డైలీ సీరియల్

త్రిలింగ ధరిత్రి - 4

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

5
గణపతి దేవుని బంధించి, మహాదేవుని చెరబట్టి దేవగిరి తీసికొనిపోయిన రాత్రి అంతఃపుర చెలికత్తె సైనికుడైన తన భర్త వీరయ్య సాయంతో మహారాణిని, ఇరువురు ఆమె పుత్రికలను నేర్పుగా రాజధాని దాటించింది. ఆమె వారిని ఒక కుగ్రామంలో తన బంధువుల ఇంట రహస్యంగా ఉంచింది. ఆమె భర్త తన సైనిక వృత్తి మానుకొని వ్యవసాయం చేతబట్టి మహారాణిని ఆమె పుత్రికలను శ్రద్ధగా చూసుకొంటున్నాడు. ఆ చెలికత్తె అల్లిక పనిలోనిది. మహారాణి కోరికతో ఆ పని ఆమెకు నేర్పింది. మహారాణి తన చెలికత్తెకు అక్కడ పనిలో చేదోడు వాదోడుగా ఉండటంవల్ల కొంత సంపాదనకు సహాయకారి అయింది.
మహారాణి తన బిడ్డలకు ఉచిత రీతిన విద్యాబోధ, నీతి బోధ చేస్తున్నది.
రోజులు గడ్డువే అయినా ఆ దంపతులు మహారాణికి యువరాణులకు ఏ ఇబ్బంది కలుగకుండా కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. మహారాణి పిల్లలు ఆ ప్రాంగణం దాటి బయటికి పోరు. పోకుండా వారికి అన్ని వసతులు సమకూరుతున్నాయి.
మహారాణి తన నగలను తీసి వచ్చిన రోజున చెలికత్తెకిచ్చింది. ‘‘ఇక వీటిని ధరించే కాలం చెల్లిపోయింది. మా బ్రతుకు కోసం మీ బ్రతుకులు ఫణంగా పెడుతున్నారు. అవసరానికి అక్కరకు రాని వస్తువుల వల్ల ప్రయోజనం ఏమిటి? అదీగాక వీటిని కాపాడటం కూడా కష్టం. తగిన వెలకమ్మి మన జీవనానికి సరియైన మార్గం చూసుకోవటం మంచిది’’ అని అంది.
రంగమ్మ భర్త వీరయ్యకిచ్చింది. అతడు చాలా నొచ్చుకున్నాడు. నిజానికి వాటిని దక్కించుకోవటం కూడా కష్టమే. మంచి రోజులు వస్తే అన్నీ అవే సమకూరుతాయి. మహారాణి చెప్పిన మాటే నిజమనిపించింది.
లోపాయికారిగా గ్రామాంతరంలో తనకు బాగా తెలిసిన విపణి వీధిలో అతడు వాటిని అమ్మి సొమ్ము తెచ్చాడు.
గత పదేళ్లుగా ఆ భాగ్యమే వేణ్ణీళ్లకు చన్నీళ్లుగా మహారాణికి పిల్లలకు వీలైనంత వరకు ఏ లోపమూ రాకుండా పని వెళ్ళింది.
6
గణపతి దేవుడు రాజాంతఃపురం ప్రవేశించాడు. ఆ వర్తమానం ఆనోట ఆనోట ఈ సైనికుడి దాకా వచ్చింది. అతడు ఆశ్చర్యపోయాడు. పరమేశ్వరుడికి పదేపదే దణ్ణాలు పెట్టాడు. భార్యను దగ్గరకు పిలిచి వేపచెట్టు నీడన రుూ చల్లని కబురు రహస్యంగా చెవిన వేసి, విషయం తెలుసుకువస్తానని రాజధానికి బయలుదేరాడు.
రాజధానికి వచ్చి అతను అన్ని విషయాలు తెలుసుకున్నాడు. గణపతి దేవుల వారు అంతఃపురం ప్రవేశం చేసిన సంగతి తెలుసుకున్నాడు. మధ్యాహ్నం వేళదాకా ఉండి గణపయామాత్యుల వారింటికి వెళ్లాడు. అప్పుడే అమాత్యుల వారు భోజనం చేసి తాంబూలం సేవిస్తూ వసారాలో ఉయ్యాల బల్లపై కూర్చున్నారు.
ఆ సైనికుడు తన గురించి చెప్పి భటుడికి అమాత్యుల వారి దర్శనం కోసం ఒక అత్యవసరమైన విషయం తెలపాలని కబురు చేశాడు.
అమాత్యుల వారు ప్రవేశం కల్పించారు.
ఆ సైనికుడు అమాత్యుల వారికి సాష్టాంగదండ ప్రణామం చేసి కడివెడు దుఃఖంతో జాగిలపడి, కన్నీరు కారుస్తున్నాడు.
అమాత్యులవారన్నారు.
‘‘ఏడవకు! నీకొచ్చిన ఆపద ఏమిటి? నాకు చెప్పు. నేనున్నాను’’ అని.
అతడు కంఠం పెకలించుకుని ‘‘ప్రభూ! మహారాణి..’’ అని మళ్లీ ఏడవ సాగాడు.
గణపయామాత్యులవారు అమాంతం లేచి..
‘‘మహారాణి.. ఏం జరిగింది’’
‘‘ప్రభూ! మహారాణి బ్రతికే ఉన్నారు’’
‘‘నిజంగానా?’’
‘‘అవును ప్రభూ! నా దగ్గరే ఉన్నారు. నా భార్య ఆమెగారి చెలికత్తె. నేను అంతఃపుర సైనికుడను. ఆ రాత్రి నా భార్య చాకచక్యం వల్ల మహారాణిగారిని యిరువురు యువరాణులను తీసుకొని మారు వేషంలో ఎవరికీ తెలియకుండా పొరుగూరు వెళ్లాం. ఇనే్నళ్లుగా ఆ మహాతల్లిని, బిడ్డలను కంటికి రెప్పలా చూసుకుంటున్నాం. పరమేశ్వరుడి దయ వచ్చింది. మంచి రోజులు వచ్చినాయి. ప్రభువులు ఈ విషయం తమకు విన్నవిద్దామని వచ్చాను’’.
గణపయామాత్యులు ఆనందంతో అతన్ని కౌగిలించుకున్నంత పని చేశారు. వెంటనే మహారాణిని తీసుకుని రావటానికి మేనాను సైనికులను అతని వెంట పంపించాడు. అతనికొక అశ్వాన్నిచ్చి.
అంత దూరాన సైనికులను చూచి ఆ గ్రామవాసులు భయభ్రాంతులైనారు. మహారాణి చెలికత్తె వారికేమీ భయం లేదని అన్నది లోపల ఉన్న మహారాణికి పిల్లలకు ఈ విషయం తెలియలేదు.
ఇంటి ముందు మేనా ఆగింది సైనికులతో. గణపయామాత్యులవారు లోపల ప్రవేశించారు.
ఆయన్ను చూసి కూర్చున్న మహారాణి లేచి నిలబడింది. మేలిముసుగు సవరించుకుంటూ, యువరాణులు తెల్లబోయి తల్లివెనక నిలబడ్డారు.
‘‘అమ్మా! నేను గణపయామాత్యుడను. శ్రీ్ధరులవారి కుమారుడను.’’
శ్రీ్ధరులవారి పేరు విన్న తరువాత ఆమెకు గుర్తుకువచ్చి కన్నీళ్లు జలజలా రాలినాయి.
ఆమె మాట్లాడలేకపోయింది.
‘‘అమ్మా! మనకు మంచి రోజులు వచ్చినాయి. తమ సంగతి తెలియక మావంటి వాళ్లు తల్లడిల్లి పోయారు. గణపతి దేవులవారిని చెర విడిపించుకోగలిగాం. మహారాజు జయతుంగులు వారికి ఆహ్వానం పలికారు. బయలుదేరండి రాజధానికి వెడదాం’’.
మహారాణి చెలికత్తె వైపు చూసింది. ఆమె ఆనందబాష్పాలు రాలుస్తూ ‘‘అమ్మా! మంచిరోజులు వచ్చినాయి’’ అంది.
మహారాణి అన్నారు ‘‘మీరు బయలుదేరండి’’ అని చెలికత్తెతో
‘‘అమ్మా! మేమూ మీతో పాటే’’
* * *
రాజాంతఃపురంలో మహారాణి ప్రవేశించే సరికి అందరూ ఆశ్చర్యపోయారు.
మహారాణిని, యువరాణులను గణపయామాత్యులవారు మహారాజుకు మహారాణిని పరిచయం చేశారు.
మహారాజు నొచ్చుకుని ఖిన్నుడై కన్నీటి బిందువులు రాల్చారు.
మహారాణి సాదరాహ్వానాన్ని అందించింది.
సోమలదేవి యువరాణులను కౌగిలించుకుని లోపలికి తీసుకువెళ్లింది.
గణపతిదేవుడు ఆశ్చర్య చకితుడైనాడు. తల్లిని కౌగిలించుకుని ధారాపాతంగా కన్నీళ్లు కార్చాడు. సోదరీమణులను దగ్గరకు తీసుకున్నాడు, శిరస్సులపై చేతులు వేసి.
గణపయామాత్యుల వారికి పాదాభివందనం చేశారు. ఇన్నాళ్లు చూసిన సైనికుడికి, చెలికత్తెకు చేతులెత్తి నమస్కరించాడు.
‘‘ప్రభూ! మేమేం చేయలేదు. మా ధర్మం నెరవేర్చాం... మీ ఉప్పు తిన్నవాళ్లం.. ఆ మాత్రం చేయకుండా ఎట్లా ఉండగలం’’ అన్నాడు వీరయ్య.
గణపతి దేవుడిని తల్లి కౌగిలించుకుని వదల లేదు. చెల్లెళ్లు కూడా అంతే.

(సశేషం)

-అయ్యదేవర పురుషోత్తమరావు