జాతీయ వార్తలు

ఇంకా తేలని కర్ణాటక బల పరీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు: కర్ణాటకలోని రాజకీయ సంక్షోభం ఇంకా ఒక కొలిక్కి రాలేదు. అసెంబ్లీలో సీఎం కుమారస్వామి బల పరీక్షకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆయన తీర్మానాన్ని సైతం ప్రవేశపెట్టారు. అసమ్మతి ఎమ్మెల్యేలు సుప్రీం కోర్టు ఎదుట లేవనెత్తిన వివిధ అంశాలకు వివరణ పేరుతో సుదీర్ఘ ప్రసంగం చేశారు. తాను ఇది వరకే చెప్పానని, అధికారం శాశ్వతం కాదని, విశ్వాస పరీక్ష ఎదుర్కొంటే ఏమి జరుగుతుందో తనకు తెలుసునని అన్నారు. కాంగ్రెస్ పక్ష నేత సిద్ధరామయ్య మాట్లాడుతూ అసమ్మతి ఎమ్మెల్యేలపై సుప్రీం కోర్టు తీర్పు స్పష్టంగా లేదని, ఇటువంటి పరిస్థితుల్లో విశ్వాస పరీక్ష పెట్టడం సరికాదని అన్నారు. విప్ జారీ చేసినా సుప్రీం తీర్పునకు అనుగుణంగా అసమ్మతి ఎమ్మెల్యేలు రాకపోతే సంకీర్ణ ప్రభుత్వానికి నష్టం అని తెలిపారు. మంత్రి శివకుమార్ మాట్లాడుతూ తమ ఎమ్మెల్యేలకు రక్షణ కల్పించాలని అన్నారు. మా ఎమ్మెల్యేలు కిడ్నాప్ అయ్యారంటూ సిద్ధరామయ్య లేఖ రాయటంపై స్పీకర్ మండిపడ్డారు. తనకు ఎమ్మెల్యే శ్రీమంత్ పాటిల్ పేరుతో లేఖ వచ్చింది. ఆ లేఖలో తాను ఛాతి నొప్పితో హాస్పిటల్‌లో ఉన్నట్లు ఉన్నదని, ఆ లేఖపై తేదీగానీ, లెటర్ హెడ్‌గానీ లేదని, ఇటువంటి లేఖను తాను ఎలా నమ్మగలను అని ప్రశ్నించారు. శ్రీమంత్ పాటిల్ కుటుంబాన్ని సంప్రదించి తనకు నివేదిక ఇవ్వాల్సిందిగా హోంశాఖ మంత్రిని స్పీకర్ ఆదేశించారు. మరోవైపు విశ్వాస పరీక్షను కావాలనే ఆలస్యం చేస్తున్నారని, వెంటనే ఆలస్యం చేయకుండా విశ్వాస పరీక్ష పెట్టాలని బీజేపీ ఎమ్మెల్యేలు గవర్నర్ వాజూభాయ్ పటేల్‌ను కలిశారు.