బిజినెస్

భారత్ సహనశీల దేశమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అసహనాన్ని కూడా సహిస్తున్నాం
ఇంతకంటే బలమైన రుజువు ఏమికావాలి?
ప్రచార బాధ్యత మీడియాదే : కనోరియా

న్యూఢిల్లీ, నవంబర్ 26: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థను కలిగివున్న భారత్ ఎంతో గొప్ప సహనశీల దేశమని అసోచామ్ నూతన అధ్యక్షుడు సునీల్ కనోరియా అన్నారు. గురువారం ఆయన న్యూఢిల్లీలో విలేఖర్లతో మాట్లాడుతూ, ‘్భరత్ గొప్ప సహనశీల దేశమని చెప్పేందుకు అసహనాన్ని కూడా మనం ఎంతగానో సహిస్తుండటమే స్పష్టమైన రుజువు’ అని ఉద్ఘాటించారు. మతపరమైన అసహనం గురించి ప్రస్తుతం జరుగుతున్న చర్చ దేశ ప్రతిష్టను, పారిశ్రామిక రంగాన్ని, పెట్టుబడులను దెబ్బతీస్తున్నాయా? అన్న ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, దేశంలో సానుకూల వాతావరణాన్ని వ్యాప్తి చేయాల్సిన బాధ్యత ప్రధానంగా ప్రచార మాధ్యమాలపైనే ఉందని, ఈ బాధ్యతను మీడియా సమర్ధవంతంగా నెరవేర్చగలిగితే దేశంలో పారిశ్రామిక రంగానికి, పెట్టుబడులకు ఎటువంటి ఢోకా ఉండదని స్పష్టం చేశారు.