'క్లాప్' కొట్టు గురూ!

కలిసిరాని కాలం! -- ‘క్లాప్’కొట్టు గురూ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందం..అభినయం... కావాలనుకుంటే లిప్‌లాక్..ఇలా దేనికైనా రెడీ అనే అందమైన భామల్లో రెజీనా ఎంతో ముందుంటుంది. అయినా అలా అన్నింటికీ ఓకే అన్నా ఈ సుందరాంగికి కాలమే కలిసిరావడం లేదు. టాలీవుడ్‌కి రకుల్ ప్రీత్‌సింగ్‌తో పాటు అటు ఇటుగా పరిచయమైన రెజీనాకు అన్నీ వున్నా, అదృష్టం మాత్రం ఎందుకనో తలుపుతట్టడం లేదని ఆమె సన్నిహితులు చెప్పుకుంటున్నారు. అంతేకాదు, తెలుగులో స్టార్ ఇమేజ్ వున్న కథానాయకులెవరూ ఈ భామవైపు కనె్నత్తి చూడడంలేదు. కనీసం తమ చిత్రాల్లో నటింపజేయాలనే ఆలోచన కూడా వారికి ఏ మాత్రం వుండడంలేదు. ‘పవర్’ చిత్రంలో రవితేజ సరసన సెకండ్ హీరోయిన్‌గా మెరిసిన తర్వాత అయినా ఆమెకు స్టార్స్ సరసన నటించే అవకాశం వస్తుందని అందరూ అనుకున్నారు. అలాంటి అవకాశం కోసం రెజీనా కూడా ఎంతో ఆశగా ఎదురుచూసింది కూడా. కానీ ఆమె కల ఫలించలేదు. దాంతో ఏం చేయాలో తోచన కనీసం సెకండ్ గ్రేడ్ హీరోల చిత్రాలతోనైనా సర్ధుకుపోయేందుకు సిద్ధమయింది. తాజాగా ఆమె నాగచైతన్య హీరోగా నటిస్తున్న మలయాళ ‘ప్రేమమ్’ రీమేజ్ ‘ముజ్ను’లో మూడవ హీరోయిన్‌గా నటించే అవకాశాన్ని సంపాదించిందని సమాచారం. అంతే కాదు, మరో చిత్రంలో రానా సరసన కూడా నటించడానికి ఓకే చెప్పిందట. స్టార్ హీరోల ప్రోత్సాహం లేకపోవడంతో గోపీచంద్, సాయిధరమ్ తేజ్, మనోజ్ వంటి హీరోలకే పరిమితమవుతోంది. మొత్తానికి ఏ హీరో అయితేనేమి? వరుసగా చిత్రాలు చేతిలో వుంటే చాలనుకుంటున్నట్లుంది రెజీనా.

మరోసారి ప్రియాంక!!
‘వాహ్..ప్రియాంక!’-అంటున్నారంతా ఇప్పుడు. అందుకు కారణాలు లేకపోలేదు. గ్లామర్ క్వీన్స్ పాల్గొనే అందాల పోటీలకు సంబంధించి ఏదైనా మన దేశంలో హాట్ కేకే! అది విదేశాల్లో నిర్వహించే పోటీల్లోనో, లేక మన భారతీయ వనితలు విజయం సాధిస్తే మనం మరింత గర్వించాల్సిందే కదా. ఇప్పుడు బాలీవుడ్ అందాల భామ ప్రియాంక చోప్రా ఆసియాలోనే అత్యంత శృంగార మహిళగా విజయం సాధించింది. లండన్ నగరానికి చెందిన ఈస్ట్రన్ ఐ అనే మ్యాగజైన్ ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ పోటీలో మరోసారి ప్రియాంక సత్తా చాటింది. గత నాలుగేళ్ల పోటీల్లో ప్రియాంక చోప్రా మూడు సార్లు విజేతగా నిలవడం, అందులో ఆమెకు ఆమే సాటి అని నిరూపించినట్టయింది. మొదటగా ఈ పోటీకి ఆసియా ఖండంలోని సుమారు 50మంది శృంగారవంతమైన మహిళలను ఎంచుకుని, వీరికి ఆన్‌లైన్‌లో ఓటింగ్ ద్వారా నెటిజన్ల అభిప్రాయాలు సేకరిస్తారు. అలా ప్రియాంకకు మొదటి స్థానం లభించింది. సినిమా అవకాశాలు ఎలా వున్నా మరోసారి ఈ ఏడాది వరకు ఆసియా ఖండంలోనే ప్రియాంక లాంటి అందగత్తె లేదే.. అని తేలింది. ఇలా మొదటి స్థానం రావడం గురించి ప్రియాంక చెబుతూ- ‘‘ఇది నాపై వున్న అభిమానం. అందుకు నేనెంతో గర్విస్తున్నాను. ఇలా మూడు సార్లు నెటిజన్లు నాపై ప్రేమ కురిపించడం చాలా సంతోషంగా వుంది. నా తోటి నటీమణులు ఎంత మంది వున్నా ఈ వరుసలో వున్నా, ఈ అరుదైన అవకాశం నాకే రావడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది’’అంటూ సంతోషాన్ని వ్యక్తం చేసింది ప్రియాంక!!

కస్సుమంది!!
‘‘గ్లామర్ తారలపై ఎప్పుడూ రూమర్స్ సృష్టిస్తుంటారు కొందరు. వాళ్ల పనే అది. అలాంటి వార్తలతోనే వాళ్లు కాలం నెట్టుకొస్తుంటారు. ముఖ్యంగా మీడియాకు ఇలాంటి వార్తలే కావాలనిపిస్తుంటాయి. ఎప్పుడు, ఏ తారపై ఇలాంటి రూమర్స్ సృష్టించాలా? అని ఎదురుచూస్తుంటారు’’ అని బాలీవుడ్ అందాలభామ కత్రీనాకైఫ్ కస్సుమంటోంది. ఇటీవల ఓ కార్యకమ్రంలో పాల్గొన్న కత్రీనాను పలు ప్రశ్నలతో మీడియా తెగ ఇబ్బంది పెట్టిందట. దాంతో రెచ్చిపోయిన కత్రీనా తనకు ఇష్టం వచ్చిన రీతిలో సమాధానం చెప్పిందట. గ్లామర్ క్వీన్స్‌పై రూమర్స్ లేకుంటే వింతకానీ, వుంటే ఎలా ఆశ్చర్యం? అని ఆమె వాపోయిందిట. ‘‘నా విషయంలో వచ్చినన్ని రూమర్స్ మరెవరి విషయంలో రాలేదు. అలాంటి రూమర్స్‌ని నేనేమీ పట్టించుకోలేదు. పట్టించుకోను కూడా. వాటిని పట్టించుకుంటూ పోతే ఇక మన కెరీర్ అంతే!!’’అంటూ కత్రీనా ఘాటుగానే సమాధానమిచ్చిందట. దటీజ్..కత్రీనా!!

-సమీర్