కర్నూల్

ప్రేమతో మెలగండి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* కప్పట్రాళ్ల ప్రజలకు ఎస్పీ సూచన
దేవనకొండ, డిసెంబర్ 25: కప్పట్రాళ్ళ గ్రామ ప్రజలు ఎల్లప్పుడు ప్రేమ, శాంతితో మేలగాలని ఎస్పీ రవికృష్ణ పిలుపు నిచ్చారు. శుక్రవారం తన దత్తత గ్రామమైన కప్పట్రాళ్ళలో స్వచ్ఛ్భారత్ కార్యక్రమం చేపట్టారు. అనంతరం క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని ఫాస్టర్ దేవదాసుతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏసుక్రీస్తు ప్రపంచానికే ప్రేమ, శాంతిని అందించాడని అన్నారు. పోరుగు వారిని ప్రేమతో చూసుకోవాలని అన్నారు. అదే విధంగా దారి తప్పిన వారిని దారిలో పెట్టడమే పోలీసుల లక్ష్యం అని అన్నారు. కప్పట్రాళ్ల గ్రామ ప్రజలు చైతన్యవంతులై మార్పు చెందాలని అన్నారు. జనవరి నెలలో సంక్రాంతి వేడుకలను కప్పట్రాళ్ల గ్రామంలో ఘనంగా జరుపుకోవాలని తెలిపారు. అంతకు ముందు స్వచ్ఛ్భారత్ కార్యక్రమంలో భాగంగా గ్రామ ప్రజలకు చెత్త ఎత్తివేయడానికి ప్లాస్టిక్ బకెట్లను పంపిణీ చేశారు. గ్రామప్రజలకు ఏమైన సమస్యలుంటే వాటిలో రాసి ఫిర్యాదుల బాక్సులో వేయాలని అన్నారు. స్థానిక చౌక దుకాణంకు వెళ్ళి క్రిస్మస్ చంద్రన్న కానుకలను అందజేశారు. అనంతరం గ్రామ పురవీధుల గుండా పర్యటించారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన రమేష్ ఇంటి దగ్గరకు వెళ్ళి ఆయన భార్య దుర్గమ్మ, కుటుంబ సభ్యులను ఆయన ఓదార్చారు. స్థానిక చర్చిలో భోజనం చేశారు. చర్చి నిర్మాణానికి కృషి చేస్తామని ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఎంపిటిసి హైమావతి, సిఐ గంటాసుబ్బరావు, ఎస్‌ఐ శ్రీనివాసులు, ఎంఆర్‌పిఎస్ జిల్లా కార్యదర్శి లక్ష్మన్న, పోలీస్ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.

ఆదర్శప్రాయుడు
శ్రీ సద్గురు దత్తాత్రేయుడు
* ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి
కర్నూలు , డిసెంబర్ 25:మానవ సేవయే...మాధవ సేవ అని చెప్పిన శ్రీ సద్గురు దత్తాత్రేయుడు అందరికీ ఆదర్శ ప్రాయుడని ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్టి పేర్కొన్నారు. నగరంలో శుక్రవారం శ్రీ సాయిబాబా దేవాలయాల్లో శ్రీ సద్గురు దత్త జయంతి వేడుకలు వైభవంగా జరిగాయి. ఉదయం నుంచి భక్తులు సాయి మందిరాలకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నగరంలోని అమీన్ అబ్బాస్ నగర్‌లోని శ్రీ సద్గురు దత్త కృపాలయంలో దత్త జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్‌రెడ్డి, గౌరు చరితారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్వీ మోహన్‌రెడ్డి సద్గురు దత్తాత్రేయుడు, సాయిబాబాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దత్తాత్రేయుడు, సాయిబాబా చరిత్రలు ఆదర్శనీయమన్నారు. భక్త్భివం, సమాజ సేవ, ఆపదలో ఉన్న వారికి సహాయం వంటి అంశాలు ప్రతి ఒక్కరూ ఆచరించదగ్గ విషయాలన్నారు. కర్నూలు నగర ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని ఆ భగవంతుడిని వేడుకున్నాన్నారు. నగరంలోని సాయి మందిరాల్లో దత్త జయంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం శుభపరిణామన్నారు. ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ ప్రతి ఏటా శ్రీ దత్త కృపాలయంలో దత్త జయంతి, గురు పౌర్ణమి వంటి విశిష్ట పర్వదినాల్లో భక్తులకు అన్నదానం చేయడం అభినందనీయమన్నారు. దేవాలయ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యేలు ఎస్వీ, గౌరు చరితారెడ్డి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో వైకాపా నాయకులు, భక్తులు పాల్గొన్నారు.
ఐదుగురు దొంగల అరెస్టు
ఒర్వకల్లు, డిసెంబర్ 25:మండల పరిధిలోని ఉయ్యాలవాడ గ్రామంలో గత సెప్టెంబర్‌లో చోరీకి పాల్పడిన కలుగొట్లకు చెందిన రాజశేఖర్‌నాయుడు, శివకుమార్, చిన్నకేశవులు, శేఖర్, యుగంధర్‌లను అరెస్టు చేసినట్లు ఓర్వకల్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. వీరు బాధితుని ఇంట్లో రూ. 20 వేల నగదు, ఒక జత కమ్మలు, ఉంగరం దొంగలించినట్లు పోలీసులు తెలిపారు.
పాముకాటుకు రైతు మృతి
ఓర్వకల్లు, డిసెంబర్ 25:మండల పరిధిలోని కాల్వ గ్రామంలో శుక్రవారం రైతు పెద్ద స్వాములు (45) పాముకాటుకు గురై మృతి చెందాడు. పెద్దస్వాములు కౌలుకు తీసుకున్న కంది పంటకు నీరు కట్టడానికి వెళ్లి పాముకాటుకు గురయ్యాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. కాగా అతడికి భార్య, ఇద్దరు పిల్లలు వున్నారు.

నేడు జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్
* డిఇఓ కె.రవీంద్రనాథ్‌రెడ్డి
కర్నూలు ఓల్డ్‌సిటీ, డిసెంబర్ 25: జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేదీ జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్-2015ను నగర శివారులోని కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ పాఠశాలలో నిర్వహించనున్నట్లు డిఇఓ కె.రవీంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా డిప్యూటీ సిఎం కెఇ.కృష్ణమూర్తి, శాసనమండలి చైర్మన్ ఎ.చక్రపాణియాదవ్, జిల్లా ఇన్‌చార్జి మంత్రి కె.అచ్చెన్నాయుడు, జడ్‌పి చైర్మన్ మల్లెల రాజశేఖర్, జిల్లా ఎంపిలు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బచ్చల పుల్లయ్య, సుధాకర్‌బాబు, గేయానంద్, కలెక్టర్, ఎస్పీ, జెసి , ఏజెసి, డిఆర్‌ఓ, జడ్‌పి సిఇఓ, ఎస్‌ఎస్‌ఎ పిఓ, కర్నూలు ఆర్డీఓ ఎస్.రఘుబాబు హాజరవనున్నారని డిఇఓ తెలిపారు.