పెరటి చెట్టు

పెరటి చెట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన దేశంలో ఏ ప్రాంతంలోనూ వినిపించనంత ఎక్కువగా నాగ శబ్దం తెలుగు నాట వినిపిస్తుంది. ఇక్కడ ఇంటింటా ఓ నాగన్న ఉంటాడు. ప్రతి కుటుంబంలోనూ ఓ ‘పాపన్న’ (పాప అంటే పామనే అర్థం. పాపరేడు అనే కావ్య ప్రయోగం ప్రచురమే కదా!) కనిపిస్తాడు. ఇక్కడున్నంత మంది నాగరాజులు మరెక్కడా -నాగలోకంలో కూడా - కనిపించరేమో. పాములకి మాటాపలుకూ ఉండదు. కానీ, మన రాష్ట్రంలో ఏ మూలకెళ్లినా ‘నాగవాణి’ వినిపిస్తూనే ఉంటుంది. శివుడి పేరును నాగభూషణంగా పెట్టుకోవడం తెలుగుల ఆనవాయితీ. కొన్ని ప్రాంతాల్లో పాములు అనే పేరు కూడా వినిపిస్తుంది. ఊరూరా నాగశిలలు కనిపిస్తాయి. ఇక్కడ జరిగినంత గొప్పగా నాగులచవితి మరెక్కడా జరగదంటే అతిశయోక్తి కాదు. తెలుగునాట ఇంత పెద్దఎత్తున నాగారాధన జరగడానికి ప్రత్యేకమయిన కారణమేమయినా ఉందా? ఉందనే అంటున్నారు సుప్రసిద్ధ పరిశోధకులు నేలటూరి వెంకటరమణయ్య. సహస్రాబ్దాల తరబడి తెలుగునాటనే ఉంటూ, ఇక్కడికొచ్చి రాజ్యాలు స్థాపించిన చిన్నాపెద్ద రాజ కుటుంబాలతో నిత్యం సత్సంబంధాలు నెరపుతూ వచ్చిన ఆదివాసులే నాగులని ఆయన చెప్పారు. నాగావళి అనే నది, నాగులేరు అనే ఉపనది తెలుగునాటనే కనిపిస్తాయి. నల్లమల అడవుల్లో కృష్ణవేణి నాగార్జున కొండ మీదున్న అత్యంత ప్రాచీన బౌద్ధారామాన్ని చుట్టుకుని ప్రవహిస్తుంది. ఇవన్నీ చూస్తే, తెలుగుదేశ చరిత్రకు ఏదో బలమయిన నాగబంధం ఉండే ఉంటుందనిపించడం సహజం.
మహాభారతం ఆదిపర్వంలో నాగులకు అపారమైన ప్రాముఖ్యం ఇవ్వడం అందరికీ తెలిసిందే. ఆదిశేషుడు, వాసుకి, ఐరావతుడు, తక్షకుడు, కర్కోటకుడు, కాళీయుడు, ధనంజయుడు, కాలకేయుడు, నహుషుడు, వామనుడు, శంఖచూడుడు, తిత్తిరి తదితరులను మహోరగాలనీ, మహా సర్పాలనీ అంటారంది భారతం. ఈ నాగజాతిలోనూ చాలా రకాలున్నాయని చెప్తోంది మహాభారతం. నాగులు, పన్నగులు, కాద్రవేయులు, ఉరగులు తదితరులందరూ నాగజాతీయులేనని భారతం చెప్తోంది. అవన్నీ పౌరాణిక ప్రవచనాలు. అయితే, నేలటూరి వారు తమ ‘చరిత్ర రచన’లో, తెలుగు నాగులు సామంత రాజులనడానికి తిరుగులేని ఉపవత్తులు చూపించారు.
అమరావతి స్థూపంలోని ఒకానొక ఫలకం మీద ‘నాగబు’ అనే మాట కనిపించిందని మొట్టమొదట నమోదు చేసిన పరిశోధక పండితులు వేటూరి ప్రభాకరశాస్ర్తీగారు. అది ‘నాగంబు’ అనే అర్థంలో వాడిన తెలుగు ప్రయోగమనీ, చరిత్రకు తెలిసినంతవరకూ తెలుగు వాడకానికి ఇదే అత్యంత ప్రాచీనమయిన, శాసనస్త ఆధారమనీ విద్వల్లోకం నమ్ముతోంది. ఆరుద్ర తన ‘సమగ్ర ఆంధ్ర సాహిత్యం’ సంపుటాలన్నింటికీ ఈ ‘నాగబు’నే మకుటంగా ప్రదర్శించారు. అమరావతి స్థూపం నిర్మాణం క్రీ.పూ. మూడో శతాబ్దం వరకూ సాగిందని చరిత్ర చెప్తోంది. అంతకు ముందటి శాసనాల్లో ఎక్కడా తెలుగు పదాల ప్రయోగాలు నమోదు కాని నేపథ్యంలో ఇది చారిత్రిక ప్రాముఖ్యం సంతరించుకుంది.
తెలుగు జాతికి ఉన్న చాలా పేర్లలో నాగజాతి అనేది కూడా ఒకటి. తెలుగులను నాగులని పిలవడం ఏనాటి నుంచో ఉన్నదే. మనుషులను నాగులనడంలో మర్మమేమిటి? నాగారాధన చేసే మనుషులనే నాగులంటారనిపిస్తుంది. మానవ శాస్త్ర పరిశోధకులు చెప్పేదాని ప్రకారం, జంత్వారాధనకు దారి తీసే కారణాలు చాలానే వుంటాయి. వాటిలో ఒకటి ఆహారపు అలవాటు. ‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’గా భావించే ఆదివాసులు దానే్న ఆరాధ్యంగా భావిస్తారని ఈ సిద్ధాంతం చెప్తోంది. అయితే, నాగుల విషయంలో దాన్ని యథాతథంగా వర్తింపజెయ్యడం అశాస్ర్తియమనిపిస్తుంది. వెబ్‌స్టర్ నిఘంటువు చెప్పినదాని ప్రకారం, ఆరాధనీయమయ్యే జంతువు (టోటెమ్) ‘విశిష్టమయిన, ప్రతిష్ఠాత్మకమయిన చిహ్నంగానూ, ఆధ్యాత్మిక అస్త్వింగానూ’ కూడా ఉండొచ్చు. బహుశా కృష్ణా గోదావరీ తీరాల్లో అడుగడుగునా కనిపించే నాగుల పట్ల భయమే, భక్తిగా పరిణమించి ఉండొచ్చునన్నది ఓ ఊహ. అదే నాగారాధనకీ, ఆ ఆరాధన చేసేవారి పట్ల జాతి వాచకంగా మారడానికీ దారితీసి ఉండొచ్చు.
అమరావతి శిల్పాల్లో నడినెత్తిన పడగలు ధరించి వుండే మనుషుల ఆకృతులు కానవస్తాయి. అక్కడ స్థూపం కట్టక ముందు నుంచీ అమరావతిలో నివసిస్తూ వుండిన ‘నాగు’లనే స్థానికులనే శిల్పులు అలా చూపించారని కొందరి నమ్మకం. ఇక, తెలుగు, తమిళ చరిత్రల్లో అద్వితీయ ప్రాముఖ్యం సంపాదించుకున్న పల్లవులు కూడా నాగబంధువులే. ఈ ప్రాంతాన్ని ఏలిన పల్లవ రాజ్యస్థాపకుడు వీరకూర్దుడు ఓ ‘నాగకన్య’ను వివాహమాడినందువల్లనే ఆయనకంత రాజభోగం అబ్బిందని అంటున్నారు చరిత్ర పరిశోధకులు. చరిథ్రకి తెలిసిన మరో నాగబంధువు గుణాఢ్యుడు. అతని తల్లిదండ్రుల్లో ఒకరు నాగులట. గుణాఢ్యుడికి మూల వాసుల భాషలపై ఉన్న మమకారం గురించిన కథలు వింటే ఈ ఐతిహ్యం నిజమేనేమో అనిపించడం సహజం.

-మందలపర్తి కిషోర్ 81796 91822