కళాంజలి

అభ్యాసంతో అద్భుతాలు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీమతి రాధిక కోడిమాల ప్రఖ్యాత కూచిపూడి నర్తకి. సంప్రదాయ కూచిపూడి నృత్యంతోపాటు కథక్, జానపదం, లలిత సంగీతంలో నిష్ణాతురాలు. శ్రీమతి రాధిక బహుముఖ ప్రజ్ఞాశాలి. తల్లిగా, గృహిణిగా, వ్యక్తిగతంగా ఎన్నో బాధ్యతలు నిర్వహిస్తూ, కొన్ని దశాబ్దాలుగా కళాసేవ చేస్తున్నారు. ‘కురుగంటి కళాక్షేత్రం’ స్థాపించి నృత్యం నేర్పుతూ ఉత్తమ కళాకారులను తీర్చిదిద్దుతున్నారు. దేశ విదేశాలలో ఎన్నో ప్రదర్శనలిచ్చారు. వందల శిష్యులు, ప్రశిష్యులు ఉన్నారు. ఆమె ‘నాట్య మయూరి’ అనే బిరుదు పొందారు.
శ్రీమతి రాధికతో జరిపిన ముఖాముఖిలోని ముఖ్యాంశాలు...
నాకు చిన్నప్పటి నుంచీ కళలంటే ప్రేమ. మా అమ్మానాన్న కీ.శే.కృష్ణమూర్తిగారు, కీ.శే.జానకిగారు నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. వారి ప్రోద్బలం, ప్రోత్సాహంతో నేను కూచిపూడి, కథక్, జానపద నృత్యం, లలిత సంగీతం నేర్చుకున్నాను. తెలుగు విశ్వవిద్యాలయంలో బి.ఏ. కూచిపూడి పాసయ్యాను. సెంట్రల్ యూనివర్సిటీ లో ఎం.పి.ఏ పాసయ్యాను. మా వారు సుదర్శన్ నన్ను ఎంతో ప్రోత్సహిస్తారు. పాప కుందనిక కూడా చక్కటి కళాకారిణి. ఇంటర్నేషనల్ ఫిలిమ్ ఫెస్టివల్‌ని గత 5 సంవత్సరాలుగా ప్రతి ఏడాది చేస్తున్నాం. ఐటిసి భద్రాచలంలో, కోటి దీపోత్సవంలో, భక్తి టీవీ ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు చేశాము.
చిన్నప్పుడు పసుమర్తి రామలింగ శాస్ర్తీగారి వద్ద కూచిపూడి నేర్చుకున్నాను. తర్వాత డి.వి. సత్యకుమార్ గారి వద్ద, ఆపై తెలుగు విశ్వవిద్యాలయంలో బి.ఏ కూచిపూడి, ఆ తర్వాత ఎం.పి.ఏ చేశాను. 1996లో ‘కురుగంటి కళాక్షేత్రం’ స్థాపించి నృత్యం నేర్పిస్తున్నాను. చూస్తూండగానే 21 ఏళ్లు గడిచిపోయాయి.
2007, 2011లో యుఎస్‌ఏ వెళ్లాను. 2016లో మలేసియా, 2017 మార్చిలో రష్యా, 2017లోనే శ్రీలంక పర్యటించాను. దుబాయిలో 1996 - 2004 నివసించాను. అప్పుడు అక్కడ ఎన్నో ప్రదర్శనలిచ్చాను.
సౌత్ జోన్, హంపీ ఫెస్టివల్, కోణార్క్, కురుక్షేత్ర, అండమాన్ నికోబార్.. ఇలా ఎన్నో ప్రతిష్ఠాత్మకమైన ఫెస్టివల్‌లో చేశాను. అంజిబాబుగారు, రాఘవరాజు భట్టుగారు వంటి ఎంతోమంది గొప్ప కళాకారులు, గురువులతో నేను ప్రదర్శన ఇవ్వడం నా అదృష్టం.
ఎన్నో నృత్యాంశాలకు రూపకల్పన చేశాను. ఎన్నో బాలేలు, నృత్య రూపకాలకు కొరియోగ్రఫీ చేశాను. శ్రీ వేంకటేశ్వర మహాత్యం 35 మందితో చేశాం. రామకథ 50 మందితో చేయించాను. పర్యావరణ పరిరక్షణ బాలే చేయించాను.
ప్రదర్శనలు ఉచితంగా చేయమంటారు. ఎలా? సంప్రదాయ నృత్యానికి, మన ప్రదర్శనలకు పాపులారిటీ తగ్గుతోంది. పిల్లలు కూడా పదవ తరగతి అయిపోగానే నృత్యం మానేసి, కాలేజీ చదువు మీద ధ్యాస పెడతారు. ఒక గురువుగా- వాళ్లు అలా మానేస్తే ఎంతో బాధ వేస్తుంది.
కష్టపడి విద్య నేర్చుకోవాలి. బాగా అభ్యాసం చేయాలి. అప్పుడు స్వయం ప్రతిభ, వ్యుత్పత్తి, సృజనతో పైకి వస్తారు. దీనికి ఎలాంటి షార్ట్‌కట్స్ లేవు.

-డా. శ్రీలేఖ కొచ్చెర్లకోట, పిహెచ్.డి