జాతీయ వార్తలు

తమిళం నేర్చుకుంటాను:కంగనా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: బాలీవుడ్ సంచలన నటి కంగనా రనౌత్ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌లో నటించనున్న విషయం విషయం విదితమే. జయలలిత జీవితం తన జీవితానికి దగ్గరగా ఉందని అందుకే ఈ సినిమాలో నటిస్తున్నట్లు తెలిపారు. కాగా ఈ సినిమా కోసం ఆమె తమిళం నేర్చుకోబోతున్నది. ఈమేరకు క్లాసులు తీసుకుంటానని చెప్పింది. ఈ సినిమాలో నటించేందుకు కంగనా రూ.24 కోట్లు తీసుకుంటున్నట్లు తెలిసింది.ఇప్పటికే మణికర్ణికలో ఝాన్సీలక్ష్మీగా నటించి ప్రేక్షకుల నీరాజనాలు అందుకున్న కంగనా తమిళనాడు ప్రజలతో అమ్మ, పురుచ్చతరైవిగా నోరారా పిలిపించుకున్న దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత పాత్ర పోషించనున్నారు. ‘తలైవి’ అనే టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రానికి విజయేంద్రప్రసాద్ కథను అందిస్తున్నారు. వైబ్రి మీడియా, విష్ణు ఇందూరు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి. భారత రాజకీయాలలో తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకున్న జయలలితపై తమిళ దర్శకురాలు ప్రియదర్శిని ‘ది ఐరన్ లేడీ’ పేరుతో బయోపిక్‌ను తీస్తున్నారు. ఈ చిత్రంలో జయలలిత పాత్రను నిత్యామీనన్ పోషిస్తున్నారు.