జాతీయ వార్తలు

కాశ్మీర్‌లో భద్రత పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్ము, జనవరి 2: పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లో ఉగ్రవాదులు దాడికి తెగబడిన నేపథ్యంలో జమ్ముకాశ్మీర్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు. అన్ని ఎయిర్‌బేస్‌లు, ఎయిర్‌పోర్టులు, జమ్ము-పఠాన్‌కోట్ జాతీయ రహదారివెంట అధికంగా బలగాలను మోహరించారు. జమ్ముకాశ్మీర్‌లో ఉగ్రవాదుల నుంచి ఎటువంటి దాడుల ప్రమాదం లేకపోయినప్పటికీ, ముందస్తు జాగ్రత్తగా భద్రతను కట్టుదిట్టం చేశామని డిజిపి రాజేంద్ర కుమార్ పిటిఐ వార్తా సంస్థకు తెలిపారు. హేవే వెంబడి పోలీసు బారికేడ్లను ఏర్పాటు చేసి వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నట్లు తెలిపారు. పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌లోకి ఉగ్రవాదులు చొరబడ్డారన్న విషయం తెలిసిన వెంటనే ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షించినట్లు డిజిపి తెలిపారు. ఇండో పాక్ సరిహద్దు వెంబడి భద్రతను పెంచడంతోపాటు తాను సైతం స్వయంగా సంచరించినట్లు తెలిపారు. అన్ని పోలీసు స్టేషన్లను అప్రమత్తం చేయడంతోపాటు విజిలెన్స్‌ను పెంచినట్లు ఆయన వివరించారు. జమ్ము-పఠాన్‌కోట్ హైవేలో అదనంగా చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి అనుమానాస్పద వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నట్లు తెలిపారు. జమ్ము, కాశ్మీర్ ఎయిర్ పోర్టులతోపాటు అన్ని ఎయిర్‌బేస్‌ల వెలుపల భద్రతను పెంచినట్లు తెలిపారు.
గుజరాత్ అప్రమత్తం
అహ్మదాబాద్: పఠాన్‌కోట్‌లో ఉగ్రవాదుల దాడి సంఘటన వెంటనే గుజరాత్ పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. రాష్టవ్య్రాప్తంగా హైఅలర్ట్‌ను ప్రకటించి, అనుమానాస్పద వ్యక్తులపై నిఘాను పెంచారు. సంఘటన తెలిసిన వెంటనే పోలీసులతోపాటు, సంబంధిత విభాగాలను అప్రమత్తం చేశామని రాష్ట్ర డిజిపి పి.సి.్ఠకూర్ విలేఖరులకు తెలిపారు. బస్సు స్టాపులు, రైల్వే స్టేషన్లలో ప్రత్యేక దళాలను మోహరించినట్లు ఆయన వెల్లడించారు. ఇండో-పాక్ సరిహద్దు ప్రాంతాలైన కచ్, బనాస్‌కంత జిల్లాల్లో భద్రతా దళాలను అప్రమత్తం చేసినట్లు డిఐజి ఎ.కె.జడేజా తెలిపారు. అలాగే కోస్టల్ కారిడార్ ప్రాంతంలోనూ భద్రతను ముమ్మరం చేసినట్లు తెలిపారు.