అక్షరాలోచన

కాస్సేపు దుఃఖాన్ని అలా విసిరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాదనుకున్న
నీతనంలోంచి
ఎపుడు బయటపడ్డానో
సరిగ్గా తెలియరాలేదు కానీ...

ఒకింత నీ కోసం
నెమ్మదిగా నెమ్మదిగా తెరచిన కిటికీలు
మల్లెతీగల్లా నీ చుట్టూ అల్లుకునే బంధాలు
నీ కోసం అలసి ఆరాటపడే క్షణాలు
నాలో నీవు సగమవ్వాలన్న ప్రార్థనలు
మంచు తెరల వెంట
ముత్యాల్లా హత్తుకుంటూ దొర్లేవి.

చుట్టూ పక్షుల్లా మనం వేలాడినా
ఎక్కడో ఒక పొసగనితనం
ఒక అమాయకత్వం
ఒక తెలియని ఆరాధన
చిగురుటాకుల్లా వొణికిపోయాయి.

నీ వెనె్నల ఎడారి వెంట
నీ కోసం ఒక నీడలా ఒక నేను

నీవు కురియలేదు
నేను మరువలేదు

అలా చీకట్లే రాలిపోయాయి
దుఃఖపడ్డ కాలాలే పేలిపోయాయి

ఒక సుఖానికి ఒక దుఃఖానికి
నిలువుటద్దంలా నిలిచిన ఒక నేను

ఆరాధకుడిగా
కాస్సేపు దుఃఖాన్ని అలా విసిరి
నన్ను నాలో స్నానించుకుంటాను.

ఈ కాసేపు సుఖాన్ని
వెనె్నల సమీరంలో
తైలవర్ణ చిత్రంగా చిత్రించుకుంటాను.
*

-గవిడి శ్రీనివాస్ 9966550601