రాష్ట్రీయం

ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాపు రుణమేళాలో ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప
అనంతపురం , మార్చి 12: రాష్ట్రంలో కాపులు సహా వెనుకబడిన వర్గాల ప్రజలందరి సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. శనివారం అనంతపురం ఆర్‌టిసి బస్టాండు సమీపంలోని మైదానంలో కాపు రుణమేళాను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, పౌర సంబంధాలు, సమాచార, ఐటి శాఖ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత హాజరయ్యరు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి చినరాజప్ప మాట్లాడుతూ రాష్ట్రంలోని వెనుకబడిన వర్గాల ప్రజలను ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి తెలుగుదేశం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. రాష్ట్రంలో కాపు ఉపకులాలైన కాపు, తెలగ, బలిజ కులాలకు రుణాలను అందించి ఆర్థికంగా ఆదుకోవడానికి ప్రభుత్వం కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసిందన్నారు. కాపు కార్పొరేషన్‌కు వెయ్యి కోట్లు కేటాయించారని, 5 సంవత్సరాలకు 5వేల కోట్లు కేటాయించి కాపులను అభివృద్ధి పథంలో నిలపేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని తెలిపారు. అనంతరం బిసి సంక్షేమశాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ కాపులకు మొదటి దశలో రాష్ట్రంలో 32వేల మంది లబ్ధిదారులకు 192 కోట్ల రూపాయల రుణాలు అందజేస్తున్నామన్నారు. కావులను బిసిల్లో చేర్చడం ద్వారా బిసిల రిజర్వేషన్లకు ఎటువంటి నష్టం కలగబోదన్నారు. శాస్ర్తియ పద్ధతిలో కాపులను బిసిల్లోకి చేర్చేందుకు ప్రణాళికను రూపొందిస్తున్నామన్నారు. అనంతరం మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాలతో రాష్ట్రంలోని కాపుల జీవితాల్లో వెలుగు కిరణాలు ప్రసరిస్తున్నాయన్నారు. కాపులను బిసిల్లో చేర్చడానకి ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందని, అలాగే వాల్మీకులను ఎస్టీల్లో చేర్చడానికి సిఎం చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. మంత్రి పరిటాల సునీత మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ముఖ్యమంత్రి నేరవేరుస్తున్నారని, అందులో భాగంగానే వెయ్యి కోట్లు రూపాయలను కాపు కార్పొరేషన్‌కు అందించి కాపులను ఆర్థికంగా బలోపేతం చేస్తున్నారని తెలిపారు. అనంతరం కాపు సంక్షేమాభివృద్ధి కార్పొరేషన్ ద్వారా 10 మందికి వ్యక్తిగత రుణాలను మంత్రులు అందజేసారు. ఈ కార్యక్రమంలో కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ, ఎమ్మెల్సీలు శమంతకమణి, తిప్పేస్వామి, ఎమ్మెల్యేలు ప్రభాకర్ చౌదరి, పార్థసారథి, ఉన్నం హనుమంతరాయ చౌదరి, ఈరన్న, నగర మేయర్ స్వరూప, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ రాయల్ మురళి పాల్గొన్నారు