జాతీయ వార్తలు

బలపరీక్ష తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సీఎం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీలో సీఎం కుమారస్వామి బలపరీక్ష తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అసమ్మతి ఎమ్మెల్యేలు సుప్రీం కోర్టు ముందు కొన్ని ఆరోపణలు చేశారని, వాటిని నివృత్తిచేయాల్సిన అవసరం ఉందని సీఎం అన్నారు. యడ్యూరప్ప విశ్వాస పరీక్షకు ఎందుకు తొందరపడుతున్నారో అర్థం కావటంలేదని, స్పీకర్‌పై కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని సీఎం అన్నారు. కాగా సభలో బీజేపీ నేత యడ్యూరప్ప మాట్లాడుతూ విశ్వాస పరీక్షపై ఒక్కరోజు చర్చ మాత్రమే జరగాలని అన్నారు. రూల్ 164 ప్రకారం చర్చ జరుగుతుందని స్పీకర్ వెల్లడించారు. ఇదిలావుండగా సభకు 15మంది అసమ్మతి ఎమ్మెల్యేలు హాజరుకాలేదు. వీరితో పాటు ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఒక బీఎస్పీ ఎమ్మెల్యే కూడా హాజరుకాలేదు.