కృష్ణ

కొల్లేరు ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* మంత్రి కామినేని
కైకలూరు, మార్చి 7: కొల్లేరు సరస్సుపై ఆధారపడి జీవనం సాగిస్తున్న ప్రజల సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డా కామినేని శ్రీనివాస్ అన్నారు. సోమవారం స్థానిక సీతారామ ఫంక్షన్ హాలులో నిర్వహించిన మత్స్యకారులకు ఏరియేటర్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం విచక్షణా రహితంగా కొల్లేరు చెరువులను బాంబులు పెట్టి ధ్వంసం చేసి దానిపై ఆధారపడి జీవించే ప్రజల జీవనోపాధిని దెబ్బతీసిందన్నారు. ఈ సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగిందని, కేంద్ర మంత్రులు ఈ ప్రాంతంలో పర్యటించి సమస్యలను అవగతం చేసుకున్నారన్నారు. కొల్లేరు ఆపరేషన్‌లో అధనంగా కొట్టివేసిన 7500 ఎకరాల భూములను 36 సొసైటీలకు చెందిన 3వేల ఎకరాల భూములను 14వేల జిరాయితీ భూములను పంపిణీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందన్నారు. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్‌షా, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు రాజమండ్రిలో ఆదివారం జరిగిన బహిరంగ సభలో సృష్టంగా ప్రకటించారన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో కొల్లేరు సమస్యలను పార్లమెంట్ సభ్యులు ప్రస్తావిస్తారన్నారు. ఈ నెలాఖరులో పెద్దింట్లమ్మ వారిధి నిర్మాణానికి, కేంద్ర మంత్రులు శంకుస్థాపన చేయనున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ దేవాలయం లాంటి యూనివర్శిటీల్లోని విద్యార్థులను రెచ్చగొడుతూ జాతీయత భావాలను దెబ్బతీస్తున్నారని ఈ పరిణామం దేశానికి ఎంతో హానికరమన్నారు. రాహుల్‌గాంధీ దేశంలో అశాంతిని కలుగజేస్తున్నారన్నారు. స్థానిక ఫిషరీస్ కార్యాలయం ఆధ్వర్యంలో 68 మంది మత్స్యకారులకు ఒక్కొక్కరికి రూ. 38వేల విలువైన ఏరియేటర్లను మంత్రి కామినేని శ్రీనివాస్ పంపిణీ చేశారు. రూ. 38వేలలో రూ. 19వేలు సబ్సిడీ కాగా మిగిలిన రూ. 19వేలు రైతులు చెల్లించాలన్నారు. చెరువులు తవ్వుకునేందుకు నిబంధనలు సడలించామని, ఫిషరీస్ అధికారుల ఆదేశాల మేరకు చెరువులను తవ్వుకోవచ్చన్నారు.