చిత్తూరు

కపిల తీర్థంలో ఘనంగా గంగపూజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, నవంబర్ 20: స్థానిక కపిలేశ్వరస్వామి ఆలయం వద్ద గల కపిలతీర్థం వద్ద పుష్కరణిలో శుక్రవారం సాయంత్రం గంగపూజను ఘనంగా నిర్వహించారు. టిటిడి ఇ ఒ డాక్టర్ డి.సాంబశివరావు,జె ఇ ఓ పోల భాస్కర్ పాల్గొని గంగమ్మకు పసుపు,కుంకుమ, హారతిని సమర్పించారు. అర్చకులువేద మంత్రాలు పటిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఇ ఒ సాంబశివరావు మాట్లాడుతూ ప్రతి ఏటా కార్తీక మాసంలో గంగ పూజను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. భగవంతుడి దయవల్ల విస్తారంగా కురిసిన వర్షాలతో తిరుమల్లో నీటి కొరత తీరిపోయిందన్నారు. తిరుమల్లోని జలాశయాల్లో 400 రోజులకు సరిపడా నీరుచేరిందన్నారు. కల్యాణి డ్యాంలో 80శాతం నీరు చేరిందన్నారు. జెఇఒ పోలభాస్కర్ మాట్లాడుతూ తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు స్థానిక ఆలయాల్లో వరుణయాగంతోపాటు ఇతర ఆలయాల్లో యాగాలు, హోమాలు తరచుగా నిర్వహిస్తున్నామన్నారు. వీటి ఫలితంగా వర్షాల రూపంలో ప్రజలకు ఫలితాలు అందుతున్నాయన్నారు. తిరుపతి, తిరుమల్లోని జలశయాల్లో నీరు చేరిందన్నారు. అంతకమునుపు టిటిడి వాటర్ వర్క్స్ విభాగం ఆధ్వర్యంలో టిటిడి పరిపాలన ఎదురుగా ఉన్న గోవిందరాజస్వామి ఉన్నత పాఠశాల నుంచి కలశాన్ని ఊరేగింపుగా కపిలేశ్వరస్వామి ఆలయానికి చేర్చారు. ఇదిలా ఉండగా తిరుపతిలోని పాత హుజూర్ ఆఫీస్ ప్రాంగణంలో టిటిడి పశ్చిమ నీటి విభాగంలో శుక్రవారం ఆయుధ పూజను ఘనంగా నిర్వహించారు. రెంచ్‌లు, స్పానర్లు, బోర్లు, పంపుసెట్లు, పంపింగ్ స్టేషన్లోని యంత్రసామగ్రిని పసుపు,కుంకుమ,పువ్వులు, మామిడితోరణాలతో అలంకరించారు. శ్రీవారి చిత్రపటానికి పూల మాలలువేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈకార్యక్రమంలో టిటిడి ఎస్ ఇ రమేష్‌రెడ్డి, ఇ ఇ జగదీష్‌రెడ్డి, వాటర్ వర్క్స్ విభాగం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
నేటి నుంచి నారాయణవనం కల్యాణ వెంకన్న ఆలయంలో తెప్పోత్సవాలు
టిటిడి ఆనుబంధ ఆలయమైన నారాయణ వనంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈనెల 21 నుంచి 25వ తేదీ వరకు వార్షిక తెప్పోత్సవాలను 5రోజుల పాటు నిర్వహించనున్నారు. ఈసందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచారపరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు, దాస సాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతి రోజు ఆధ్యాత్మిక భక్తిసంగీత కార్యక్రమాలను నిర్వహించనున్నారు.