జాతీయ వార్తలు

డోలాయనంలో సంకీర్ణ సర్కార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు: అసమ్మతి ఎమ్మెల్యేలపై సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు తర్వాత కుమారస్వామి ప్రభుత్వం పరిస్థితి డోలాయనంలో పడింది. రేపు విశ్వాస పరీక్షకు సిద్ధమైన వేళ ఈ 15 మంది ఎమ్మెల్యేలు హాజరుకాకపోతే శాసనసభలో సభ్యుల సంఖ్య 209. సభలో మేజిక్ ఫిగర్ 105. ఈ ఎమ్మెల్యేల రాజీనామా వల్ల సంకీర్ణ ప్రభుత్వం బలం 101 మాత్రమే. బీజేపీ బలం 105 కాగా, మరో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు మద్దతు పలుకుతున్నారు. ఈ నేపథ్యంలో విశ్వాస పరీక్షలో కుమారస్వామి నెగ్గే అవకాశాలు దాదాపు సన్నగిల్లినట్లే. ఇదిలావుండగా సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు స్పీకర్ రమేశ్‌కుమార్ తెలిపారు. రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.