రాష్ట్రీయం

కంభంపాటి హరిబాబు రాజీనామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: భాజాపా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు తన పదవికి రాజీనామా చేశారు. రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆయన భాజాపా అధ్యక్షులు అయ్యారు. నాలుగేళ్ల పాటు ఆయన పదవిలో కొనసాగారు. మిత్రధర్మం పాటిస్తూ మృధుస్వభావిగా పేరు తెచ్చుకున్నారు. ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ, టీడీపీతో విభేదాల నేపథ్యంలో కొత్త అధ్యక్షుడ్ని నియమించాలని పార్టీ అధిష్టానవర్గం భావిస్తోంది. ఈ తరుణంలో కొత్త అధ్యక్షుడి నియామకానికి మార్గం సుగమం చేసేందుకు కంభంపాటి హరిబాబు తన పదవికి రాజీనామా చేసినట్లు భావిస్తున్నారు. హరిబాబు తన రాజీనామా లేఖను ఫ్యాక్స్ ద్వారా అమిత్‌షాకు పంపారు.