ఆంధ్రప్రదేశ్‌

కిర్లంపూడికి ఎవరూ రావద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ-కాపు సామాజికవర్గాన్ని బిసి జాబితాలో చేరుస్తూ జీవో విడుదల చేయాలన్న లక్ష్యంతో ఆమరణదీక్ష చేస్తున్న ముద్రగడకు సంఘీభావం చెప్పదల్చుకున్నవారు ఎక్కడికక్కడ ఆ పని చేయాలేతప్ప కిర్లంపూడికి రావద్దని తూర్పుగోదావరి జిల్లా ఎస్.పి. రవిప్రకాశ్ కోరారు. జిల్లాలో శాంతిభద్రతల సమస్య ఉందని, తునిలాంటి సంఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత తమపై ఉందని, అందువల్ల కిర్లంపూడికి వచ్చి ఇబ్బందులు సృష్టించవద్దని ఆయన కోరారు. కాగా సోమవారంనాడు ముద్రగడకు సంఘీభావం ప్రకటించేందుకు వైకాపా నేతలు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, ఉమ్మారెడ్డి వేంకటేశ్వర్లు వెళ్లనుండగా ఎపిసిసి చీఫ్ రఘువీరారెడ్డి, కాంగ్రెస్ నేత చిరంజీవి కూడా పర్యటించనున్నారు. ప్రభుత్వం తమను అడ్డుకోబోతోందంటూ వారు హెచ్‌ఆర్‌సిని కలవడంతో వారిని అడ్డుకోవద్దని కమిషన్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కాగా ఆమరణదీక్ష భగ్నం చేస్తారన్న ప్రచారం జరగడంతో ముద్రగడ చుట్టూ ఆయన అభిమానులు చేరిపోయారు. ఆయన ఇంటి చుట్టూ కార్లు, ఇతర వాహనాలు అడ్డంపెట్టి పోలీసులు లోపలకు రాకుండా అడ్డుకున్నారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో ఆ ప్రాంతం లో పరిస్థితి ఉత్కంఠభరితంగా తయారైంది.