ఆంధ్రప్రదేశ్‌

శివాలయాల్లో భక్తజన సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా ఆంధ్ర, తెలంగాణాల్లో ప్రముఖ శైవ క్షేత్రాలు బుధవారం భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు భారీ సంఖ్యలో శివాలయాలకు చేరుకొని పూజాదికాలు నిర్వహిస్తున్నారు. భద్రాచలం వద్ద గోదావరిలో వేలాదిమంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. గుంటూరు జిల్లా బాపట్ల సమీపంలోని సూర్యలంక సాగర తీరంలో వేలాదిగా భక్తులు పుణ్యస్నానాలు చేశారు. శ్రీశైలం, వేములవాడ, యాదగిరిగుట్ట తదితర పుణ్యక్షేత్రాల్లోనూ భక్తుల తాకిడి అధికమయింది.