కరీంనగర్

భావి ప్రధాని సిఎం కెసిఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* చారిత్రాత్మకం ‘మహా’ ఒప్పందం
* ఎమ్మెల్యే గంగుల కమలాకర్
కరీంనగర్ , మార్చి 8: తెలంగాణలో తన పాలనాచాతుర్యంతో దేశంలోని 29 రాష్ట్రాల ప్రజల ఆదరాభిమానాలు చూరగొంటున్న ముఖ్యమంత్రి కెసిఆర్ భవిష్యత్ ప్రధానిగా మారబోతున్నారని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ జోస్యం చెప్డారు. గోదావరిపై ఆనకట్టలు నిర్మించే క్రమంలో మహారాష్ట్ర ప్రభుత్వంతో మంగళవారం ఒప్పందాలు చేసుకున్న సందర్భంగా నగరంలోని తెలంగాణ చౌక్‌లో టిఆర్‌ఎస్ కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు. ఈసందర్బంగా ఎమ్మెల్యే గంగుల టపాసులు పేల్చి, బాణసంచా కాల్చి ఆనందం వ్యక్తంచేశారు. అనంతరం గంగుల మాట్లాడుతూ మార్చి 8 తెలంగాణ చరిత్రలో నిలిచిపోనుందని, రాష్ట్రంలో చారిత్రక ఘట్టానికి తెరలేపిన ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోనున్నారని కొనియాడారు. ప్రాజెక్టుల ఒప్పందం బంగారు తెలంగాణకు తొలిమెట్టుగా అభివర్ణించారు. ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మన్‌రావు మాట్లాడుతూ తెలంగాణ దార్శనికుడు సిఎం కెసి ఆర్ అని, ఉమ్మడి రాష్ట్రంలో మూడుచోట్ల కాంగ్రెస్ ప్రభుత్వాలే కొనసాగినా చేయలేని మహాత్కార్యం ముఖ్యమంత్రి కెసిఆర్ అధికారం చేపట్టిన అనతికాలంలోనే చేసి చూపారని కొనియాడారు. బీడు భూములన్నీ సాగులోకి వచ్చి, పచ్చని తెలంగాణ రూపుదిద్దుకోబోతుందన్నారు. రైతుల కలలు ఫలించబోతుండగా, ముఖ్యమంత్రి కెసిఆర్ అపర భగీరథునిగా నిలవబోతున్నాడన్నారు. ఈసందర్బంగా మేయర్ రవీందర్‌సింగ్, టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి, డిప్యూటీ మేయర్ గుగ్గిల్లపు రమేశ్, నాయకులు గుంజపడుగు హరిప్రసాద్, మైకేల్ శ్రీను, కట్ల సతీష్, అక్బర్ హుస్సేన్, సునీల్‌రావు, పొన్నం అనిల్, రంగుల సత్తన్న, తిరుపతినాయక్, తదితరులు పాల్గొన్నారు.