009
* కూచిపూడి యక్షగానాలకి మోక్షమెప్పుడు ‘వార్త’ పత్రిక
* కూచిపూడి యక్షగానములు - నృత్య నాటికలు తులనాత్మక పరిశీలన - స్పెషల్ సావనీర్, పి.ఎస్. తెలుగు విశ్వవిద్యాలయం.
* భామాకలాపం - మధుర భక్తి సంప్రదాయం, 3వ ఇంటర్నేషనల్ కూచిపూడి డాన్స్ ఫెస్టివల్, సిలికాన్ ఆంధ్రా 2012.
* భామాకలాపం - పారిజాతాపహరణంపై వ్యాసం - వాఙ్మయిలో, తెలుగు విశ్వవిద్యాలయం 2015.
* కూచిపూడి నృత్య శిఖామణి - వెంపటి చిన సత్యం - శ్యామలలో - ఐఎస్‌ఎస్‌ఐ నెం.2454- 986ఎక్స్, 2015.
* నాట్య గురువు లక్షణాలు - శ్యామల - ఐఎస్‌ఎస్‌ఐ -2454 - 986ఎక్స్, 2016
* డా.శ్రీమతి ఉమారామారావుగారిపై వ్యాసం, శ్యామల - ఐసిసిఐ - 2454 - 986ఎక్స్, 2016.
* మన ధర్మం - శ్యామల మేగజైన్ - ఐసిసిఐ - 2454 - 986ఎక్స్ - 2016.
డా.రత్నశ్రీ గారు ఎన్నో వర్క్‌షాపులు నిర్వహించటమే కాకుండా ఎన్నో వర్క్ షాప్‌లలో భాగం పంచుకుని నృత్యానికి ఎంతో సేవ చేశారు.

-డాక్టర్ శ్రీలేఖ కొచ్చెర్లకోట, పిహెచ్.డి