కళాంజలి

ప్రశంసే పెద్ద అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డా. అక్కిరాజు సుందర రామకృష్ణ జగమెరిగిన కళాకారుడు. ఈయన కవి, నటుడు, గాయకుడు, వ్యాఖ్యాత. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో ఆంధ్రోపన్యాసకులుగా పని చేసి, ఆంధ్రప్రదేశ్ ఉత్తమ ఉపాధ్యాయుడిగా బహుమతి అందుకున్నారు. పద్యకవి, అధిక్షేప కావ్య రచయిత వీరు. వారి గురించి వారి మాటల్లోనే...
* * *
నేను ఎన్నో పుస్తకాలు రాశాను. వాటిలో శారదా, రంగరంగా, అమ్మతోడు, మాధవా - కేశవా, బాపూ - రమణా మొదలైనవి ప్రసిద్ధ గ్రంథాలు.
శ్రీకృష్ణార్జున, షిర్డీసాయి సుప్రభాతం, సత్యసాయి స్తుతి, బాసర సరస్వతి, కాళహస్తీశ్వరా మొదలైన సీడీలు వెలువరించాను.
చింతామణి నాటకంలో బిల్వమంగళుడిగా ఎన్నో ప్రశంసలు అందుకున్నాను. శ్రీకృష్ణ తులాభారంలో, శ్రీకృష్ణ రాయబారంలో కృష్ణుడి పాత్రకి బాగా ఖ్యాతి వచ్చింది. ప్రఖ్యాత సినీ నటి, కళాభినేత్రి శ్రీమతి జమున గారితో నేను శ్రీకృష్ణ తులాభారం -ద్వారా యావద్దేశం పర్యటించాను. అర్జునుడి పాత్ర కూడా చాలాసార్లు వేశాను. ‘్భవన విజయం’ అనే సాహిత్య రూపకం ఆనాటి శ్రీకృష్ణ దేవరాయలు అష్టదిగ్గజాలను నేడు కళ్ల ముందుకు తెస్తుంది. నేను తెనాలి రామకృష్ణుడిగా భారతదేశంలోనూ, విదేశాలలోనూ వేశాను. గయోపాఖ్యానంలో సందర్భోచితంగా శ్రీకృష్ణుడు, అర్జునుడు వేస్తాను. రామాంజనేయ యుద్ధంలో శ్రీరాముడు, ఆంజనేయుడిగా వేస్తాను. సత్య హరిశ్చంద్ర చాలా ఖ్యాతి తెచ్చింది. సాహిత్య రూపకాలు చాలా వేశాను. భారతావతరణం, కనకాభిషేకం, శ్రీనాథుడి దర్బారు - ఇందులో శ్రీనాథుడిగా వేశాను.
పోతన, శ్రీనాథుడు, నన్నయభట్టు, అల్లసాని పెద్దన పాత్రలను టీవీ సీరియల్స్ ద్వారా వేశాను. ‘మర్యాద రామన్న’ సీరియల్‌లోనూ, జెమిని వారి ‘పెళ్లిపందిరి’లో వంద ఎపిసోడ్స్ చేశాను.
యుఎస్‌ఏ ఆరుసార్లు వెళ్లాను. దుబాయ్, సింగపూర్‌లలో కూడా ప్రదర్శనలు ఇచ్చాను. యుఎస్‌ఏలో అట్లాంటిక్ మహాసముద్రం నుండి, పసిఫిక్ సముద్రం దాకా మయామి, బఫలో, శాన్‌ఫ్రాన్సిస్కో, న్యూయార్క్ ‘్భవన విజయం’ ప్రదర్శనలిచ్చాను. యుఎస్‌ఏలో శ్రీకృష్ణ దేవరాయలుగా పూర్వాశ్రమంలో శ్రీ ప్రసాదరాయ కులపతి వేశారు. ఆయన నేడు కుర్తాళం పీఠాధిపతి సిద్దేంద్రస్వామి. తిమ్మరుసుగా ముదిగొండ శివప్రసాద్, నేను తెనాలి రామకృష్ణగా వేశాను. అవి మనసుకు హత్తుకుపోయిన ప్రదర్శనలు.
‘శివ’ ‘ముఠామేస్ర్తి’ సినిమాలో గవర్నర్‌గా, ఠాగూర్‌లో ప్రిన్సిపాల్‌గా, ‘ఎగిరే పావురం’ సినిమాలో సంగీత విద్వాంసుడుగా.. ఇలా దాదాపు వంద సినిమాలు చేశాను.
ఏ కళలో అయినా ఇబ్బందులు ఉంటాయి. ముఖ్యంగా టీవీ, సినిమా, రంగస్థలం పోటీ రంగాలు. కేవలం నా ప్రతిభ కృషి, అభ్యాసం ద్వారానే పైకి వచ్చాను. ఇప్పుడు 70 సంవత్సరాలైనప్పటికీ రంగస్థల ప్రదర్శనలిస్తూనే ఉన్నాను. కేవలం కళపై నాకున్న ప్రేమ, మమకారం నాకు ప్రేరణ.
మా గురువులు దివాకర్ల వేంకటావధానిగారు, ముదిగొండ శివప్రసాద్‌గారు. పూర్వాశ్రమంలో ప్రసాదరాయ కులపతి ఎంతో ప్రోత్సహించారు. అయ్యదేవర పురుషోత్తమ రావుగారు మంచి మిత్రులు. సిఎస్‌ఆర్ కళామందిరంలో మేం ఎన్నో ప్రదర్శనలిచ్చాం.
ఇక పరిశోధన విషయానికి వస్తే - ‘వేంకట పార్వతీశ కవులు - వారి రామాయణం’ అనే అంశం మీద పిహెచ్.డి చేశాను. నా సిద్ధాంత వ్యా సాన్ని 1987లో ప్రచురించాను.
ఈ రంగంలో ఎన్నో సన్మానాలూ సత్కారాలూ పొందాను. డెట్రాయిట్‌లో ‘పౌరాణిక నాటకరత్న’ అనే బిరుదు ఇచ్చారు. ‘అభినవ ఘంటసాల’ అంటారు నన్ను. గురువుగారి ఆశీస్సులు, ప్రశంసలే అన్నింటికంటే పెద్ద అవార్డు.

-డా. శ్రీలేఖ కొచ్చెర్లకోట, పిహెచ్.డి