జాతీయ వార్తలు

కపిల్‌శర్మ, ఇర్ఫాన్‌లపై కేసు నమోదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: అక్రమ కట్టడాలు చేపడుతున్నట్లు ఫిర్యాదు అందడంతో ప్రముఖ కమెడియన్‌ కపిల్‌శర్మతో పాటు బాలీవుడ్‌ నటుడు ఇర్ఫాన్‌ఖాన్‌పై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ముంబయి ఒషివారా ప్రాంతంలోని డీహెచ్‌ఎల్‌ ఎన్‌క్లేవ్‌లో ఐదో అంతస్థులో ఇర్ఫాన్‌ఖాన్‌, తొమ్మిదో అంతస్థులో కపిల్‌ ఫ్లాట్లు ఉన్నాయి.నిబంధనలు అతిక్రమించి వీరు తమ ఫ్లాట్లలో అక్రమ కట్టడాలకు పాల్పడుతున్నారని మున్సిపల్‌ కార్పొరేషన్‌ సబ్‌ ఇంజినీర్‌ అభయ్‌ జగతప్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారిపై కేసు నమోదైంది. మున్పిపల్‌ కార్పొరేషన్‌ అధికారి ఒకరు తనను రూ.5లక్షలు లంచం అడిగారంటూ కపిల్‌ ఇటీవల ట్వీట్‌ చేసిన విషయం తెలిసిందే.