పెరటి చెట్టు

పెరటిచెట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన తెలుగంటే మాటలు కాదు!
మన సాహిత్యం గురించి తెలుసుకునే ప్రయత్నం, మన భాష గురించి తెలుసుకోవడంతో మొదలు కావడం న్యాయం. ఉచితం. ‘్భష’ అంటే మాట అనేదే నైఘంటికార్థం కావచ్చు. కానీ, దానికి అంతకు మించిన భావమే ఉంది. ప్రపంచంలోని అత్యంత ప్రచురమయిన భాషల్లో తెలుగు ఒకటి. ద్రావిడ భాషా కుటుంబానికి పెద్దన్న తెలుగు. ప్రాంతీయ, జాతీయ సరిహద్దులను అధిగమించి, అంతర్జాతీయ ప్రతిపత్తి సాధించుకోగలిగిన భాష మన తెలుగు. అంతర్జాతీయ వర్ణమాల సంస్థ (ఇంటర్నేషనల్ ఆల్ఫాబెట్ అసోసియేషన్) లెక్క ప్రకారం ప్రపంచం మొత్తం మీద అత్యుత్తమ లిపుల జాబితాలో తెలుగు రెండో స్థానంలో ఉంది. (కొరియన్ లిపి మనకన్నా ఒక్కడుగు ముందుంది!) కాగా తెలుగు మాట్లాడ్డం వల్ల మన శరీరంలో 72,000 న్యూరాన్లు క్రియాశీలంగా పని చేస్తాయని లెక్క తేల్చారు నిపుణులు. మరే భాష మాట్లాడినందువల్ల ఇంత ఎక్కువ సంఖ్యలో న్యూరాన్లు క్రియాశీలకం కాబోవట. ప్రపంచం మొత్తం మీద మన భాషను మాతృభాషగా మాట్లాడే వాళ్లు దాదాపు 15 కోట్ల మంది ఉంటారని ఒక అంచనా. వాళ్లలో దాదాపు సగం మంది రెండు తెలుగు రాష్ట్రాల్లో (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో) ఉన్నారనీ, మిగతా సగం మంది తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, అండమాన్ నికోబార్, పుదుచ్చేరి తదితర రాష్ట్రాల్లో ఉన్నారనీ లెక్కలు చెప్తున్నాయి. మారిషస్, మలేషియా, బర్మా, శ్రీలంక, దక్షిణాఫ్రికా, ఈస్ట్ ఇండీస్ తదితర దేశాల్లో కూడా తరతరాలుగా తెలుగు మాట్లాడేవాళ్లు ఉన్నారు. భారత రాజ్యాంగం ప్రాథమిక అధికార భాషలుగా గుర్తించిన వాటిల్లో తెలుగు ఒకటి. తెలుగుతోపాటుగా, మరో 22 భాషలు ఈ జాబితాలో ఉన్నాయి. అది వేరే సంగతి. కాగా, సంఖ్యాపరంగా చూస్తే భారతీయ భాషలు మాట్లాడేవాళ్ల జాబితాలో తెలుగుల స్థానం మూడోది. అయితే, అనేక రాష్ట్రాల్లో మాట్లాడే భాషల జాబితాలో మన తెలుగు ప్రప్రథమ స్థానంలో ఉంది. మన దేశంలోని అత్యంత ప్రాచీన - క్లాసికల్ - భాషల్లో తెలుగు ఒకటి. అంతేకాదు, ప్రపంచం మొత్తం మీద అత్యధిక సంఖ్యాకులు మాట్లాడే భాషల జాబితాలో మన తెలుగు పదిహేనవ స్థానంలో ఉంది.
ఈ వాస్తవాల నేపథ్యంలో మనం గుర్తుంచుకోవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఇక్కడికి చేరుకోడానికి మనం వేలాది సంవత్సరాలు గడిచొచ్చాం. నడిచొచ్చిన దారినీ, గడిచొచ్చిన కాలాన్నీ మర్చిపోకూడదు కదా! అంచేత ముందుగా వా టిని ఒక్కసారి మదించుకుని ముందుకు సాగుదాం.
మూల ద్రావిడ భాష నుంచి వేరై, తెలుగు స్వతంత్ర భాషగా రూపొందే క్రమం ఎప్పుడో మొదలయినప్పటికీ కనీసం మూడు మూడున్నర వేల సంవత్సరాల నాడే ఇది ఓ కొలిక్కి వచ్చి ఉంటుందని పరిశోధకులు లెక్క తేల్చారు. ఇక, కన్నడ లిపికి భిన్నమయిన తెలుగు లిపి ఏర్పడడంతో ఈ ప్రక్రియ పూర్తయిందని భావిస్తున్నారు. అంటే అర్థం, ఆ తర్వాత మన లిపిలో గానీ భాషలో గానీ మార్పులు జరగలేదని కాదు. ఉదాహరణకి ‘ర’కారంతో కూడిన సంయుక్తాక్షరాలను సూచించే నిమిత్తం ‘వలపల గిలక’ వాడకం మానేసి, దాదాపు 175 సంవత్సరాలవుతోంది. ఇంగ్లిష్ భాషను చూసి విరామ చిహ్నాలూ (, ;), ఉటంకింపు గుర్తులూ (‘...’) వాక్యాంత చిహ్నాలూ (.) లాంటివి వాడడం మొదలుపెట్టి గట్టిగా నూట పదిహేనేళ్లు కూడా కాలేదు. సీపీ బ్రౌన్, పరవస్తు చిన్నయసూరి, వావిళ్ల వేంకటేశ్వర శాస్ర్తీ తదితరులు ఈ తరహా సంస్కరణలకు కారకులంటారు. ఇప్పటికీ, ఇలాంటి భాషా సంస్కరణలు జరుగుతూనే ఉన్నాయి. ఉదాహరణకి - మేం చిన్నప్పుడు అక్షరాలు నేర్చుకునేప్పుడు ‘అలు, అలూ’ అనే పేర్లతో రెండక్షరాలు - అచ్చులు - నేర్పేవాళ్లు. ఇవాళ అవి అదృశ్యమయిపోయాయి. అవి ఎలా వుండేవో మీకు చూపించడం కూడా ఇప్పుడు కష్టమే మరి. ఎందుకంటే, ఏ కీబోర్డులోనూ ఈ చిహ్నాలు లేవిప్పుడు. నాకు తెలిసినంత వరకూ ‘క్లుప్తం’ అనే మాట రాసినప్పుడు మాత్రమే ‘అలు’ని వాడగలం. ఇక ‘అలూ’ని రాయడం నేనెక్కడా చూళ్లేదు (క్షమించాలి. నా చిన్నప్పుడు ‘క్లూ’ అనే అపరాధ పరిశోధక పత్రిక ఒకటి ఉండేది. దాని పేరును ‘అలూ’ అక్షరం ఉపయోగించి రాసేవారు. తమాషాకి) శాసన భాషలో కనిపించే ‘జ్ష’ ధ్వనికి కూడా ఒకప్పుడు ఓ గుర్తు ఉండేది. అది చూడ్డానికి ‘బండి ర’ మాదిరిగానే ఉండేది. (ఈ ధ్వనీ, దానికి ఓ చిహ్నమూ తమిళ మలయాళ భాషల్లో లిపుల్లో ఇప్పటికీ కనిపిస్తుంది - అది వేరే విషయం) ఆ ధ్వనిలోంచే ‘ళ’ ‘ఱ’ ‘డ’ లాంటి ధ్వనులు పుట్టాయని అంటారా. పోతే, ‘బండి ర’ - ఱ - కూడా క్రమంగా వ్యవహారంలోంచి తప్పుకుంది. అందుకే, నేటి వర్ణమాలలో ఇవేవీ కనిపించడం లేదు. ఇలా ఎప్పటికప్పుడు సంస్కరణలు జరుగుతున్నందువల్లనే, మన తెలుగు ఇప్పటికీ జీవద్భాషగా నిలిచి వుంది మరి!