ఆంధ్రప్రదేశ్‌

తుని హింసాకాండలో ఎ1గా ముద్రగడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ: కాపుగర్జన సందర్భంగా గత ఆదివారం తుని వద్ద జరిగిన హింసాకాండకు సంబంధించి తుని రూరల్ పోలీసు స్టేషన్‌లో 57, అర్బన్ పోలీసు స్టేషన్‌లో 7, రైల్వే పోలీసులు 3 కేసులు నమోదు చేశారు. పలు సెక్షన్ల కింద నమోదైన కేసుల్లో ఎ1 (మొదటి నిందితుడు)గా మాజీ మంత్రి పద్మనాభం పేరును నమోదు చేశారు. ఓ మీడియా సంస్థ అధినేత సుధాకర నాయుడుపైన, కాపుగర్జన స్థల యజమాని రాజా చినబాబుపైన, వైకాపా నేతలు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, కాంగ్రెస్ నేతలు పల్లంరాజు, సి.రామచంద్రయ్య, వట్టి వసంతకుమార్‌తో పాటు పలువురు స్థానిక నేతలపైన కేసులు నమోదు చేశారు. ఈ కేసులను సిఐడి విభాగానికి అప్పగించాలని పోలీస్ శాఖ ఉన్నతాధికారులు యోచిస్తున్నారు.