తెలంగాణ

కళ్లు నెత్తికెక్కితే అంతే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 13: ‘పదవులు రాగానే కొంతమందికి కళ్లు నెత్తికెక్కుతాయ. కొమ్ములు మొలిచినట్టు ప్రవర్తిస్తే ప్రజలకు దూరమైపోతాం’ అని సిఎం చంద్రశేఖర్‌రావు కార్పొరేటర్లను హెచ్చరించారు. ‘పదవులు రాగానే రాని భాషను మాట్లాడాలని చూస్తారు. కొందరికి నల్ల కళ్లద్దాలు నెత్తిమీదికి కొస్తాయి. వీళ్ల వాలకం చూసి జనం పరేషాన్ అయ్య తర్వాత దూరమవుతారు. జాగ్రత్త’ అని సిఎం హితవు చెప్పారు. మూడు రోజులుగా ఇక్కడ ఐదు నగరాలకు చెందిన కార్పొరేటర్ల శిక్షణా శిబిరం ముగింపు సమావేశంలో సిఎం మాట్లాడారు. ప్రజల్లో ఒకడిగా కలిసి మెలిసి ఉంటేనే నాయకుడిని విశ్వసిస్తారని, నాయకుడు ఎప్పుడూ సహజత్వాన్ని కోల్పోవద్దన్నారు. రాష్ట్రంలోని నగరాలలో గుణాత్మకమైన మార్పు తెచ్చే దిశగా కృషి చేయాలని సిఎం పిలుపునిచ్చారు. నూతన తెలంగాణ రాష్ట్రంలో పట్టణాలు, నగరాలను అభివృద్ధి పర్చేందుకు ప్రతి ప్రజాప్రతినిధికి ఒక విజన్ ఉండాలని ఉద్భోదించారు. పేదల ఆత్మగౌరవాన్ని పెంపొందించే దిశగా ప్రభుత్వం కార్యక్రమాలు చేపడుతుందన్నారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పథకం అందులో భాగమేనని, ఎన్ని కష్టాలు ఎదురైనా అభివృద్ది పంథాను వదిలిపెట్టేది లేదని సిఎం స్పష్టం చేశారు. వరంగల్, ఖమ్మం, కరీంనగర్, రామగుండం, నిజామాబాద్ నగరాలను శాస్ర్తియంగా అభివృద్ధి చేయాలన్నారు. ప్రజలతో కలిసి మెలిసి పాలన సాగించాలని, వినయ పూర్వక ప్రవర్తన కలిగి ఉండటంతో పాటు నైతిక విలువలు పాటించాలన్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పట్టణాలు, నగరాలు అభివృద్ధి చెందకపోతే చెత్తా కుప్పలా తయారు అవుతాయని సిఎం హెచ్చరించారు. జనాభాకు అనుగుణంగా మంచినీటి సరఫరా, పారిశుద్ధ్యం, మురుగునీటి వ్యవస్థ, రోడ్లు, కూరగాయాల మార్కెట్లు, పబ్లిక్ టాయిలెట్లు, ట్రాఫిక్ నియంత్రణ తదితర వౌలిక సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. మనిషి సంకల్పసిద్ధి మహోన్నతమైందని, అనుకుంటే సాధించలేనిదంటూ ఏమి లేదన్నారు. తాను తెలంగాణ సాధనకు నడుం కట్టినప్పుడు అందరూ అపనమ్మకాన్ని వ్యక్తం చేశారని, మరి చివరకు తెలంగాణను సాధించామా? లేదా? అని సిఎం ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రానే్న సాధించుకున్న మనకు బంగారు తెలంగాణను తయారు చేసుకోవడం అసాధ్యమైందేమీ కాదని అన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, విద్యా, వైద్యం, రోడ్లు, పార్కులు. చెట్ల పెంపకం, స్మశాన వాటికల నిర్మాణం తదితర అంశాలపై మొదట దృష్టిసారించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఇతర రాష్ట్రాల్లో అభివృద్ధి చెందుతున్న నగరాలు, పట్టణాలకు వెళ్లి అధ్యయనం చేయాలన్నారు. హైదరాబాద్ నగరాన్ని గత పాలకులు విధ్వంసం చేయడంతో మూలాల నుంచి అభివృద్ధి చేసుకోవడానికి కొంత వ్యవధి పడుతుందన్నారు. అలాంటి పరిస్థితి మిగతా నగరాలు, పట్టణాలకు రాకుండా ప్రణాళికాబద్ధంగా తీరిదిద్దుకోవాలని సూచించారు. మొక్కలు పెంచడంలో ముందున్న నగరాలను గుర్తించి పది కోట్ల రూపాయల నజరానా అందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు.

చిత్రం... శిక్షణ శిబిరంలో మాట్లాడుతున్న సిఎం కెసిఆర్