వినమరుగైన

బసవరాజు అప్పారావు గేయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భావకవిత్వం గురజాడ ముత్యాల సరాలతోనే అవతరించిందనడం నిస్సందేహంగా సబబు. రాయప్రోలు సుబ్బారావు గారితో ఆరంభమయిందనడం పాత ఛందస్సులలో కొత్త భావాలు వెల్లివారడాన్ని బట్టి అవుననవచ్చు. కృష్ణశాస్ర్తీగారు భావకవిత్వంలో మకుటధారి కదా! ఆయన శ్రీ బసవరాజు అప్పారావుగారి గీతాలు 1955లో పునర్ముద్రణ సందర్భంగా వ్రాస్తూ ‘‘గురజాడకు అనుచరుడు’’ అంటూనే ‘‘బసవరాజు మొట్టమొదటి భావకవి. 1915 నాటికే కవితాంగణంలోకి అడుగుపెట్టేశాడు’’’ అన్నారు.
బసవరాజు అప్పారావుగారిని సన్నిహితంగా ఎరిగినవారు గనక కృష్ణశాస్ర్తీగారి మాటలకు ప్రామాణికత ఉంది. అప్పారావు గారి గీతాలు చదివిన ఎవరకైనా ఆయనకు కలిగిన భావాలే కలుగుతాయి. నండూరి సుబ్బారావుగారూ, కృష్ణశాస్ర్తీగారూ, బసరాజు అప్పారావుగారూ మద్రాసులో చదువుకునే రోజుల్లో కలిసేవారు.
‘‘అప్పుడప్పుడు అద్భుతరసంతో నిండిన మా మనస్సులకు అపరిచితమైన అమరలోకంలో నుండి అవతరించిన వాడులాక కనపడేవాడు అప్పారావు’’ అని అంతటితో ఆగక కాకినాడలో జరిగిన ఈ ముగ్గురు మిత్రుల గోష్ఠికి ‘బసవరాజు ప్రాణం’ అన్నారు.
1924 నాటికి భావకవిత్వం వనంలో వుంది. గాంధీ నాయకత్వపు ఎం వెనె్నలల కలయిక దేశాన్ని నూతనోత్సాహంలో ముచెత్తింది. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు ఆదర్శాలూ, త్యాగాలూ కలబోసి పాండిత్యం వ్యంగ్యం (వెటకారం అనాలేమో) భావోద్వేగంతో జోడించి ఉపన్యాస సంగీతాన్ని ఆంధ్రదేశమంతటా వినిపిస్తున్నారు. అప్పటికి బసవరాజు అప్పారావుగారి కావ్యాలాపన విస్తృంగా సాగుతోంది. ఆంగ్ల సాహిత్య వాసనలు మలయమారుతంలా విద్వజ్జన చైతన్యంలో భారతీయతను నింపుకొని విహరిస్తున్నాయి.
కవిత్వాన్ని వాసన చూసినవారు మధ్య మెట్లపైనా, పై మెట్లపైనా ఎవరి రీతిని, ఫక్కీని వారు ఎంచుకుని గొంతులు విప్పారు. దానే్న అప్పారావుగారు నోరు విడబడుతున్నదయ్యా గొంతులో జీర తెగిపోతున్నదయ్యా అంటూ గొంతు సవరిచుకున్నారు. కలలు కనడం, కవితలల్లడం అనుభవాలే పూవులుగా మాలలు గుచ్చడం జరిగిపోతోంది. ఇది లిరిక్ పొయిట్రీ లక్షణం. ఈ భావజాలంలో ప్రేమతత్త్వం, వియోగదుఃఖం, కామెడీలూ, ట్రాజెడీలూ పొంగుతూ చెంగు చెంగున గంతులేస్తూ, లేస్తూ పడుతూ దేశభక్తి పెల్లుబకుతూ ఆరాధనాభావం గూడుకట్టుకున్న పాటలూ పద్యాలూ సంప్రదాయిక భావనలతో తేటతెల్లంగా పల్లె జీవనాన్ని బింబిస్తూ పల్లెపాటలూ స్ర్తిల పాటలుగా అప్పారావుగారి గీతాలు రూపుదాల్చి వెల్లువలై ప్రవహిస్తూనే ఉన్నాయి.
కావ్య పానము చేసి కైపెక్కినానే అంటూ అప్పారావుగారు కవిత ఆవేశిస్తే కైపెక్కిపోయే వారనకతప్పదు. శ్రీ రామకృష్ణ పరమహంస తరచుగా కలిగే దివ్యానుభవంలాగే అప్పారావుగారి దివ్యానుభవం కూడా అతిలోకమనాలి. అందుకు నిదర్శనం
‘కావ్యదేవతనోట కవిత విన్నానే
చీమలనిపించారె భూమిలో కవులూ’ అనడమే.
ఆ అనుభవం కట్టలు తెంచుకుని శివ జటాజూటంలోకి, ఆ వెనుక హిమగిరి మీదికి దూకి గంగలా పరవళ్ళు తొక్కుతుంది. ఆ శివమెత్తిన గంగయే అప్పారావుగారి కవిత. అదుపులేని నిసర్గ సుందరమైన భాషలో వాడిగా వేడిగా సూటిగా పలుకుతారాయన. పండితుల కృతకత్వాన్ని నిరసించారు. తన వాగ్ధాటి పట్ల గల ప్రగాఢ విశ్వాసంతో తన భావాలను భాషలోకి మలిచారు. ఆయనలో నిగ్రహం తక్కువనీ, శిల్పిం తక్కువనీ అనేవారికి ఆయన సమాధానం.
‘‘ననె్నవ్వరాపలే రీవేళా నాధాటి కోపలే రీవేళా’’
మెరుగులు దిద్దడానికి తీరిక లేదు ఉన్నది దాచనక్కరలేదు. కనుక వక్రోక్తితో తప్పించుకోనక్కరలేదు. అపుడు నిగ్రహంతో పనేమిటి? ఆర్జవంలో ఉండే జీవం కృతకత్వంలో ఉండదు.
సినిమాల కోసం పాటలు వ్రాయడానికి తపనపడి, కష్టం కూడా పడి కృతకృత్యులయ్యేవారుంటారు. బసవరాజు అప్పారావుగారి పాటలెన్నింటినో సినిమా వారు రెండు చేతులా దోచుకున్నారు గాని, దాచుకోలేదు. ఆయన పాటలను రేడియో లలిత సంగీత గాయకులు వాడుకున్నారు. నాట్య కోవిదులు వాడుకున్నారు. అది ఆయన భాషా భావ, ఛందోగతుల అనుకూల్యం. కపట నాటకాలాడలేని కారణం చేతనేమో వృత్తాలు వ్రాయలేదు. వృత్తరచనలో కొంత కృతకత్వం ఉంటుందనడం న్యాయమే. సొగసులేదని కాదు.
‘ఇల్లాలు’ సినిమాలో నటించిన కీర్తిశేషులు సాలూరు రాజేశ్వరరావుగారు కావ్యదేవత నోట కవిత విన్నానే అని స్వరం హెచ్చించినపుడు ఆ పాటకి సార్థకత వచ్చింది.
-సశేషం
(ఆకాశవాణి సౌజన్యంతో...)

-సూరంపూడి భాస్కరరావు