కృష్ణ

వైభవంగా శివపార్వతుల కల్యాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* దీపాల వెలుగులో కాంతులీనిన ప్రాంగణం
విజయవాడ, నవంబర్ 22: పూజ్యశ్రీ పరిపూర్ణానంద స్వామి పర్యవేక్షణలో స్వరాజ్య మైదానంలో జరుగుతున్న కార్తీక వైభవం కన్నులపండువగా జరుగుతోంది. రెండోరోజైన ఆదివారం శివపార్వతుల కల్యాణోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. శివపార్వతుల కల్యాణానికి తిలకించి పునీతులయ్యారు. మొదటగా వేద విద్యార్థుల మంత్రోచ్ఛారణలతో ప్రారంభమైన కార్యక్రమం ఆద్యంతం భక్తిపారవశ్యంతో సాగింది. వాతాపి గణపతిం భజేహం అంటూ గాయకుడు రాణి శ్రీనివాస్ కచేరీ అలరించింది. శ్రీ భాగవతుల శ్రీనివాస్ శిష్య బృందం కూచిపూడి నృత్య ప్రదర్శనకు భక్తులు ముగ్దులయ్యారు. శివపార్వతులకు పల్లకీ సేవ నిర్వహించారు. శివపార్వతుల కల్యాణానికి ముందు స్వామి పరిపూర్ణానంద అనుగ్రహ భాషణం చేశారు. స్వామీజీ భాషణ అనంతరం వేల సంఖ్యలో హాజరైన మహిళలు దీపాలను వెలిగించారు. అమ్మవారి తరపున మధురకవి పింగళి వెంకట కృష్ణారావు, పాలపర్తి శ్యామలానంద కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. మహాశివుడి పక్షాన ఆచార్య మల్లాప్రగడ శ్రీమన్నారాయణ, ఎర్రాప్రగడ రామకృష్ణ పాల్గొన్నారు. కార్యక్రమంలో పండితవరేణ్యులు జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు ప్రసంగించారు. సోమవారం లక్ష కొబ్బరికాయలతో లక్ష నారికేళ అర్చన జరగనుంది. భక్తులు ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాల్సిందిగా శ్రీపీఠం పిలుపునిస్తోంది.