ఆంధ్రప్రదేశ్‌

కొవ్వాడ అణుప్లాంటుతో ఉత్తరాంధ్రకు ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలోని కొవ్వాడ వద్ద ఏర్పాటు చేసే అణువిద్యుత్ ప్లాంటు వల్ల భవిష్యత్‌లో ఉత్తరాంధ్ర ప్రాంతానికి పెను ప్రమాదం పొంచి ఉందని సిపిఎం అగ్రనేత ప్రకాష్ కారత్ అన్నారు. ఆయన శనివారం కొవ్వాడ ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కొవ్వాడలో ఏకంగా ఆరు అణురియాక్టర్లను ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమైందన్నారు. అమెరికా, జపాన్ వంటి అభివృద్ది చెందిన దేశాలు అణువిద్యుత్ ప్లాంటపై విముఖత చూపుతున్నాయని అన్నారు. గుజరాత్‌లో అణురియాక్టర్లకు వ్యతిరేకత వ్యక్తం కాగా, ఇపుడు కొవ్వాడలో వాటిని ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించిందన్నారు.