కళాంజలి

సాధనే.. ఉన్నతికి సోపానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డా.శ్రీదేవి ప్రఖ్యాత నర్తకి, గురువు, పరిశోధకురాలు, రచయిత్రి. ఎన్నో దశాబ్దాలుగా కళాసేవకే అంకితమయ్యారు. వీరు పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ‘యక్షగానం - ప్రదర్శనా రీతులు’ అనే పరిశోధనాంశం మీద పిహెచ్.డి. జానపద కళల విభాగం నుండి 2007లో పొందారు. ఇందులో చిందు యక్షగానం, కూచిపూడి యక్షగానం, కర్ణాటక యక్షగానం, తంజావూరు యక్షగానం, మేలట్టూరు భాగవత మేళ నాటకములపై పరిశీలన చేశారు. యుజిసి నెట్ ఎగ్జామ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్‌లో ఉత్తీర్ణులయ్యారు. మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ హెచ్‌ఆర్‌డి నుండి 2011-13 జెఆర్‌ఎఫ్ చేశారు. అప్పుడు వీరి పరిశోధనాంశం ‘కూచిపూడి యక్షగానాలు - చతుర్విధాభినయ సమన్వయము - ఇతర యక్షగానాలతో తులనాత్మక పరిశీలన’. వీరు ‘నృత్యాంజలి స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్’ (1995) స్థాపించి, ఉత్తమ కళాకారులను తీర్చిదిద్దుతున్నారు.

డా.శ్రీదేవి గారితో ముఖాముఖి.

అమ్మా నాన్నగార్లు బి.రామారావు, సుందరి. నేను డాక్టర్ అవాలని ఎంతో కోరికగా ఉండేది వారికి. అన్నయ్య ఇంజనీర్, తమ్ముడు ఆడిటర్. నాకు నృత్యమంటే ఎంతో ప్రేమ. అమ్మ భాగవతుల ఇంట పుట్టింది. ప్రఖ్యాత భాగవతుల రామకోటయ్యగారు మా తాతగారు. ఆచార్య భాగవతుల సీతారాంగారు మామయ్య. ఆడపిల్లలకు కూచిపూడి సంప్రదాయ కుటుంబంలో అంతగా ప్రోత్సాహం ఉండదు. అయినా అమ్మానాన్న నన్ను ఈ రంగంలో ఎంతగానో ప్రోత్సహించారు. ఊహ తెలియని వయసులో తాతగారు రామకోటయ్యగారు నా చేత రవీంద్ర భారతిలో ప్రదర్శన ఇప్పించారు. గణపతి కౌతం, వింతులు వింటివా యశోద, అధ్యాత్మ రామాయణ కీర్తన, నమశ్శివాయతే మొత్తం 4 చరణాలతో చేశాను. కొద్ది రోజులకు తాతగారు మరణించారు. మూడేళ్లు విజయవాడలో ఉన్నాం. మళ్లీ హైదరాబాద్ రావడం, మామయ్య ఆచార్య భాగవతుల సేతురాం గారి వద్ద నాట్యం మళ్లీ కొనసాగించాను. నాట్యం పట్ల నాకున్న మక్కువను బట్టి నా భర్త రవికుమార్ కూడా ఎంతగానో ప్రోత్సహించారు. ఇది నా అదృష్టం.
నా పిహెచ్.డి సిద్ధాంత వ్యాసం ‘యక్షగానం - ప్రదర్శనా రీతులు’. ఒగ్గు కథ - ఎ కాంప్లిషీడ్ ఇమిటేషన్ ఎండ్ ఎక్స్‌ప్రెషన్స్.. బిఎల్‌ఎన్ వ్యాసాలు.. నృత్యాంజలి (వరల్డ్ డాన్స్ డే సందర్భంగా).. కూచిపూడి యక్షగానం - ద బెస్ట్ ఇలస్ట్రేషన్ ఆఫ్ నాట్యశాస్త్ర - నాట్య రమణీయకం - తెలుగు విశ్వవిద్యాలయం.. ద డే ఇన్ కార్నేషన్స్ - పగటి వేషాలు - నృత్యాంజలి.. ఇవి కాక ఎన్నో పుస్తకాలకు సంపాదకత్వం వహించాను.
అష్టలక్ష్మీ స్తోత్రం (బాలే) - నృత్య రూపకం చేయించి అందరి మన్ననలు పొందాను. దశావతారాలకి ఫూజన్ డాన్స్‌లో కొరియోగ్రఫీ చేశాను. ఇవిల్యూషన్ ఆఫ్ స్పీషీస్ - వాద్య సంగీతం మీద. ఇంకా ఎన్నో నృత్యాంశాలు రూపకల్పన చేశాను.
ప్రతి సంవత్సరం 1997 నుండి అంటే 20 ఏళ్లుగా నవ్య నాటక సమితి వారి ఆలిండియా మ్యూజిక్ అండ్ డాన్స్ కాంపిటీషన్స్‌కి.. వరంగల్, హైదరాబాద్, బాలభవన్ పోటీలకు న్యాయనిర్ణేతగా వెళ్తూంటాను.
ఆచార్య భాగవతుల సేతురాం గారు మా మామయ్య. ఆయన నా గురువుగారు. ఆయన నేతృత్వంలో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చాను. గిరిజా కల్యాణం, మార్కండేయ చరితం, రామనాటకం, సంపూర్ణ రామాయణం, కృష్ణ లీలలు, ప్రేమ విలాపం, సౌందర్య లహరి, అష్టలక్ష్మీ వైభవం, వార్ అండ్ పీస్, శ్రీనివాస కళ్యాణం మొదలగు ఎన్నో నృత్య రూపకాలు ప్రదర్శించాం.
మా వారు నన్ను కళల్లో ఎంతగానో ప్రోత్సహించారు. వారు చందవోలు లింగోద్భవ స్వామి ఆలయంలో అర్చకులు. నేను పిహెచ్.డి. చేస్తున్నప్పుడు, ఫీల్డ్ వర్క్‌లో చాలా అండగా ఉన్నారు. ‘అందరినీ ఒప్పించి కళ నేర్చుకున్నావు. సంపాదన ముఖ్యం కాదు. కళ చాలా గొప్పది’ అంటూ నాకు ఎంతో ధైర్యాన్ని ఇస్తారు ఎప్పుడూ. పెళ్లికి ముందు అమ్మా నాన్న.. ఆ తరువాత గురువు - మేనమామ ఆచార్య భాగవతుల సేతురాం గారి ప్రోత్సాహమే నన్నింత దాన్ని చేసింది.
ఇవాళ వచ్చి, రేపు ప్రదర్శన కావాలంటే కష్టం. క్షుణ్ణంగా కనీసం 6-7 ఏళ్లు నేర్చుకుంటే స్టేజీ మీద ప్రదర్శనకు పిల్లలు తయారవుతారు. పిల్లలు బాగా నేర్చుకుంటే మన కళలు కాపాడబడుతాయి. ఇందుకు వారి తల్లిదండ్రుల ప్రోత్సాహం చాలా ముఖ్యం.

-డా. శ్రీలేఖ కొచ్చెర్లకోట, పిహెచ్.డి