హైదరాబాద్

కసరత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 18: ఎండకాలం ముగియనుంది. ఇప్పటికే ఓ దఫా వర్షాలు దంచికొట్టడంతో అప్రమత్తమైన ముఖ్యమైన విభాగాలు వానాకాలం కష్టాలను ఎదుర్కొనేందుకు కార్యచరణను సిద్ధం చేయటంలో నిమగ్నమై ఉన్నాయి. మహానగరంలో జనజీవనంతో ముడిపడి ఉన్న జిహెచ్‌ఎంసి, జలమండలి, విద్యుత్, ఆర్టీసి ఇతరత్ర శాఖలు ఇప్పటి నుంచే వర్షాకాలాన్ని ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన వ్యూహంతో కసరత్తు చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే జిహెచ్‌ఎంసి ప్రత్యేక బృందాలను సిద్దం చేయటంతో పాటు వాటికి అనుసంధానంగా సెంట్రల్ ఎమర్జెన్సీ బృందాలను కూడా కాస్త ముందుగానే రంగంలో దంపనుంది. అలాగే ప్రతి వర్షాకాలంలో భారీగా వర్షాలు కురిసి మ్యాన్‌హోళ్లు పొంగి ప్రవహించినపుడు అప్పటికపుడు సహాయక చర్యలు చేపట్టేందుకు జలమండలి తరపున ప్రతి సంవత్సరం జూలై 1వ తేదీ నుంచి రంగంలో దిగాల్సిన ఎమర్జెన్సీ బృందాలు కొద్దిరోజుల క్రితం అర్థరాత్రి దంచికొట్టిన వర్షంతో కాస్త ముందుగానే అప్రమత్తమయ్యాయి. ఎపుడు ఇంతటి వర్షం కురిసినా క్షేత్ర స్థాయిలో కావల్సిన సహాయక చర్యలను అందించేందుకు సిద్దంగా ఉన్నట్లు జలమండలి ఎండి దాన కిషోర్ ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే! ఇదే అంశంపై కొద్దిరోజుల క్రితం రాష్ట్ర మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కెటిఆర్ సమీక్ష కూడా నిర్వహించారు. ముఖ్యంగా నగరంలో భారీ వర్షాలు కురిసినపుడు వర్షం ఎక్కువగా నీరు స్టాగినెట్ అయ్యే 27 ప్రాంతాల జాబితా, ఆ ప్రాంతాల్లో ఇప్పటి వరకు జిహెచ్‌ఎంసి తీసుకున్న చర్యలను వివరిస్తూ నివేదికలు పంపాలని మంత్రి ఆదేశించినట్లు తెలిసింది. నిత్యం రద్దీగా ఉండే 27 ప్రాంతాల్లోని సమస్మాత్మక వాటర్ స్టాగినెట్ పాయింట్ల వద్ద శాశ్వత ప్రాతిపదికన చర్యలు చేపట్టగలిగితే రోడ్లపై నీరు నిలిచి వాహనదారులెదుర్కొంటున్న ఇబ్బందులు చాలా వరకు పరిష్కరించవచ్చునని సర్కారు భావిస్తోంది. అంతేగాక, ప్రతి వర్షాకాలం అధికారులు వాటర్ స్టాగినెట్ అయ్యే ప్రాంతాల్లో చర్యలు చేపట్టామని ప్రకటించుకుంటున్న అవి కేవలం తాత్కాలిక ఉపశమనాన్ని కల్గిస్తున్నాయే తప్పా, మళ్లీ వర్షాకాలం వచ్చే నాటికి సమస్య మొదటికొస్తుండటం పట్ల మంత్రి అధికారులతో సీరియస్‌గా చర్చించినట్లు తెలిసింది. సమస్యాత్మకమైన వాటర్ స్టాగినెట్ పాయింట్ల జాబితాను తెప్పించుకున్న తర్వాత అక్కడ చేపడుతున్న చర్యలను నేరుగా క్షేత్ర స్థాయిలో తనిఖీ చేయాలని మంత్రి కెటిఆర్ భావిస్తున్నట్లు సమాచారం.