కళాంజలి

వివిధ రంగముల ఆరితేరిన..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డా.జె.చెన్నయ్య గారు తెలంగాణ సారస్వత పరిషత్ ప్రధాన కార్యదర్శి, రచయిత, పరిశోధకుడు, పాత్రికేయుడు, అనువాదకుడు. వ్యాఖ్యాత. చెన్నయ్యగారి ప్రసంగం చక్కెర పాకంలా సాగుతుంది.
జీవన ప్రస్థానం...
డా.చెన్నయ్య మహబూబ్‌నగర్ కావేరమ్మపేటలో 6.1.58న జన్మించారు. చిన్నప్పటి నుంచి తెలుగు భాషంటే అభిమానం. జడ్చర్లలో కళాశాల విద్యార్థిగా, మొబైల్ బ్రాంచి పోస్ట్ఫాస్‌కు పోస్ట్‌మాస్టర్‌గా, కళాశాల విద్యార్థి సంఘం కార్యదర్శిగా ఉంటూ, నాటకాలు, ఏకపాత్రాభినయాలు, బుర్రకథలు ప్రదర్శిస్తూ, ఆ రోజుల్లోనే రేడియోకు కథానికలు, కవితలు, రూపకాలు రాస్తూ, ఒక దినపత్రికకు విలేకరిగా పనిచేసేవారు.
జడ్చర్లలో డా.బి.ఆర్.ఆర్. కళాశాలలో బి.ఏ., ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగులో ఎం.ఏ. చేసి, 1996లో ‘తెలుగు దినపత్రికలు - భాషా సాహిత్య స్వరూపం’ అనే అంశంపై పరిశోధన చేసి పిహెచ్.డి పొందారు. చాలా ఏళ్లుగా విలేకరిగా పనిచేసి, 1986 నుండి 1990 దాకా ఆకాశవాణిలో అనౌన్సర్‌గా పనిచేశారు. వీరి కంఠం జనాకర్షణగా ఉంటుంది. 1992 నుండి చాలా ఏళ్లు న్యూస్ రీడర్‌గా, ట్రాన్స్‌లేటర్‌గా పని చేశారు. స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం మొదలగు పర్వదినాలలో రాష్టప్రతి, ప్రధానమంత్రి, గవర్నర్ చేసే ప్రసంగాలను అనువదించి చదవడంలో ప్రత్యేక గుర్తింపు పొందారు. డా.చెన్నయ్య గారు అంటే స్పష్టత, చక్కని ఉచ్ఛారణ, నిర్దిష్టంగా నిర్దుష్టంగా చదువుతారని పేరు. వీరు రాసిన లకుమ, మహమ్మద్ కులీ కుతుబ్‌షా, మైత్రీ సూత్రం, ధన్య గాంధారి, మహాప్రస్థానం మొదలగు నాటక, నాటికలు ఆకాశవాణిలో ప్రసారమయ్యాయి.
ఎన్నో బాధ్యతలు
తెలుగు విశ్వవిద్యాలయంలో 1990 నుండి 2016 దాకా పని చేశారు. ప్రజా సంబంధాల అధికారిగా అసమాన సేవలు అందించి రిటైర్ అయ్యారు. తెలంగాణా సారస్వత పరిషత్‌కి ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ, తెలుగు భాషకు, సాహిత్యానికి అవిరామంగా సేవ చేస్తున్నారు. పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా, హైదరాబాద్ కార్యదర్శిగా, ఉపాధ్యక్షునిగా, అధ్యక్షునిగా సేవ చేశారు. సిలికానాంధ్ర (యుఎస్‌ఏ) భారతదేశ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ‘లక్ష గళ సంకీర్తనార్చన’ ‘అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనం’ వంటి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులు స్వంతం చేసుకున్న చెన్నయ్య అంతర్జాతీయ సమ్మేళనాల్లో వ్యాఖ్యాతగా ఎంతోమంది అభినందనలు అందుకున్నారు. ఆయన మైకులో మాట్లాడుతూంటే గుడిలో గంట మోగుతున్నట్టు ఉంటుంది. ఎన్టీఆర్, పి.వి.నరసింహారావు గార్ల అంతిమ యాత్రపై ఆకాశవాణి ప్రత్యక్ష వ్యాఖ్యాతగా ఉన్నారు. దూరదర్శన్‌లో కూడా ఎన్నోసార్లు వ్యాఖ్యాతగా ప్రేక్షకులకు కనిపించారు. ప్రస్తుతం సిలికానాంధ్రకు వైస్‌ప్రెసిడెంట్. 12 దేశాలలో ఉన్న ‘మన బడి’కి ఎంతో సేవలందిస్తున్నారు.
అవార్డులు
అనువాదకుడిగా, ప్రజా సంబంధాల న్యూస్ రీడర్‌గా మూడు బాధ్యతలను ఏకకాలంలో నిర్వహించిన చెన్నయ్య మూడు రంగాల్లో పురస్కారాలు పొం దారు. ఇది చాలా గొప్ప విషయం. అనువాదానికి తెలుగు విశ్వవిద్యాలయం నుండి, ఉత్తమ ప్రజా సంబంధాల అధికారిగా పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా నుండి, ఉత్తమ న్యూస్ రీడర్‌గా అప్పటి న్యూస్ రీడర్ పి.ఎస్.ఆర్. ఆంజనేయ శాస్ర్తీ కుటుంబ సభ్యులు నెలకొల్పిన సంస్థ నుండి అవార్డులు పొందారు. అధికార భాషా సంఘం, ఢిల్లీ తెలుగు అకాడెమీ, ఆరాధన, హృదయభారతి, శిల్పా ఆర్ట్స్ క్రియేషన్స్, మహబూబ్‌నగర్ జిల్లా యంత్రాంగం, మానస ఆర్ట్స్ థియేటర్స్ నుండి పురస్కారాలు పొందారు. పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా నుండి జాతీయ బహుమతి పొందారు. బెస్ట్ చైర్మన్‌గా జాతీయ పురస్కారం పొందారు. విద్యార్థి రోజుల్లో సిద్దిపేట డిగ్రీ కాలేజీ రాష్ట్ర స్థాయి వ్యాసరచన పోటీల్లో ప్రథమ బహుమతి పొందారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం అంతర కళాశాల ఏకపాత్రాభినయం పోటీల్లో వరుసగా మూడేళ్లు కర్ణ, చాణక్య, భగత్‌సింగ్ పాత్రలకు ప్రథమ బహుమతి పొందారు.
విదేశాలు
అనేక విద్యా, సాహిత్య సభల్లో పాల్గొని పత్ర సమర్పణ చేశారు. పత్రికల్లో పలు వ్యాసాలు రావారు. అమెరికా, మారిషస్, శ్రీలంక వంటి దేశాలలో భారత సంస్కృతి ప్రచారం చేసి తెలుగు భాష, సాహిత్య కీర్తి పతాకనెగురవేశారు.
అనువాదం
డా.చెన్నయ్యగారు అనువాద రంగంలో కృషి చేశారు. ఇది రేడియో అనువాదాలకే పరిమితం కాలేదు. అప్పటి గవర్నర్ సుర్జిత్‌సింగ్ బర్నాలా నిజ జీవితంలో చేసిన సాహసాలతో కూడిన ‘క్వెస్ట్ ఫర్ ఫ్రీడమ్ - ఎ స్టోరీ ఆఫ్ ఎన్ ఎస్కేప్’ అనే గ్రంథాన్ని తెలుగులోకి అనువదించారు. తెలుగు విశ్వవిద్యాలయం నుండి ఉత్తమ అనువాదంగా సాహితీ పురస్కారం పొందారు. సీనియర్ పాత్రికేయుడు హెచ్.రాజేంద్రప్రసాద్ రాసిన ‘ఎమర్జెన్సీ ఆఫ్ తెలుగుదేశం’ ‘డేట్ లైన్ ఆంధ్ర’ గ్రంథాలను తెలుగులో రాశారు. నేషనల్ బుక్ ట్రస్ట్ ఇండియా కోసం, ట్వైలైటు, మార్క్ ఆఫ్ డైమండ్ నోస్‌రింగ్ అనే పంజాబీ నవలికలను తెలుగులోకి అనువాదం చేశారు. తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురించిన ‘దేశసేవలో’ అనే బృహత్ గ్రంథంలో ఒక ముఖ్య భాగాన్ని అనువదించారు. సర్వ సైన్యాధ్యక్షునిగా జమ్మూ కాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల గవర్నర్‌గా పని చేసిన జనరల్ కె.వి.కృష్ణారావు జ్ఞాపకాల గ్రంథమిది. డా.బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి పబ్లిక్ రిలేషన్స్ కోర్సు పాఠ్యాంశాలను అనువదించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక మంత్రులు శాసనసభలో చేసే బడ్జెట్ ప్రసంగాన్ని 12 ఏళ్లపాటు ఆంగ్లం నుండి తెలుగులోకి అనువదించారు. జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత సి.నారాయణరెడ్డి గారి మునిమనుమరాలు ‘వరేణ్య’ రాసిన పురాణ పాత్రలు - ఇతిహాస పాత్రలు’ తెలుగులోకి అనువదించారు.
*

-డాక్టర్ శ్రీలేఖ కొచ్చెర్లకోట, పిహెచ్.డి