రాష్ట్రీయం

టేపుల విడుదలలో స్పీకర్ ప్రమేయం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏపి చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు
రాయదుర్గం , డిసెంబర్ 24: అసెంబ్లీ కార్యక్రమాలకు సంబంధించిన వీడియో టేపుల విడుదల వ్యవహారంతో స్పీకర్ కోడెల శివప్రసాద్ ప్రమేయం లేదని చీఫ్‌విప్ కాల్వ శ్రీనివాసులు స్పష్టం చేశారు. గురువారం అనంతపురం జిల్లా రాయదుర్గంలోని తన కార్యాలయంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ అసెంబ్లీలో వైకాపా ఎమ్మెల్యే రోజా అసభ్యంగా, అవమానకరంగా, సభ్యసమాజం తలదించుకునేలా మాట్లాడటం వల్లనే ఏడాదిపాటు ఆమెను సస్పెన్షన్ చేశారన్నారు. దీంతో వైకాపా అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తమ ఎమ్మెల్యేలతో మూడు రోజుల పాటు సభకు రాకుండా సమావేశాలను బహిష్కరించారన్నారు.
ఒక మహిళా ఎమ్మెల్యేపై సస్పెన్షన్ వేటు వేశారంటూ వైకాపా ఎమ్మెల్యేలు నానారభస చేయడమేగాక స్పీకర్‌పై ఆరోపణలు చేయడంతో తాను బిజెపి ఎమ్మెల్యే విష్ణువర్ణద్‌రాజు కలిసి 18వ తేదీ సభలో జరిగిన విషయాల వీడీయో టేపులు ఇవ్వాలని స్పీకర్‌ను కోరామన్నారు. వైకాపా ఎమ్మెల్యేలు సైతం ఆరోజు సభాకార్యక్రమాల వీడియో టేపులు ఇవ్వాలని కోరారన్నారు. దీంతో సభలోని సభ్యులందరికీ వీడియో టేపులను స్పీకర్ అందజేసినట్లు కాలవ తెలిపారు. తాము అధికారికంగా వీడియో టేపులను తీసుకున్నామని, జరిగిన వాస్తవాలను ప్రపంచానికి తెలియాలనే ఉద్దేశ్యంతో వాటిని మీడియా ద్వారా విడుదల చేసినట్లు పేర్కొన్నారు. పార్లమెంటు, అసెంబ్లీ కార్యక్రమాలపై టివిలు ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేస్తూ తాము అధికారికంగా తీసుకున్న వీడియో టేపులను విడుదల చేయడం నేరం కాదన్నారు. వైకాపా కావాలనే రోజా విషయంలో రాద్ధాంతం చేస్తున్నందున సభలో జరిగిన విషయాలను ప్రజలకు తెలియజేప్పేందుకు టేపులను విడుదల చేశామన్నారు. ఇందులో స్పీకర్ ప్రమేయం ఏమాత్రం లేదని శ్రీనివాసులు స్పష్టం చేశారు.