నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ॥ వసుధాస్థలంబున వర్ణహీనుఁడు గాని
బహుళ దురాచారపరుఁడు గాని
తడిపి కాసీయని ధర్మశూన్యుఁడు గాని
చదువనేరని మూఢజనుఁడు గాని
సకల మానవులు మెచ్చని కృతఘు్నఁడు కాని
చూడ సొంపును లేని శుంఠకాని
యప్రతిష్ఠలకు లోనైన దీనుఁడు గాని
మోదటికే మెఱుఁగని మోటుగాని
తే॥ ప్రతిదినము నీదు భజనచేఁ బరగునట్టి
వానికే వంక లేదయ్య! వచ్చు ముక్తి
భూషణ వికాస! శ్రీ్ధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!
భావం: ఓ నరసింహస్వామీ! ఈ నేలపై కులహీనుడైనా, చెడ్డ నీతిగలవాడైనా, దురాచారుడైనా, కాసివ్వని ధర్మశూన్యుడైనా, చదువురాని మొద్దయినా, చేసిన మేలు మరచేవాడైనా, అందంలేని శుంఠైనా, కీర్తిప్రతిష్ఠలు లేనివాడైనా ఏమీ తెలీని మందమతియైనా రోజూ నీ కీర్తన పాడితే వానికెలాంటి వంక ఉండదు. వానికి ముక్తి తప్పక లభిస్తుంది.