కళాంజలి

మకరంద యోగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యోగా చేయడంవల్ల శరీరం, మనస్సు, ఆత్మ, బుద్ధి శక్తివంతం, పటిష్టం అవుతాయి. యోగ అంటే ఒక జీవన విధానం. ఒక ప్రయాణం. ప్రగతిబాట అంటారు ప్రఖ్యాత యోగ గురువు సునీతా జైస్వాల్. గృహిణిగా, తల్లిగా, యోగా గురువుగా ఎన్నో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన వీరికి యోగ అంటే చెప్పలేని ఇష్టం. సరస్వతీ వాసుదేవన్ గారి వద్ద యోగ నేర్చుకున్నారు. ఈయన చెన్నైలో ప్రఖ్యాత యోగా గురువు.
యోగా నేర్చుకోవటం వల్ల ఒక వ్యక్తి అంతర్ముఖుడవుతాడు. తనలోకి తాను వెళ్లి తన శక్తిని తెలుసుకుని, తన ఆత్మతో పరిచయం ఏర్పరచుకుంటాడు అంటారు సునీత.
వారితో ముఖాముఖి ఇలా సాగింది.
జీవితంలో విజయాలు అపజయాలు ప్రతి వ్యక్తికీ సర్వసాధారణం. ఎవరికైనా శారీరకంగా, శక్తి గురించి అడ్డంకులు అవరోధాలు వస్తాయి. నాకు అనీమియా ఉండేది. మనసు, శరీరం, ఆత్మ అన్నీ శక్తివంతం చేసుకున్నాను. దీనికి యోగా ఎంతగానో దోహదపడింది. నిజం చెప్పాలంటే - ఒక మనిషి చేదు చవి చూశాక తీపి రుచి ఆస్వాదించి, ఆనందిస్తాడు. అలాగే జీవితంలో పరాజయం చూశాకే విజయం యొక్క పరిపూర్ణమైన ఆనందం, సంతోషం తెలుస్తుంది.
ఈ రోజుల్లో చాలామంది జిమ్‌కు వెళ్తూంటారు. అది తప్పేం కాదు. మంచిదే. అయితే జిమ్‌లో శరీరం కేవలం బాహ్యంగానే దృఢమవుతుంది. యోగాతో శరీరం, అలాగే మనసు కూడా దృఢమవుతాయి. ఒక మనిషి బయట, లోపల కూడా శక్తిమంతుడవుతాడు.
యోగా వల్ల లోపలి నుండి బయటకు శక్తి పెరిగి, శక్తిపుంజంగా మారతాం. నేను చాలా ఏళ్ల నుండి యోగా నేర్పిస్తున్నాను. దీనివల్ల మన శక్తి, మన అశక్తి రెండూ మనకు తెలుస్తాయి. జీవితంలో సాధారణంగా అన్నీ బాహ్యంగా, బహిర్గతంగా ఉండే విషయాలలో మనం మెదలుతూంటాం. యోగా అంటే అంతర్ముఖంగా సాగే యాత్ర. యోగా కేవలం గంటసేపు చేయటం అని కాదు. ఇదొక జీవన విధానం.
యోగా వల్ల బరువు తగ్గడం, నిద్ర బాగా పట్టడం, సంతోషం పెంపొందడం ఇవన్నీ జరుగుతాయి. ఉత్సాహం, ధ్యానం, ఏకాగ్రత యోగా వల్ల పెరుగుతాయి. బలహీనంగా ఉండే శరీరం, మనస్సు ఆత్మ అన్నీ దృఢంగా, శక్తివంతంగా అవుతాయి.
యోగా నా సంతోషం కోసం నేర్చుకున్నాను. హైదరాబాద్ సెయింట్ ఆన్స్‌లో చదివాను. అత్తమామలు, భర్త నా రంగంలో నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. ‘మకరంద యోగా’ శిక్షణాలయం స్థాపించి ఎంతోమందికి యోగా నేర్పుతున్నాను. దాని ద్వారా వారి శక్తిని వారికి పరిచయం చేస్తున్నాను.
మా శిక్షణాలయంలో గ్రూప్‌గా క్లాసులు తీసుకుంటాను. అలాగే వ్యక్తిగతంగా. ఒక్కరికి క్లాసు కావాలన్నా ప్రత్యేకంగా తీసుకుంటాను. వారి స్వభావం, శరీర తత్త్వం, మానసిక శక్తి, శారీరక శక్తి అన్నింటినీ పరిశీలించి చూసి యోగా నేర్పిస్తాను.
యోగా మానసిక శక్తిని పెంపొందిస్తుంది. న్యూరో-ఎండోక్రైన్ సిస్టమ్ మీద పని చేస్తుంది. దీన్ని అంతరంగ సాధన అంటాం. థైరాయిడ్, హార్మోన్స్, వెనె్నముక, ఆర్థరైటిస్, ఎలర్జీలు, ఎం.ఎస్.మల్టిపుల్ స్ల్కెరోసిస్, ఆస్థమా, ఆత్మన్యూనత, ఒత్తిడి, టెన్షన్, డిప్రెషన్ ఇలా ఎన్నో సమస్యలు యోగాతో తగ్గించవచ్చు. నివారించవచ్చు.
నేను యోగాలో ప్రత్యేకంగా టి.కృష్ణమాచార్య గారి వద్ద ట్రైనింగ్ తీసుకున్నాను. ఆయన సంప్రదాయ పద్ధతి పతంజలి శిక్షణపై ఆధారపడిన యోగా పద్ధతి. ఒక్కొక్క వ్యక్తికి ప్రత్యేకంగా ఉండే శిక్షణ - వ్యక్తిత్వం, శక్తి, అశక్తి చూసి గౌరవించి, వారికి ప్రత్యేకంగా ఉండే శిక్షణా పద్ధతి. ‘మకరంద యోగా’తో యోగా, ప్రాణాయామం, ధ్యానం, వేద మంత్రాలు, ఆసనాలు నేర్పిస్తున్నాను. యోగాసనాల వల్ల శరీరం చలాకీగా ఉంటుంది.

-డా. శ్రీలేఖ కొచ్చెర్లకోట, పిహెచ్.డి