కళాంజలి

కళాసాగరంపై రామసేతు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూచిపూడి సంప్రదాయ కుటుంబానికి చెందిన డా.ఆచార్య భాగవతుల సేతురాం ప్రఖ్యాత గురువు, నర్తకుడు, పరిశోధకుడు, ప్రొఫెసర్. ఆచార్య సేతురాం గారి తండ్రి ప్రఖ్యాత భాగవతుల రామకోటయ్య గారు. రామకోటయ్య గారు తెలంగాణలో మొట్టమొదట కూచిపూడి శిక్షణాలయం ప్రారంభించి (1946-1979) కళాసేవ చేశారు. తండ్రికి తగ్గ తనయుడు ఆచార్య భాగవతుల సేతురాం.
వీరి పిహెచ్.డి పరిశోధనాంశం కూడా తండ్రిగారి మీదే. కొన్ని దశాబ్దాలుగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో నృత్య శాఖలో పని చేస్తూ కొన్ని వేల మంది శిష్యులు ప్రశిష్యులను ఉత్తమ కళాకారులుగా తీర్చిదిద్దారు. ఐదేళ్ల వయసులో ‘్భక్తప్రహ్లాద’లో ప్రహ్లాదుడిగా తన అరంగేట్రం చేసిన సేతురాం గారు ‘రామ నాటకం’లో లవుడు, ‘శశిరేఖా పరిణయం’లో ఘటోత్కచుడు పాత్రలు తండ్రిగారి బృందంలో చేశారు. తండ్రి మరణానంతరం వారు స్థాపించిన ‘శ్రీ కూచిపూడి నృత్య నిలయ’ బాధ్యతను సేతురాంగారు వహిస్తూ వేల మంది నృత్య కళాకారులకు మార్గదర్శి, గురువు అయ్యారు. దేశ విదేశాలలో ఇప్పటికి 2వేలకు పైగా ప్రదర్శనలిచ్చారీయన. ‘గొల్లకలాపం’లో బ్రాహ్మణుడిగా వీరి ప్రదర్శన అద్భుతం అని ప్రశంసలు అందుకున్నారు. గౌరవాలు
వీరు ఎన్నో అవార్డులు రివార్డులు పొందారు. అందులో కొన్ని ముఖ్యమైనవి.
ఉగాది పురస్కారం - ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2007
నంది అవార్డు - గీత గోవిందం కోసం (1999)
నృత్య కినె్నర అవార్డు (2002)
సరస్వతీ పురస్కారం (టిటిడి -2000)
ఆరాధన, పద్మావతీ పురస్కారాలు (2010, 2005)
విశాల భారతి గౌరవ సత్కారం (2010)
గురుశిష్య పరంపర - కాలిఫోర్నియా - సిలికానాంధ్ర -2008
అభినయ ఆర్ట్స్ (2009)
ఉగాది పురస్కారం -షార్జాలో 2003
నీహారిక పురస్కారం -2005
రసమయి - దుబాయి - యుఎఇ 2007
గురుగోరాడ నరసింహారావు పురస్కారం - నృత్య దర్పణం -2008
సరస్వతీ పురస్కారం - గురుపూర్ణిమ - బాసర
ప్రతిభా పురస్కారం - వైష్ణవీ ఆర్ట్స్ 2002
ఉగాది పురస్కారం - త్యాగరాజ గానసభ
ఆస్మిత - 2001
ఘన సన్మానం - యుకెలో ఈటీఏ తెలుగు అసోసియేషన్
మారిషస్ - ఉగాది 2001
సింగపూర్ - 2006
న్యూయార్క్ - 2001
నృత్య రూపకాలు:
గిరిజా కళ్యాణం, రామాయణం, భగవద్గీత, గీతాసారం, గీత గోవిందం - టెలీ సీరియల్ దూరదర్శన్ కోసం, అష్టలక్ష్మీ వైభవనం దూరదర్శన్ కోసం, ద్రౌపది, వేంకటేశ్వర కళ్యాణం - జీటీవీ, శ్రీకృష్ణ సత్య, రుక్మిణీ కళ్యాణం, మాళవికాగ్నిమిత్రం, వసంతరాజీయం, గొల్ల కలాపం, భామా విలయం, లక్ష్మణరేఖ, వార్ అండ్ పీస్, ఊర్వశి, జలయజ్ఞం, మేరా భారత్ మహాన్, మన మహనీయులు - దూరదర్శన్ కోసం, సరస్వతీ వైభవం - జెమిని, కలశం, పుష్పవిలాపం, రుణానుబంధం, వైష్ణవీయం, నృత్య హారతి మొ.
సినిమాలు:
కళాసాగరం, పాండురంగడు, మొగుడు
నృత్యాంశాలు: తరంగములు, శబ్దములు, అష్టపదులు, జావళీలు, తిల్లానాలు, కీర్తనలు, పదములు కొన్ని వందలు రూపకల్పన చేశారు.
ఆచార్య భాగవతుల సేతురాంగారి ప్రత్యేక రూపకల్పన షిర్డీ సాయిబాబా హారతికి నృత్యరూప కల్పన.
ముఖ్య ప్రదర్శనలు:
‘గొల్ల కలాపం’లో బ్రాహ్మణుడిగా, ఆచార్య అలేఖ్య పుంజాల గారితో ‘నర్తనశాల’లో భీముడిగా, డా.వేదాంత రామలింగ శాస్ర్తీగారితో ‘వేంకటేశ్వర కళ్యాణం’లో వేంకటేశ్వరుడిగా, డా.పసుమర్తి రామలింగ శాస్ర్తీ గారితో ‘రామకథ’లో రావణుడిగా, ‘శశిరేఖా పరిణయం’లో బలరాముడిగా, స్వాతి సోమనాథ్‌తో ‘ద్రౌపది’లో దుశ్శాసనుడిగా, పద్మశ్రీ డా.శోభానాయుడు గారితో ‘విప్రనారాయణ’లో ప్రధాన పోషించారు.
పరిశోధకుడిగా..
భాగవతుల సేతురాంగారు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో నృత్య విభాగం నుండి పిహెచ్.డి పట్టా పొందారు. వీరి పరిశోధనాంశం వారి తండ్రి ‘్భగవతుల రామకోటయ్య కళాసేవ - నేను నేర్చిన యక్షగానం’. ‘కూచిపూడి సూత్రధారి’ అనే వ్యాసం. కూచిపూడి నాట్య క్రమ వికాసం - సంపాదకత్వం
నటరాజుకు నీరాజనం, ఓల్గా స్ర్తివాద నృత్య రూపక రచనలు - కూచిపూడిలో నా నృత్య రూపకల్పన.
ఓల్గా తరంగాలులో ఒక వ్యాసం. మారిషస్ ప్రపంచ తెలుగు సభకి కూచిపూడి సూత్రధారి... ఇలా ఎన్నో వ్యాసాలు అందించారు.

-డా. శ్రీలేఖ కొచ్చెర్లకోట, పిహెచ్.డి