జాతీయ వార్తలు

కాళేశ్వరంపై అవాస్తవ సమాచారం:్భట్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని వెబ్‌సైట్‌లో పెట్టాలని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. ఆయన గురువారం ఉదయం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ప్రాజెక్టు డీపీఆర్‌ను ప్రజల ముందు ఉంచాలని కోరితే ఇంతవరకు పెట్టలేదని అన్నారు. కాళేశ్వరంలో జరిగిన అవినీతిని ఆధారాలతో సహా బయటపెట్టామన్నారు. 15% పనులు కూడా పూర్తికాని ప్రాజెక్టును హడావుడిగా ప్రారంభిస్తూ రాష్ట్రానికి భారంగా మారుస్తున్నారని అన్నారు. నిజాలు బయటకు వస్తాయనే ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వామ్యమైన అన్ని పార్టీలను పిలవటం లేదని అన్నారు. పదిహేను శాతం నిర్మాణానికే రూ.50 వేల కోట్లు ఖర్చు అయితే మొత్తం ప్రాజెక్టు నిర్మాణానికి ఎన్ని లక్షల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని అన్నారు.