భక్తి కథలు

కాశీఖండం 164

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అగ్నిదేవా! నీకీ కూడు తీపి అయిందా? నిర్భాగ్యుడా! చంద్రా! నీ లోపలి కళంకాల్ని బయటపెట్టుకొన్నావు. ఓ పౌలస్త్యా! నిన్ను కనుగొంటే సిగ్గువేస్తుంది. దేవేంఅదా! నీ ముష్కరాలు ప్రసిద్ధాలే కదా! ఓ బృహస్పతీ! నీ చరిత్ర విచిత్రమైంది. నీచమైనది. నిష్ప్రయోజనాలూ, నిరర్థకాలు అయిన మాటలు పలకడం ఇంక చాలు. ఇక్కడ వున్న ఈ అందరూ పరికింపగా నేడు రేపటిలో ఏ కర్మ పరిపాకం పొందనున్నారో? ఏ దుర్గతి చెందనున్నారో? ఏ ఆపదలో చిక్కువడనున్నారో? ఏ ఏ పంచల్లో కూలిపోనున్నారో? అటుపైని జరిగేది దేవుడే ఎరుగును’’ అని పలికి భవుడి పత్ని సతీదేవి వాక్రుచ్చింది.
భుజగహారుడైన శివుడి రాణివాసం- లేక సతీదేవి అధిక క్రోథంవల్ల పుట్టిన యోగాగ్ని పాద పద్మాల్లో ఉదయిచినప్పుడు సరికొత్త లత్తుకద్రవం చెలువుని పొందింది. ఆమె కటి మండలంపైన కనిపించినప్పుడు బంగారు మొలనూలి కాంతిని పొందింది. ఆమె వక్షమున మొలకెత్తేటప్పులడు కుంకుమ పువ్వు మేని పూత పొలుపుని, ఆమె సీమంతంలో చిగురించే సమయంలో మనోజ్ఞమైన సింధూరారుణ కాంతిని వృద్ధి చెందిస్తూ రగులుకొని ఆస్థాన రంగభూమిలో భగ్గుమని మండింది.
ఆ అధ్వర వాటికలో పరమ శివుడి పట్టమహిః తన దేహం అనే సమిధని యోగాగ్నికి ఆహుతి చేసింది. శోక పరవశులై చుట్టపక్కాలు హాహాకారాలు ఒనరిస్తూ ఆక్రోశించారు. ముఖాలు వెల్లవెల్లనై రుషులు, అమరులు భీతి చెంది చేతులు పిసుకుకొన్నారు. చేతుల్లో నుంచి జారిపోయిన పుల్ల వెలగ చెట్టు స్రుక్కులు, స్రువాలు కలవారై ఋత్విక్కులు విభ్రాంతి పొందారు
(బ్రహ్మ, ఉద్గాతమున్ను వారు ఋత్విక్కులు, మొత్తం పదహారు మంది ఋత్విక్కులు వుంటారు). అగ్నిజ్వలింపక ఆరిపోయే విధంగా ఏమీ లేక ఉడిగిపోయి - తగ్గిపోయి- చల్లపడిపోయింది. భువిని దివిని పెక్కు ఉత్పాతాలు పుట్టాయి. ఒక పాటి మునులు, దేవతలు ఆ యాగ వాటికని వీడి వెడలిపోయారు.
సతీదేవితో కైలాసం నుంచి ఏతెంచిన పారిషదులు లేక ప్రమథులు శీఘ్రంగా చని సతీదేవి వార్తని శివుడికి విన్నవించారు. భవుడు కుపితుడై భ్రుకటిని ముడిచి భయంకరుడైనంతనే ఒక మహాతేజస్సు జనించింది. ఆ తేజోమండలం నడుమ ఒక దివ్య పురుషుడు ఆవిర్భవించి, ఆ మహదేవుడికి ప్రణమిల్లాడు.
‘‘్ధవళ శరీరా! నోరు తెరచి బ్రహ్మాండాన్ని పండ్లు నాటకుండా మ్రింగివేనా? మహీధరాలని కాలదండంతో పిండీగుండా అయే విధంగా కొట్టివేయనా?
మహేశ్వరా! సర్పచక్రవర్తి అయిన శేషుడి తలలు అదిమిపోయే రీతిగా కాలితో తన్నివేయనా? చంద్రకళాకిరీటా! సమస్త దిక్కుల్ని చేవాడి గోళ్లతో చీల్చివేయనా? ఏమి చెయ్యాలి?నాకు ఆన ఇవ్వు’’ అటూ మరల మ్రొక్కి బాహువులు ఆస్ఫాలించాడు. ఆ మహాధ్వనివల్ల సంక్షోభించి పొంగి పొర్లి సప్త సముద్రాలు కలగుండు పడునట్లుగా ఆ శంభుడి కుమారుడు -
అంత ఆ వాక్కులు ఆలించి, రుద్రుడు అతడి రౌద్రాద్రేకానికి, వీర రస రేఖ ముద్రకీ ప్రమోదం పొందాడు. పిమ్మట ‘‘్భద్రా! నీకు వీరభద్రుడు అనే పేరిచ్చాను. ఆటంకాలు, విఘ్నాలు కలుగకుండా దక్షుడి యజ్ఞాన్ని నాశనం కావించు.
అక్షౌహిణి సంఖ్య కల ప్రమథ సేన నీకు సహాయంగా ఏతెంచుతారు’’ అని ఆజ్ఞాపించాడు. అప్పుడు వీరభద్రుడు ‘మహాప్రసాదం’ అని విరూపాక్షుడికి ప్రదక్షిణం చేసి దక్షిణాభిముఖుడు అయి ప్రమథ బలం ఆటోపంతో అరిగాడు.

-ఇంకాఉంది